Home /News /life-style /

ఈ షాపింగ్‌ చిట్కాతో మీ డబ్బు కచ్ఛితంగా ఆదా అవుతుంది!

ఈ షాపింగ్‌ చిట్కాతో మీ డబ్బు కచ్ఛితంగా ఆదా అవుతుంది!

షాపింగ్‌ మాల్స్‌ ఏవైనా గిఫ్ట్‌లు లేదా ఆఫర్లు పెట్టారంటే.. వాటికి మనం వాటికి త్వరగా ఆకర్షితులవుతాం. కానీ, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జేబుకు చిల్లు పడటం ఖాయం.

షాపింగ్‌ మాల్స్‌ ఏవైనా గిఫ్ట్‌లు లేదా ఆఫర్లు పెట్టారంటే.. వాటికి మనం వాటికి త్వరగా ఆకర్షితులవుతాం. కానీ, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జేబుకు చిల్లు పడటం ఖాయం.

షాపింగ్‌ మాల్స్‌ ఏవైనా గిఫ్ట్‌లు లేదా ఆఫర్లు పెట్టారంటే.. వాటికి మనం వాటికి త్వరగా ఆకర్షితులవుతాం. కానీ, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జేబుకు చిల్లు పడటం ఖాయం.

రాబోయేది పండగ సీజన్‌ festive season. ఇక అన్ని వర్గాల వారు షాపింగ్‌లు చేయడం ప్రారంభిస్తారు. కానీ, కొన్ని నియమాలు పాటించి షాపింగ్‌లు చేయడం మంచిది. దీంతో సమయంతోపాటు.. డబ్బు ఆదా అవుతుంది. మనలో చాలా మందికి ఇష్టమైంది షాపింగ్‌ shopping. అయితే, షాపింగ్‌లకు వెళ్లినపుడు ఆఫర్‌ ఉన్న ప్రతి వస్తువు కొనకుండా.. కేవలం మీకు ఏది కావాలో అదే కొనుక్కోండి. అది ఇంటి దగ్గరే లిస్ట్‌ రెడీ చేసుకోవాలి. దీనివల్ల మీకు టైంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

వివిధ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ఇస్తూనే ఉంటాయి. అలా అని బిల్లు గురించి పట్టించుకోకుండా.. ఖర్చు పెట్టేస్తే కష్టం కదా! బడ్జెట్‌లో వచ్చే వస్తువులను కొనుగోలు చేయాలి.
లిస్ట్‌ list తయారు చేసుకున్న తర్వాత షాపింగ్‌ వెళ్లి ఆఫర్‌ ఉన్న వస్తువు కాకుండా మీ జాబితాలో ఉన్నవి తీసుకోవాలి. అనవసర వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండాలి. మీ లిస్ట్‌ పూర్తయిన తర్వాత ఎక్కడ తక్కువ ధరల్లో లభిస్తాయో ఆన్‌లైన్‌ వివిధ పేపర్లలో వెతకాలి. దీనికి ఇరుగుపొరుగు వారి సమాచారంపై కూడా ఆధారపడవచ్చు.

సాధారణంగా అన్ని సంస్థలు పండగ సమయంలో ఆఫర్లను భారీగా ప్రకటిస్తాయి. ఇక్కడ కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ వస్తువులు కొనే ముందు వస్తువు తయారు చేసిన సమయం ఎక్స్‌పైరీ డేట్‌ను చూసుకోవాలి. కానీ, ఈ ఆఫర్లు ఇప్పుడు ఏడాది మొత్తం కనిపిస్తున్నాయి. వారంలో ఏదో ఒకరోజైనా ఆఫర్లను ప్రత్యేకంగా ఇస్తున్నారు. అందుకే అవకాశం మళ్లీ రాదేమోనని ఆందోళన పడవద్దు. ఇక రాబోయేది పండుగ సమయం కాబట్టి సహద్యోగులతో కలిసి ఓ నలుగురు అయిదుగురు బల్క్‌లో కొనుక్కోవాలి.

గ్రీన్‌ పీస్‌ రెగ్యూలర్‌గా తింటే ఏమవుతుందో తెలుసా?


కార్డులు ఉపయోగించాలి... కరోనా సమయం నుంచి ఎక్కువ శాతం ఆన్‌లైన్‌ చెల్లింపులకే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అలాగే, షాపింగ్‌ సమయంలో ఎక్కువ శాతం మీ వద్ద ఉన్న డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఉపయోగించాలి. ఈ సంస్థలు కూడా కొద్ది మొత్తం షాపింగ్‌పై కూడా రాయితీలను ప్రకటిస్తారు. అందుకే దీని వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. ఎలాగైనా.. పండగ సమయంలో బ్యాంకులు కార్డుల ద్వారా చేసే షాపింగ్‌లపై బ్యాంకులు అదనపు రివార్డు పాయింట్లను కూడా అందిస్తుంది. ఈ రివార్డు పాయింట్లతో గిఫ్ట్‌ వోచర్లను కూడా పొందవచ్చు.
Published by:Renuka Godugu
First published:

Tags: Online shopping

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు