ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగితే చాలు...

Green Coffee Benefits : ఈ రోజుల్లో అమెరికా నుంచీ అనకాపల్లి దాకా... అంతటా కనిపిస్తున్న సమస్య అధిక బరువు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంతమంది బరువు తగ్గలేరు. అలాంటి వారికోసమే ప్రకృతి ఇచ్చింది ఈ అద్భుతాన్ని. అదేంటో తెలుసుకోండి మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 29, 2020, 4:32 AM IST
ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగితే చాలు...
ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు గ్రీన్ టీ. దీని వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు  ఉన్నాయని చాలా మంది దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గటమే కాకుండా గుండె సంబధిత వ్యాధులు , క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయకుండా చేస్తుంది.
  • Share this:
మీరు గ్రీన్ టీ ప్రయోజనాలు తెలుసుకునే ఉంటారు. అలాంటిదే ఈ ఏడాది ఎక్కువగా వినియోగంలోకి వచ్చినది గ్రీన్ కాఫీ. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్ చెయ్యగలదు. దీని అద్భుతమైన ప్రయోజనాలు తెలిసి... ప్రపంచ దేశాలన్నీ కోట్లు ఖర్చుపెట్టి గ్రీన్ కాఫీని కొంటున్నాయి. గ్రీన్ కాఫీని గ్రీన్ కాఫీ గింజల పొడి నుంచీ తయారుచేస్తారు. మామూలుగా కాఫీ గింజల్ని వేయిస్తారు (రోస్ట్). గ్రీన్ కాఫీ గింజలను రోస్ట్ చెయ్యరు. రోస్ట్ చేసే గింజలు జీవం కోల్పోతాయి. వాటిలోని క్లోరోజెనిక్ యాసిడ్ గాలిలో ఆవిరైపోతుంది. కెఫైన్ మాత్రం రోస్టింగ్ ప్రక్రియకు ప్రభావితం కాకుండా అలాగే ఉంటుంది. అందువల్ల రోస్ట్ చేసిన కాఫీ గింజల్లో కెఫైన్ ఉంటుంది కానీ ముఖ్యమైన క్లోరోజెనిక్ యాసిడ్ మాత్రం ఉండదు. మన శరీరాన్ని క్రమపద్ధతిలో (మెటబాలిజం) ఉంచడానికీ, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చెయ్యడానికీ ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తోంది.

1.బరువు తగ్గుదల, డయాబెటిస్ కంట్రోల్ : క్లోరోజెనిక్ యాసిడ్‌కి కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు)ని పీల్చేసే లక్షణం ఉంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ రెండు లక్షణాల వల్ల మనం బరువు తగ్గుతాం. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ యాసిడ్ శరీరంలోని కొవ్వును కరిగించేసి, మనకు తీరైన శరీరాకృతిని ఇస్తుంది.

2. యాంటీఆక్సిడెంట్ గుణాలు : ఈ రోజుల్లో మనకు అడ్డమైన రోగాలొస్తున్నాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే రోజూ గ్రీన్ కాఫీ తాగేస్తే సరి. ఎందుకంటే ఇందులో శరీరంలోకి విష వ్యర్థాల్ని రాకుండా అడ్డుకునే గుణాలున్నాయి. ఇవి బీపీని కూడా తగ్గిస్తాయి. మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి ఇప్పుడు గ్రీన్ కాఫీ తాగిస్తున్నారు. కొంతవరకూ ప్రయోజనం కనిపిస్తోందట. ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు, పరిశోధనలూ జరుగుతున్నాయి.

green coffee for weight loss, green coffee, green coffee bean, weight loss, how to make green coffee, green coffee beans, green coffee bean extract, green coffee health benefits, green coffee weight loss, green coffee beans for weight loss, weight loss green coffee, green coffee side effects, when to take green coffee, గ్రీన్ కాఫీ, బరువు తగ్గుట, గ్రీన్ కాఫీ ప్రయోజనాలు, గ్రీన్ కాఫీ నష్టాలు, గ్రీన్ కాఫీతో జాగ్రత్త, గ్రీన్ కాఫీ లాభాలు
గ్రీన్ కాఫీ గింజలు


3. కెఫైన్‌తో జాగ్రత్త : కాఫీలో ఎంత కెఫైన్ ఉంటుందో, గ్రీన్ కాఫీలోనూ అంతే కెఫైన్ ఉంటుంది. అందువల్ల ఈ కాఫీని అతిగా తాగకూడదు. రోజుకు రెండు కప్పులు చాలు. అంటే రోజుకు 200 నుంచీ 400 మిల్లీగ్రాముల కాఫీ పొడి మించి వాడకపోవడం మేలు.

ఎక్కువగా తాగితే కెఫైన్ వల్ల నిద్రలేమి (నిద్ర సరిగా పట్టకపోవడం) వస్తుంది. విశ్రాంతి లేనట్లు (restlessness) అనిపిస్తుంది. పొట్టలో గడబిడ, వికారం, వామ్టింగ్ (vomiting), గుండె వేగంగా కొట్టుకొనడం, ఆతృత, తలనొప్పి, చెవుల్లో రివ్వుమని శబ్దం, గుండె కొట్టుకునే వేగం లయ తప్పడం లాంటి సమస్యలొస్తాయి. అయితే ఇవన్నీ రోజుకు ఐదారు కప్పులు తాగేవాళ్లకు వస్తాయి.

రోజూ రెండు కప్పులు తాగినా సన్నబడుతున్నట్లు అనిపించకపోతే, అప్పుడు చిన్నపాటి ఎక్సర్‌సైజులు చెయ్యడం మంచిదే. ఐతే... ఈ కాఫీని కొత్తగా కనుక్కున్నారు. ఇది రోజుకు ఎన్ని కప్పుల దాకా తాగవచ్చో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి రిపోర్టులు వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు డాక్టర్లు చెప్పినదాన్ని బట్టీ సరిపడా డోస్ తీసుకుంటే, బరువు తగ్గడం సమస్యే కాదు.
First published: June 29, 2020, 4:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading