Home /News /life-style /

FOR DARK NECK FOLLOW THESE TIPS TO REMOVE THAT PVN

Dark neck : మెడ దగ్గర నల్లగా ఉందా..ఇలా చేస్తే సులువుగా పోతుంది

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

dark neck : తరచుగా మనం మన ముఖం, చేతులు, కాళ్ళ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము కానీ మెడను విస్మరిస్తుంటాం. మెడ ,దాని చుట్టుపక్కల ప్రాంతం క్రమంగా నల్లగా మారడానికి, పొరలు దానిపై స్థిరపడటానికి ఇదొక కారణం. క్లీన్ చేసే సమయానికి అవి అంత తేలికగా పోకుండా మొండిగా తయారవుతుంటాయి.

ఇంకా చదవండి ...
Tips To Remove Dark Around Neck : తరచుగా మనం మన ముఖం, చేతులు, కాళ్ళ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము కానీ మెడను(Neck) విస్మరిస్తుంటాం. మెడ ,దాని చుట్టుపక్కల ప్రాంతం క్రమంగా నల్లగా(Dark) మారడానికి, పొరలు దానిపై స్థిరపడటానికి ఇదొక కారణం. క్లీన్ చేసే సమయానికి అవి అంత తేలికగా పోకుండా మొండిగా తయారవుతుంటాయి. మెడ చుట్టుపక్కల ఉండే నలుపుని పొగొట్టేందుకు.. వాటిని శుభ్రం చేయడానికి ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటారు. అయితే ఇది చర్మానికి మరింత హాని కలిగించే అవకాశముందంట. కానీ మీరు ప్రత్యేకమైన హోమ్ రెమిడీస్ ని ఉపయోగిస్తే, మీరు ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. దీని కోసం మీకు అలోవెరా జెల్ అవసరం, ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలబంద సహాయంతో మీ మెడను అందంగా మరియు మచ్చలు లేకుండా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.

అలోవెరాతో నిమ్మకాయను ఉపయోగించడం
ముందుగా ఒక చెంచా అలోవెరా జెల్‌ని తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఇప్పుడు కావాలంటే దానికి తేనె, రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. దీన్ని మిక్స్ చేసి మీ మెడ అంతటా బాగా అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు అప్లై చేస్తే చాలా తేడా కనిపిస్తుంది.

Skin Care Tips For Men : మెరిసిపోయే చర్మం కోసం..వర్షాకాలంలో పురుషులు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

అలోవెరాతో పసుపును ఉపయోగించడం
3 చెంచాల అలోవెరా జెల్‌లో చిటికెడు పసుపు,అర టీస్పూన్ శెనగపిండిని కలపండి. ఇప్పుడు దీన్ని పేస్ట్‌లా చేసి మెడకు పట్టించాలి. అరగంట పాటు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి 3 సార్లు వాడితే మెడ త్వరగా క్లియర్ అవుతుంది.

Chanakya Niti : గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకునే ఆరు విషయాలు ఇవే

అలోవెరాతో దోసకాయను ఉపయోగించడం
2 టీస్పూన్ల అలోవెరా జెల్‌లో 2 టీస్పూన్ల దోసకాయ రసాన్ని మిక్స్ చేసి మీ మెడ మొత్తానికి అప్లై చేయండి. అరగంట తర్వాత కడిగేయాలి. దీన్ని ఉపయోగించడం వల్ల పొడి, నలుపు రెండూ పోతాయి.



అలోవెరాతో పెరుగును ఉపయోగించడం
2 టీస్పూన్ల అలోవెరా జెల్‌తో 1 టీస్పూన్ పెరుగు,కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి మీ మెడ మొత్తానికి అప్లై చేయండి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అలోవెరాతో ముల్తాని మిట్టిని ఉపయోగించడం
1 టీస్పూన్ కలబంద జెల్‌లో సమాన మొత్తంలో ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్ మిక్స్ చేసి.. ఈ పేస్ట్‌ను మెడపై అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో మెడలోని నలుపు సులువుగా పోతుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Lifestyle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు