Health : సాయంత్రం వేళ ఈ జ్యూస్ తాగితే... ఎంతో ఆరోగ్యం...

Health : సాయంత్రం వేళ ఈ జ్యూస్ తాగితే... ఎంతో ఆరోగ్యం... (File)

Watermelon And Orange Juice : ఎండాకాలంలో వీలైనంతవరకూ లిక్విడ్స్ ఎక్కువగా తాగాలి. అందులోనూ జ్యూసెస్ చాలా మంచివి. ఈ జ్యూస్ సంగతేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Watermelon And Orange Juice : ఎండాకాలంలో మనకు మార్కెట్లలో పుచ్చకాయలు, కమలాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి రెండూ మనకు సమ్మర్‌లో ఎంతో ఎనర్జీ ఇచ్చే ఫ్రూట్స్. వేడి నుంచి చలవ చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పైగా వీటిలో సీ విటమిన్ సమ్మర్‌లో ఎంతో అవసరం ఉంటుంది. జనరల్‌గా మనం మధ్యాహ్నం భోజనం చేశాక... రాత్రి భోజనం చేస్తాం. ఈ మధ్యలో చాలా మంది టీ తప్ప ఇంకేవీ తాగరు. కానీ... సమ్మర్‌లో వేడి వల్ల... చాలా మంది టీ తాగరు. మరి పొట్టను ఖాళీగా ఉంచితే గ్యాస్ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి... సాయంత్రం వేళ పుచ్చకాయ, కమలం కాంబినేషన్‌లో జ్యూస్ తయారుచేసుకొని తాగమని డాక్టర్లు సూచిస్తున్నారు.

    Watermelon And Orange Juice తయారీకి కావాల్సినవి :
    - 2 కప్పుల గింజలు లేని పుచ్చకాయ ముక్కలు. మరీ ఎక్కువ చల్లగా ఉండేవి వద్దు. (ఫ్రిజ్ కూలింగ్ ఒంటికి మంచిది కాదు)
    - పావు కప్పు కమలాపండు రసం.
    - 2 టీస్పూన్ల పంచదార.
    - అర టీస్పూన్ నిమ్మరసం

    Watermelon And Orange Juice తయారీ విధానం :
    ఈ జ్యూస్ తయారుచేసుకోవడం చాలా తేలిక. పైన చెప్పిన అన్నింటినీ... మిక్సీలో వేసేయడమే. చక్కటి జ్యూస్ తయారవుతుంది. రెండు జ్చూస్ గ్లాసుల్లో పోసుకొని... అప్పుడే సూర్యుడు వెళ్లిపోయాక వచ్చే కాస్తంత చల్లగాలిని పీల్చుతూ... ఈ జ్యూస్ అలా అలా తాగుతూ ఉంటే... ఈవెనింగ్ ఎంతో ఆహ్లాదంగా అనిపించకమానదు. ఇలా రోజూ తాగొచ్చు. కాకపోతే... పంచదార వెయ్యకుండా తాగితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బయట అమ్మే ఐస్‌క్రీములు, ఇతరత్రా కంటే... ఇంట్లోనే తయారుచేసుకునే ఈ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే... మీరు రాన్రానూ ఎంతో ఆరోగ్యంగా మారిపోతారు. సహజంగా వచ్చే ఎన్నో రకాల వ్యాధులు పూర్తిగా రాకుండా పోతాయి.
    Published by:Krishna Kumar N
    First published: