హోలీ (Holi) వేడుకలను సంబరంగా చేసుకోవడంతో పాటు పండుగ సందర్భంగా ప్రజలు రుచికరమైన ఆహారం, పానీయాలను కూడా ఆస్వాదిస్తారు. స్పెషల్ డ్రింక్స్ సైతం లాగించేస్తుంటారు. హోలీకి ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ అతిగా తింటే.. ఓవర్ ఈటింగ్ కారణంగా అనారోగ్యాల ముప్పు ఎదురవుతుంది. అయితే ఈ సమస్యలను కొన్ని ఇతర ఫుడ్ ఐటెమ్స్‌తో దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
ఫైబర్-రిచ్ ఫుడ్స్
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ ఆహారాలు పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. హోలీ లేదా ఇతర సమయాల్లో అతిగా తినడం వల్ల తలెత్తే మలబద్ధకాన్ని నివారిస్తాయి. కాబట్టి, మీ ఆహారంలో ఫైబర్-రిచ్ ఫుడ్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
నీరు తాగాలి
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వివిధ కారణాల వల్ల కాలక్రమేణా పేరుకుపోయే హానికరమైన టాక్సిన్లను మీ శరీరం నుంచి బయటకు పంపడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. తిన్న ఆహారం సవ్యంగా జీర్ణం కావడంలోనూ వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తగినంత నీరు తాగినప్పుడు, ఇది మీ కడుపులోని ఆహారాన్ని సాఫ్ట్‌గా మార్చి వాటిని మరింత చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు మీ శరీరానికి పోషకాలు బాగా వంటపడతాయి.
మైండ్‌ఫుల్ ఈటింగ్
మైండ్‌ఫుల్‌గా తినడం ప్రాక్టీస్ చేయాలి. అంటే భోజనం చేసేటప్పుడు ఇతర ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఫుడ్ పైనే శ్రద్ధగా ఉండటం. ఇది మీరు అతిగా తినకుండా చేసి మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు మీ ఆహారంలోని రుచి, అనుభూతులపై శ్రద్ధ వహించడం కూడా ఒక భాగంగా ఉంటుంది.
ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్‌కి దూరం
ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు తినడం మానుకోవాలి. ఎందుకంటే వాటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి, ఇవి బరువు పెరుగుట, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వీటికి బదులుగా కాల్చిన (Grilled/baked) ఆహారాలు, తాజా పండ్లు, సలాడ్‌లు వంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి.
రెస్ట్
ఓవర్-ఈటింగ్ నుంచి మీ శరీరం కోలుకోవడానికి రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. మీ బాడీ రిపేర్ కావడానికి, యాక్టివ్‌నెస్ పెరగడానికి రోజూ రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.
ఎక్సర్‌సైజ్
హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి, డైజెషన్‌ను ఇంప్రూవ్ చేయడానికి, ఎండార్ఫిన్స్ అనే నేచురల్ మూడ్ బూస్టర్లను విడుదల చేయడానికి క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయాలి. ఎక్సర్‌సైజ్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.