ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ మన జీవితాలను చాలా సులభతరం చేశాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా బయట ఫుడ్ తినాలంటే రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటికే మనకు నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకొని తినే అవకాశాన్ని ఇవి కల్పించాయి. పిజ్జా నుంచి ఐస్ క్రీం వరకు తీసుకొచ్చేది యాప్‌లు కాదు.. అందులో పనిచేసే డెలివరీ మ్యాన్ లు. అయితే ఇలా ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు మనకు మరింత చక్కటి అనుభవాన్ని అందించకుండా చేస్తాయి. అవేంటంటే..
అమెరికాకి చెందిన ఆనీ స్మిత్ తన ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత పోస్ట్ మేట్స్ అనే ఫుడ్ డెలివరీ యాప్ లో పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత తన సొంతంగా మార్కెటింగ్ ఏజెన్సీ ప్రారంభించినా కానీ డెలివరీ పర్సన్ గా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం మాత్రం ఆమె మానలేదు. తన బిజినెస్ లో మంచి లాభాలు సంపాదించే వరకు ఆమె ఇలా చేయడం కొనసాగించింది. ఆమె తాజాగా ద ఇన్ సైడర్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కస్టమర్లు చేసే కొన్ని తప్పిదాల వల్ల డెలివరీ ఏజెంట్లు ఎలాంటి ఇబ్బందులు పడతారో.. దీనివల్ల కస్టమర్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో వెల్లడించింది. తన అనుభవాల ఆధారంగానే ఆమె ఇవన్నీ వెల్లడించడం విశేషం. తన అనుభవం కేవలం పోస్ట్ మేట్స్ లోనే ఉన్నా మిగిలిన డెలివరీ యాప్స్ లోనూ ఇలాంటి సమస్యలు సహజంగా ఉంటాయని తాను భావిస్తున్నానని ఆమె వెల్లడించింది.
డెలివరీ పర్సన్ మీ అడ్రస్ కి ఆర్డర్ తీసుకొచ్చి ఇవ్వడానికి మీ ఇంటి నంబర్ బయట నుంచి క్లియర్ గా కనిపించేలా చూసుకోవాలి. తగిన లైటింగ్ కూడా ఉండేలా చూసుకోవాలి. తన కారు నుంచి చీకటిలో దిగి రోడ్డంతా తిరిగి చూసేదాన్ని అని చెప్పిందామె. తగినన్ని డెలివరీ సూచనలు అందించకపోవడం కూడా ఎక్కువ మంది చేసే తప్పేనని ఆమె వెల్లడించింది. ఇంటికి ఎలా రావాలో సూచనలతో పాటు ఇల్లు ఎలా ఉంటుందో కూడా చెబితే డెలివరీ చేసే వ్యక్తులు వాటిని సులువుగా కనుక్కునే వీలుంటుందని ఆమె సలహా. ఇలా చేయడం వల్ల ఆహారం తొందరగా అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food delivery, Life Style