వీర్యవృద్ధికి కావాల్సిన ఆహారం ఇదే...ఇవి రెగ్యులర్‌గా తింటే ప్రతీరోజూ పండగే...

స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కలగక అనేక ఇబ్బందులు పడుతున్నారు, అయితే కొందరు నిపుణులు మంచి ఫుడ్ తింటే కౌంట్ బాగా పెరుగుతుంది అంటున్నారు.

news18-telugu
Updated: August 10, 2020, 12:14 AM IST
వీర్యవృద్ధికి కావాల్సిన ఆహారం ఇదే...ఇవి రెగ్యులర్‌గా తింటే ప్రతీరోజూ పండగే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మన్మధ సామ్రాజ్యంలో దూసుకువెళ్లాలి అంటే కచ్చితంగా మంచి డైట్ ఫాలో అవ్వాలి. లేకపోతే మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరచలేరు. సెక్స్ లైఫ్ సాఫీగా సాగాలి అంటే పురుషుడికి స్పెర్మ్ కౌంట్ కూడా చాలా ముఖ్యం, అయితే ఇలా స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కలగక అనేక ఇబ్బందులు పడుతున్నారు, అయితే కొందరు నిపుణులు మంచి ఫుడ్ తింటే కౌంట్ బాగా పెరుగుతుంది అంటున్నారు. ముఖ్యంగా రోజు గ్లాసు పాలు తీసుకోవడంతో పాటు, బాదం పప్పు కూడా నానబెట్టింది తీసుకోవాలి, కోడి గుడ్డు ఉడకబెట్టింది తీసుకోవాలి. ఇక వెల్లుల్లి కూడా మీ ఆహారంలో బాగా వాడాలి, అలాగే మునగ కాడ వాడండి, మునగ ఆకు మునగ కాడ చాలా మంచిదని సూచిస్తున్నారు. ఇక ములక్కాయల కూర స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుందని సూచిస్తున్నారు.

ఇక మాంసాహారంలో చేపలను బాగా తీసుకోవాలి...అందులో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. షెల్ ఫిష్, సాల్మన్, మాక్ రెలే వంటివి తింటే బెటర్. ఇక పాలకూర తినడం కూడా చాలా మంచిది పప్పుగా దీనిని తీసుకోండి. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది వీర్య వృద్ధికి పనికివస్తుంది. అలాగే అరటిపండు బి 1, సి విటమిన్లు ఇందులో ఉంటాయి.. ఇవి స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి. ఇక పళ్ల రసాల్లో దానిమ్మ జ్యూస్ వారానికి రెండు సార్లు తాగండి, ఇక నారింజ పుచ్చ సిట్రిస్ జాతి ఫలాలు తింటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 12:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading