హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dates Health: రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... ఇవీ ప్రయోజనాలు

Dates Health: రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... ఇవీ ప్రయోజనాలు

ఖర్జూరాలు (File)

ఖర్జూరాలు (File)

Health Benefits of Dates : మన దేశంలోని ఆలయాల్లో ఖర్జూరాల్ని ప్రసాదంగా ఇస్తుంటారు. ఇందుకు బలమైన కారణం ఉంది.

ఈ సృష్టిలో ఖర్జూరాలు మన అదృష్టం కొద్దీ పుట్టిన ఫలాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి తియ్యగా ఉండటమే కాదు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. అవి మన శరీరానికీ, బ్రెయిన్‌కీ ఎంతో మేలు చేస్తున్నాయి. రోజుకు మూడు చొప్పును మెత్తటి, గుజ్జు లాంటి ఖర్జూరాల్ని వారం పాటూ తింటే... మన శరీరంలో చాలా మార్పులొస్తాయి. అన్నీ మనకు మేలు చేసేవే.  అవేంటంటే...

1. కొలొన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది : ఖర్జూరాలు చక్కగా జీర్ణం అవ్వడమే కాదు... ఇవి ఆహారనాళం, పెద్ద ప్రేగును బ్యాక్టీరియా నుంచీ దూరం చేస్తాయి. అందువల్ల అత్యంత ప్రమాదకరమైన కొలొన్ క్యాన్సర్ బారి నుంచీ పెద్ద ప్రేగును కాపాడినట్లవుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఖర్జూరాలు మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి.

2. ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది : ఖర్జూరాల్లో సహజ సిద్ధ చక్కెర, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ పదార్థాలుంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. ఎనర్జీ బార్స్, డ్రింక్స్‌లా కాకుండా... ఖర్జూరాల్లో ఫైబర్ (పీచు పదార్థం), పొటాషియం, మాంగనీస్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ (విషవ్యర్థాల్ని అడ్డుకునే గుణాలు) ఉంటాయి. అవి ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుతాయి.

3. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది : మలబద్ధకాన్ని నివారించడంలో ఖర్జూరాలు బాగా సహకరిస్తాయి. ఓ కప్పు ఖర్జూరాల్లో 12 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటుంది. ఇది రోజువారీ కావాల్సిన పీచు పదార్థంలో 48 శాతం భర్తీ చేస్తుంది. ఈ పీచు పదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

4. తెలివైన వారవుతారు : ఖర్జూరాల్లో విటమిన్ బీ6 ఉంటుంది. అది బ్రెయిన్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలోని సెరోటోనిన్... మన మూడ్‌ని సరిచేస్తుంది. ఖర్జూరాల్లోని నోరెపిన్‌ఫ్రైన్... మనలోని ఒత్తడి, టెన్షన్లను తగ్గిస్తుంది. విటమిన్ బీ6 తక్కువగా ఉన్నవారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. టెన్షన్ తగ్గినప్పుడే మన మూడ్ బాగుంటుంది. అప్పుడు మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది.

5. గుండెకు మేలు : ఖర్జూరాల్లోని పొటాషియం... మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది... మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో పేరుకుంటుంది. అది ఎక్కువైనప్పుడు... రక్త సరఫరా ఆగి... హార్ట్ ఎటాక్, గుండె జబ్బు లాంటివి వస్తాయి. పొటాషియం వల్ల గుండె సంబంధిత జబ్బులు, సమస్యలూ తగ్గుతాయి. ఎక్కువకాలం జీవించేందుకు వీలవుతుంది.

చూశారా... వారం పాటూ రోజుకు 3 ఖర్జూరాల చొప్పున తింటే ఎంత ప్రయోజనం కలుగుతోందో. ఇంకెందుకాలస్యం నాణ్యమైన ఖర్జూరాల ప్యాకెట్ కొనుక్కోండి. ఓ వారం తినేయండి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఎంత తిన్నా తప్పు లేదు కదా.

First published:

Tags: Health Tips, Life Style, Tips For Women, Women health

ఉత్తమ కథలు