హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Diabetes: ఈ ఆహారం తీసుకుంటే డయాబెటిస్​ రాదట..

Diabetes: ఈ ఆహారం తీసుకుంటే డయాబెటిస్​ రాదట..

కాకరకాయ (bitter gourd) లో కెలరీలు, కొవ్వు (fat), కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్న రోగులకు కాకర కాయ ఓ వరం. కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిల (sugar levels)ను తగ్గిస్తాయి. కాకరలోని చార్న్‌టిన్ పెప్‌టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాకరలోని యాంటీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహకరిస్తాయి.

కాకరకాయ (bitter gourd) లో కెలరీలు, కొవ్వు (fat), కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్న రోగులకు కాకర కాయ ఓ వరం. కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిల (sugar levels)ను తగ్గిస్తాయి. కాకరలోని చార్న్‌టిన్ పెప్‌టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాకరలోని యాంటీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహకరిస్తాయి.

చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారు. అటువంటి వాళ్లు ఆహారం నుంచి వ్యాయామం వరకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. కనుక నిపుణులు చిట్కాలు పాటించడం మంచిది.


  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఈ ఆధునికి యుగంలో మన ఆహారపు అలవాట్లు మనకు చాలా రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అందులో ఎక్కువ మందికి డయాబెటిస్​ సమస్య. చాలా మంది డయాబెటిస్(diabetes) సమస్యతో బాధ పడుతున్నారు. అటువంటి వాళ్లు ఆహారం నుంచి వ్యాయామం వరకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. కనుక నిపుణులు చిట్కాలు పాటించడం మంచిది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు కార్బోహైడ్రేట్స్, కొలెస్ట్రాల్, సాల్ట్ వంటివి తగ్గించాలి. అదే విధంగా సమయానుసారం వైద్యులను సంప్రదించాలి. షుగర్ లెవెల్స్ ని రెగ్యులర్ గా చెక్ చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. బరువును బట్టి షుగర్ లెవెల్స్ ని బట్టి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఎన్ని కేలరీల తీసుకుంటే మంచిది అనేది కూడా తెలుసుకోవాలి. అలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, చేయగలం. అందుకని ప్రత్యేక శ్రద్ధ తప్పక తీసుకోవాలి. అయితే ఎవరు ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవడం అనేది ఓ సారి తెలుసుకుందాం..

  కార్బోహైడ్రేట్లు తప్పనిసరి..

  మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ పైన కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉండొచ్చు. పంచదార, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి తగ్గిస్తే మంచిది. కాబట్టి తప్పకుండా వీటిపై కూడా శ్రద్ధ పెట్టండి. భారతదేశంలో ఎక్కువగా 58 గ్రాముల వరకు పంచదారని రోజూ ఉపయోగిస్తారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకు దానిని తగ్గించడం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. కనుక షుగర్ ఎక్కువగా తినే వాళ్లు ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది.

  సాధారణ బరువు ఉండే వ్యక్తి BMI 18 నుంచి 23 ఉంటే మహిళలు 1,200 నుంచి 1,500 క్యాలరీలు తీసుకుంటారు. అదే పురుషులు అయితే 1,500 నుంచి 1,800 కేలరీలు తీసుకోవాలి. బరువు ఎక్కువగా ఉండే వాళ్లు తగ్గాలనుకుంటే 500 నుంచి 750 కేలరీలు తీసుకుంటే సరిపోతుంది .గ్లైసిమిక్ ఇండెక్స్ ని చూస్తూ ఉండాలి. ఎక్కువగా ఉంటే బ్లడ్ గ్లూకోస్ కూడా రోగిలో ఎక్కువగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువ ఉంటే దీనిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటానే. దీని కారణంగా కార్బోహైడ్రేట్స్ వేగంగా విడుదలవుతాయి. కింద షుగర్ కూడా పెరుగుతుంది. ఆహార పదార్థాలలో గ్లైసిమిక్ ఇండెక్స్ 55 లేదా అంత కంటే తక్కువగా ఉంటే తక్కువ గ్లైసైమిక్ ఇండెక్స్ గా పరిగణిస్తారు. అయితే తీసుకునే ఆహారంలో తక్కువ గ్లైసైమిక్ ఇండెక్స్ ఉంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా విడుదల అవుతాయి. ఉదాహరణకు మనం రోజూ తినే అన్నం లో గ్లైసైమిక్ ఇండెక్స్ 93 ఉంటుంది. అదే బ్రౌన్ రైస్ లో అయితే 50 ఉంటుంది. ఇలా గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటూ ఉండటం కూడా మంచిది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ayurveda health tips, Diabetes, Health benefits, Life Style

  ఉత్తమ కథలు