Home /News /life-style /

FOR FLOWING AND BEAUTIFUL SKIN TRY THESE CARROT JUICE PACK YOUR SKIN WOULD HEALTHY AND BETTER PRV

skin care tips: చర్మం ప్రకాశవంతంగా ఉండాలా? అయితే ఈ క్యారెట్​ ప్యాక్​ వాడండి.. చర్మం వెలిగిపోతుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముఖంపై నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. కొన్ని ప్యాక్​లతో మీ చర్మం అందంగా, ప్రకాశవంతంగా చేసుకోవచ్చు.

    చాలా మంది అందం (beauty) గా లేమని బాధపడుతూ ఉంటారు. అయితే వారి చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు (Black spots) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు (creams) వాడి వాటిని కనిపంచకుండా చేసినా.. అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే (Black spots)  కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు.  వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు.

    అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots)  వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని, బాదని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. కొన్ని ప్యాక్​లతో (skin care tips) మీ చర్మం అందంగా, ప్రకాశవంతంగా చేసుకోవచ్చు.

    చర్మం తాజాగా మారడానికి, ముఖ సౌందర్యం ( Face Beauty ) పెంచుకోడానికి కూడా క్యారెట్ బాగా పని చేస్తుంది. క్యారెట్ జ్యూస్, పెరుగు, ఎగ్ వైట్ లను సమపాళ్లలో కలుపుకుని..ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచుకుని గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం ఫ్రెష్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ( Oily skin ) ఉన్నవారికి సైతం క్యారెట్లతో చాలా ప్రయోజనం కలుగుతుంది. ఒక కప్పు క్యారెట్ జ్యూస్ ( Carrot juice ) లో ఒక్కో టేబులు స్పూన్ పెరుగు, శెనగ పిండి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి.

    ఓ అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే..ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు. క్యారెట్ ( Carrot ) సగం ముక్కను తురుం చేసి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో పేస్ట్ గా చేయాలి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాలు వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం చల్లని నీళ్లతో కడగాలి. క్రమం తప్పకుండా ఇలే చేస్తే.. మీ చర్మం చర్మం తేమగా..మృదువుగా ఉంటుంది. ఇదే మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ ( Carrot paste as face pack ) ‌గా వేసుకోవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు