హోమ్ /వార్తలు /life-style /

Cooker Food: ఈ డాబాలో అన్ని కుక్కర్‌లోనే.. 10నిమిషాల్లోనే.. ఆర్డర్ రెడీ చేసి వడ్డిస్తారు..!

Cooker Food: ఈ డాబాలో అన్ని కుక్కర్‌లోనే.. 10నిమిషాల్లోనే.. ఆర్డర్ రెడీ చేసి వడ్డిస్తారు..!

కుక్కర్ డాబా

కుక్కర్ డాబా

కస్టమర్ వచ్చి ఆర్డర్ చేసి పది పదిహేను నిమిషాలు ఎదురుచూడగానే కుక్కర్‌లో వండిన వేడి వేడి ఆహారం కస్టమర్ టేబుల్‌పై ఉంటుంది. చికెన్, మటన్ , అన్నం వంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ ఆర్డర్ చేయడగానే తయారుచేస్తారు.

  • Local18
  • Last Updated :
  • Karnataka | Hyderabad

హోటల్స్, రెస్టారెంట్లు... డాబాలు మనం చాలా సందర్బాల్లో చాలా చోట్ల ఫుడ్ టేస్ట్ చేస్తుంటాం. ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైన స్టైల్... టేస్ట్ ఉంటుంది. అయితే చాలా చోట్ల పెద్ద పెద్ద పాత్రల్లో వంటకాలు వండి... అందైమన పాత్రల్లో తెచ్చి వడ్డిస్తుంటారు. కానీ ఓ డాబాలో మాత్రం వెరైటీగా వండుతున్నారు. ఇక్కడ మనం చూస్తే.. అన్ని కుక్కర్లలోనే వండి వార్చుతారు. నిమిషాల్లోనే... భోజనం రెడీ చేసి మన ముందు పెడతారు. ఇక్కడ మనకు కనిపించే కుక్కర్లను చూస్తే.. ఎవరైనా.. ఇది కుక్కర్‌ షాపు అని పొరపాటు పడతారు. ఇక్కడ వంట కుక్కర్‌లో జరుగుతుంది, వడ్డించేది కుక్కర్‌లో ఉంటుంది. ఈ కుక్కర్ దాబా? స్టోరీ ఏంటో చూద్దాం....

కర్నాటక రాష్ట్రం కలబురగిలోని కపనూర్ ఇండస్ట్రీస్ సమీపంలోని సంజయ్‌కు చెందిన సిటీ హైవే దాబా ఉంది. ఈ పేరు తెలిసిన వాళ్లందరు దీన్ని``కుక్కర్ దాబా'' అంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ వంట చేసినా కుక్కర్‌ నుంచే. ఆర్డర్‌ను స్వీకరించిన తర్వాత, కస్టమర్‌లు 10 నిమిషాలు వేచి ఉంటారు. అంతే పది నిమిషాల్లో వేడివేడిగా కుక్కర్‌లోనే వండిన రుచికరమైన ఆహారాన్ని వడ్డిస్తారు ఇక్కడ ఫుడ్ బాగా పాపులర్ అవ్వడంతో కుక్కర్‌ ఫుడ్ రుచి చూడడానికే నిత్యం వందలాది మంది వస్తుంటారు.

వినియోగదారులకు అందించే ఆహారం వేడిగా ఉండాలి. బాగా ఉడికించాలి కాబట్టి ఇక్కడ అన్నీ కుక్కర్ లోనే వండుతారు. కస్టమర్ వచ్చి ఆర్డర్ చేసి పది పదిహేను నిమిషాలు ఎదురుచూడగానే కుక్కర్‌లో వండిన వేడి వేడి ఆహారం కస్టమర్ టేబుల్‌పై ఉంటుంది. చికెన్, మటన్ , అన్నం వంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ ఆర్డర్ చేయడగానే తయారుచేస్తారు. ఏదీ ముందుగా రెడీ చేసి ఉంచరు. అందుకే ఈ దాబా అంత ఫేమస్ అయ్యింది. ఇక్కడ లభించే మరో ప్రత్యేక ఆహారం స్పెషల్ సితి రైస్. ఖాజు మరియు ఇతర డ్రై ఫ్రూట్స్ కుక్కర్‌లో ఉంచి వినియోగదారులకు గరమా గరం అన్నం అందిస్తున్నారు. ఈ రైస్ టేస్ట్ అనేది... కలబురగి ప్రజలను ఆకర్షిస్తోంది. మొత్తం మీద ఈ కుక్కర్ దాబా కలబురగిలో బాగా పాపులర్ అయిపోయింది.

First published:

Tags: Food, Karnataka

ఉత్తమ కథలు