Ugadi 2023 ఉగాది (Ugadi 2023) వచ్చిందంటే చాలు.. మనకు గుర్తుకువచ్చేది పచ్చడి, పోలెలు, పూర్ణం బూరెలు (Poornam boorelu) ఇంకా రకరకాల పిండి వంటలు ఉంటాయి. ఈరోజు మనం ఇంట్లోనే రుచికరమైన పూర్ణం బూరెలు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాాం.
కావాల్సిన పదార్థాలు..
మినపగుళ్లు- 1 కప్పు
బియ్యం -11/2 కప్పు
బెల్లం - 1 కప్పు
ఉప్పు -తగినంత
వంటసొడా-1/4 టీస్పూన్
యాలకుల పొడి తగినంత
నెయ్యి - టీస్పూన్
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం..
బియ్యం, మినపగుళ్లు రెండిటినీ విడివిడిగా కడిగి 4-6 గంటలపాటు నానబెట్టాలి. ఇప్పుడు ఈ రెండిటినీ కూడా విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండిటినీ విడివిడిగానే రుబ్బాలి. ఈ రెండిటినీ ఒక బౌల్ లోకి తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడ్ ఉప్పు , వంటసొడ వేయాలి. మీరు ఒకవేళ పిండిని గ్రైండర్లో వేసుకుంటే సొడా వేసుకునే అవసరం లేదు. కేవలం మిక్సీ లో రుబ్బుకునేవారు మాత్రమే యాడ్ చేయండి. అప్పుడే బూరెలు పొంగుతాయి. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపాలి. ఒకవేళ పిండి పలుచగా అనిపిస్తే కాస్త బియ్యం పిండి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఓ 2 గంటలపాటు పక్కనబెట్టుకోవాలి.
పూర్ణం తయారీ..
ఒక కప్పు పచ్చిచనగపప్పును ఒకసారి వాష్ చేసి నానబెట్టాలి. ఒక కప్పు పప్పుకు ఒక కప్పు నీరు పోసి ఓ అరగంట నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పును ఓ కుక్కర్లోకి తీసుకుని అందులో చిటికెడ్ పసుపు, ఉప్పు వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు చేతితో నలిపితే ఈజీగా నలగాలి. ఇప్పుడు పప్పులోని ఎక్కువగా ఉన్న నీటిని తీసేయాలి. ఇప్పుడు ఆ పప్పును రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి ఓ కప్పు బెల్లం వేసి వేయిస్తూ ఉండాలి. ఉండలకట్టకుండా జాగ్రత్త పడాలి.ఇప్పుడు యాలకులపొడిని తయారు చేసుకోవాలి. బెల్లం కరిగి సాఫ్ట్ అవుతే, యాలకులపొడిని యాడ్ చేయాలి. పప్పు అడుగు పడుతున్న సమయంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
చలబడిన తర్వాత బాల్స్ మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపాలి. ఒక బణాలిలో వేయించడానికి సరిపోయే నీటిని వేసి పూర్ణం బాల్స్ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి వేయించాలి. ఇది మీడియం ఫ్లేమ్ పై మాత్రమే చేయాలి. మొత్తం గోల్డెన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్ గా ఇంట్లోనే పూర్ణం బూరెలు తయారు చేసుకోవచ్చు.Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ugadi 2023