Riceless Chicken Biryani: బియ్యం లేకుండా చికెన్ బిర్యానీ.. రుచి అమోఘం

రైస్‌లెస్ బిర్యానీకి ఏమేం కావాలి? ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

news18-telugu
Updated: August 13, 2020, 8:08 AM IST
Riceless Chicken Biryani: బియ్యం లేకుండా చికెన్ బిర్యానీ.. రుచి అమోఘం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చికెన్ బిర్యానీ.. ఈ పేరు వింటనే నోరు ఊరిపోతుంది. చాలా మందికి తమ ఆల్‌టైమ్ ఫేవరేట్ రెసిపీల్లో బిర్యానీ కూడా ఉంటుంది. ఎక్కువ మంది ఇష్టంగా లాగించే ఫుడ్ ఐటమ్ కూడా చికెన్ బిర్యానీయే. హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో చికెన్ బిర్యానీ క్రేజ్ మామూలుగా లేదు. ఈ క్రమంలోనే బిర్యానీల్లో ఎన్నో వెరైటీలు పుట్టుకొచ్చాయి. అందులో రైస్‌లెస్ చికెన్ బిర్యానీ (అన్నం లేని చికెన్ బిర్యానీ) ఒకటి. బిర్యానీ అంటే గుమగుమలాడే బాస్మతి బియ్యం ఖచ్చితంగా ఉండాలి. మరి బియ్యం లేకుండా బిర్యానీ ఎలా చేస్తారా? అని చాలా మందికి డౌట్ వచ్చిండొచ్చు. ఉత్తరాదిన చాలా మంది అన్నం తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారి కోసం పుట్టకొచ్చిందే ఈ రైస్‌లెస్ బిర్యానీ. వర్మసెల్లి (సేమియా)తో రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు.

కావాల్సిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ మలబార్ మిరియాలు, ఒక దాల్చి చెక్క ముక్క, 6 పచ్చ యాలకులు, 2 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ సోంపు, ఒక కప్పు సేమియా (వర్మిసెల్లి), 2 రెండు టేబుల్ స్సూన్స్ నెయ్యి, సగం టేబుల్ స్పూన్ షాహిజీరా, సగం టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 3 పచ్చి మిర్చిలు, సగం కప్పు పుదీనా ఆకులు, సగం కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 300 గ్రాముల చికెన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, సగం టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టమేటో, 2 కప్పుల నీళ్లు.

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. కాస్త వేడెక్కాక మలబార్ మిరియాలు, షాహిజీరా, దాల్చిన చెక్క, పచ్చ యాలకులు, స్టార్ అనీస్, లవంగాలు, సోంపు వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఆ మొత్తాన్ని బ్లెండర్‌లో వేసి మెత్తని మసాలా పొడిగా తయారు చేసుకోవాలి.

అదే పాన్‌లో వర్మిసెల్లి (సేమియా)ను కొంత నెయ్యి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాన్ని ఓ ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొంత ఆయిల్ వేసి నల్ల జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. కాసేపయ్యాక చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, ఇంతకు ముందు తయారుచేసుకున్న మసాలా పొడి వేసి మూతపెట్టాలి.

కాసేపయ్యాక టమేటోలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత రోస్ట్ చేసుకున్న సేమియా, ఉప్పు వేసి నీళ్లు పోయాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాలి. బిర్యానీ సిద్ధమైందని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ సేమియా బిర్యానీ (రైస్‌లెస్ బిర్యానీ)ని వేడి వేడిగా వడ్డించుకొని తింటే ఆ టేస్టే వేరే. మీరూ ఓసారి ట్రై చేయండి.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 7:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading