హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Acne free skin: ఇంట్లో ఈజీగా దొరికే ఈ ఫుడ్స్‌తో యాక్నెకు చెక్‌ పెట్టొచ్చు!

Acne free skin: ఇంట్లో ఈజీగా దొరికే ఈ ఫుడ్స్‌తో యాక్నెకు చెక్‌ పెట్టొచ్చు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చర్మం బ్యూటిఫుల్‌గా ఉండాలంటే అంతే మంచి ఫుడ్‌ తీసుకోవాలి. ముఖ్యంగా మెలనిన్‌ కారణంగా పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుంది. స్కిన్‌కు లేజర్‌ ట్రీట్మెంట్‌ లేదా ఇతర ఏ రసాయనక తొక్కలతో కూడా క్లీయర్‌ స్కిన్‌ లభించదు. మంచి ఆహారంతోనే ఇది సాధ్యమవుతుంది.

ఇంకా చదవండి ...

మీరు మొటిమలు, బ్లాక్‌హెడ్స్, రంధ్రాలు ఇతర పిగ్మెంటేషన్‌ (pigmentation)  సమస్యతో బాధపడుతున్నారా? అయితే, మరెందుకు ఆలస్యం ఇంట్లో దొరికే ఈ సులభమైన పదారాల్థతో.. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.  ప్రతిరోజూ రెండు వంతుల ఫ్రూట్స్‌ ఉంటే..ఐదు వంతుల వెజిటెబుల్స్‌ తీసుకోవాలి. సెలినియం, జింక్, ఒమేగా3 విటమిన్‌ ఈ పదార్థలైన.. సన్‌ఫ్లవర్‌ సీడ్స్, జామ, కివి, ఆరెంజ్, ఎగ్స్, సీవీడ్స్, పప్పుధాన్యాలు తీసుకోవాలని చర్మ సంబంధిత వైద్య నిపుణులు చెబుదున్నారు.

దీంతోపాటు ప్రతిరోజూ ఎక్కువ నీటిని తాగాలి. 75 శాతం మన శరీరంలో నీరుతో కూడుకుంది. ప్రతి 27 రోజులకు ఒకసారి కొత్త కణాలు పుట్టుకువస్తాయి. మంచి ఆహారం, నీరు తీసుకోవడం వల్ల కేవలం ఒక నెలలోనే మీ స్కిన్‌ క్లియర్‌గా తయారవుతుంది.

తీసుకోవాల్సిన ఆహారం..

ఫిష్‌..

వారానికి రెండుసార్లు ఆయిలీ ఫిష్‌ను తినడం వల్ల మంచిది. అందులో సాల్మన్‌ (salmon) రకం చేపలు తినాలి. దీంతో మీ స్కీన్‌ కాంతివంతంగా తయారవుతుంది. ఫిష్‌లో ఒమెగా 3 తోపాటు విటమిన్‌ ఈ, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖం పై యాక్నె రాకుండా చేస్తుంది.

ఫిష్‌ ఆయిల్‌..

ఫిష్‌ ఆయిల్‌ తీసుకోవడం వల్ల కూడా చర్మం క్లియర్‌గా మారుతుంది. 1200 మి.గ్రా ఫిష్‌ ఆయిల్‌ సాఫ్ట్‌ జెల్‌ను వాడవచ్చు.

ఫ్లాక్స్‌ సీడ్స్‌...

ఫ్లాక్స్‌ సీడ్స్‌ (flax seeds) చాలా అద్భుతమైన వెజిటేరియన్‌ ఒమెగా 3. ఇందులో వాటర్‌ మిమ్మల్ని హైడ్రేట్‌ చేస్తుంది. ప్రతిరోజూ రెండు టేబుల్‌ స్పూన్ల ఫ్లాక్స్‌ సీడ్స్‌ తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న యాక్నెకు చెక్‌ పెట్టవచ్చుజ. దీంతోపాటు ముఖం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

ఫ్లాక్స్‌ సీడ్‌ స్కిన్‌ పీహెచ్‌ లెవల్‌ను సమతూల్యంగా ఉంచుతుంది. యాక్నెకు మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది. ఫ్లాక్స్‌ సీడ్‌కు బదులుగా 500 మి.గ్రా ఫ్లాక్స్‌ సీడ్‌ ఆయిల్‌ను తీసుకోవచ్చు.

టమాట..

టమాట ప్రతి ఇళ్లలో ఉండేది. ఇందులో లైకోపిన్‌ పుష్కలంగా ఉంటుంది. నేరుగా కూడా స్కిన్‌పై అప్లై చేసుకోవచ్చు. తింటే కూడా స్కిన్‌ హైడ్రేట్‌గా ఉంటుంది. ప్రతిరోజూ ఒక టమాటతోపాటు కొబ్బెర మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే వారంలో మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

లెమన్‌ వాటర్‌..

దీంతో దాదాపు 90 శాతం చర్మ సమస్యలు తగ్గిపోతాయి. రెండు గ్లాసుల చక్కెర లేని లెమన్‌ వాటర్‌తో మీ చర్మం మృదువుగా మారుతుంది. లేకపోతే కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవచ్చు.

కొల్లాజెన్‌ ఫుడ్‌..

ఇది కొత్త ట్రెండ్‌. కొల్లజెన్‌ ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం. స్మోకింగ్, వాతావరణ కాలుష్యం, యూవీ రేస్‌ స్కిన్‌పై ఉండే కొల్లాజెన్‌ పాడు చేస్తుంది. దీంతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. ఫిష్, చికెన్, ఎగ్‌వైట్, సిట్రస్‌ ఫ్రూట్స్, బెర్రీస్, రెడ్‌ లేదా పసుపు రంగు కూరగాయలు, వెల్లుల్లి తీసుకుంటే కొల్లాజెన్‌ సంబంధిత సమస్య తీరిపోతుంది. వీట్‌గ్రాస్, స్పీనచ్, బార్లీ సీడ్స్, అల్ఫాల్ఫా కొల్లాజెన్‌ పెరగటానికి సాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

First published:

Tags: Face mask, Vegetables

ఉత్తమ కథలు