హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Ugadi 2023 special: రుచికరమైన నేతిబొబ్బట్లు తయారు చేసుకునే విధానం..

Ugadi 2023 special: రుచికరమైన నేతిబొబ్బట్లు తయారు చేసుకునే విధానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ugadi 2023 special: ఉగాది శుభ సందర్భంగా పరిపూర్ణమైన నేతి బొబ్బట్లను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Ugadi 2023 special: ఉగాది (Ugadi 2023) తెలుగువారికి నూతన సంవత్సరం, వసంతోత్సవం ప్రారంభం. 2023 మార్చి 22న అంటే బుధవారం జరుపుకుంటారు. ఇది తెలుగు (Telugu) వాళ్లకు ఎంతో ఉత్సాహంతో ఆచరించే చాలా ప్రత్యేకమైన రోజు. వేడుకల గురించి చెప్పాలంటే ఈరోజు చేసుకునే ఆహారం కూడా ప్రత్యేకమైంది. రుచికరమైన వంటకాలు లేకుండా ఏ పండుగ పూర్తి కాదు. నేతిబొబ్బట్లు అనేది ఉగాది పండుగరోజు ఆస్వాదించవలసిన సాంప్రదాయ వంటకం. ఈ శుభ సందర్భంగా నేతిబొబ్బట్లు లేదా భక్షాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం:

రెసిపీ..

చనగపప్పు -1 కప్పు -

నీరు- 2 కప్పులు

నెయ్యి- 2 టేబుల్ స్పూన్స్

బెల్లం- 3 కప్పులు

యాలకుల పొడి- 1/2 టీస్పూన్

సోంపు- 1/2 టీస్పూన్

ఉప్పు- చిటికెడు

మైదా లేదా గోధుమ పిండి-1 కప్పు

నూనె- 1 స్పూన్

ఇది కూడా చదవండి: Ugadi 2022: ఉగాది స్పెషల్.. రుచికరమైన పూర్ణంబూరెలు తయారీ విధానం..

తయారీ విధానం..

స్టెప్ 1: ప్రెషర్ కుక్కర్‌లో చనగ పప్పు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

స్టెప్ 2: ఇప్పుడు పంచదార/బెల్లం పప్పు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.

ఇప్పుడు యాలకుల పొడి, సోంపు, ఉప్పుతో పాటు జాజికాయ తురుము కూడా వేయాలి. ఇప్పుడు తక్కువ మంటలో కలుపుతూ ఉండాలని గుర్తుంచుకోండి. తర్వాత గ్యాస్‌ను ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

స్టెప్ 3: ఆ తర్వాత మైదా లేదా గోధుమ పిండితో పిండిని పిసికి కలుపుకోవాలి. పిండిపై మూతపెట్టి, మెత్తగా వచ్చేలా కొన్ని నిమిషాలు పక్కన పెట్టండి.

స్టెప్ 4: ఇప్పుడు పిండిని చిన్న బాల్స్ లా సిద్ధం చేయండి. వాటిని మీ అరచేతులతో కాస్త వెడల్పుగా చేయండి. దానికి కొద్దిగా నెయ్యి రుద్ది, మీరు పక్కన పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని అందులో వేసి. అంచులను చక్కగా మూసివేయండి.

ఇది కూడా చదవండి: Ugadi 2023: షడ్రుచుల ఉగాది పచ్చడిని ఇలా తయారు చేసుకోండి..

స్టెప్ 5: తర్వాత దానిని చపాతీలా రోల్ చేసి, నెయ్యితో అద్ది తవా లేదా పాన్‌పై ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి.

అంతే, ఎంతో రుచికరమైన నేతిబొబ్బట్లు వేడిగా వడ్డించడానికి సిద్ధంగా ఉంది.

ఈ సంతోషకరమైన ఉగాది సందర్భంగా మీ ప్రియమైన వారితో సంప్రదాయ మరియు ఆహ్లాదకరమైన నేతిబొబ్బట్లను ఆస్వాదించండి.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)

First published:

Tags: Ugadi 2023

ఉత్తమ కథలు