హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..

చియా సీడ్స్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)

చియా సీడ్స్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)

body weight: ప్రస్తుతకాలంలో బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య  వేధిస్తుంది. మారిన జీవన విధానం, పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రస్తుతకాలంలో బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య  వేధిస్తుంది. మారిన జీవన విధానం, పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అధిక బరువుతో బాధపడేవారు నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి

  ఆకలి లేదనో, పని ఒత్తిడి ఇలా ఇతరత్రా బీజీ పనుల వల్ల ఉదయం టిఫిన్ తీసుకోకుండా ఉండిపోవటం ఆరోగ్యానికి ఎంతో హానికరం. టిఫిన్ తినకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేయడం వలన ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల శరీరంలోకి చెడు కొవ్వు చేరుతుంది. దీనితో భారీ కాయం ఏర్పడుతుంది. కావున ఉదయం టిఫిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

  తగినంత నీరు

  రోజుకి 3 లీటర్లు నీళ్ళు తాగాలి. పొద్దున నిద్ర లేవగానే ఎక్కువ మోతాదులో నీరు త్రాగ్రడం చాలా మంచిది, ఇలా చేస్తే మీకు ముత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. మనం ఏ ఆహారం తీసుకున్న ఎక్కువ నీరు తాగటం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అలాగే మన దేహంలో చెడు కొవ్వుని తగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

  పండ్లు, కూరగాయలు తినటం

  ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పండ్లు, కూరగాయాలలో ఎన్నో మంచి ప్రోటిన్స్, ప్రోటిన్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. పండ్లు తినడం ఇష్టం లేని వాళ్ళు పళ్ళ రసాలు తాగవచ్చు. రోజు పండ్లు, కురగాయాలు తినడం మన దేహం పైన ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనపడతారు.

  ఉప్పు, కారం, మసాలాలు తక్కువగా

  ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిదికాదు. మన జీర్ణ శక్తి ని దెబ్బతిస్తాయి. ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం వలన బిపి, అల్సర్, ఉబకయం వంటి సమస్యలు వస్తాయి. ఉప్పు, కారం మరియు మసాలాలు అధిక పరిమాణంలో తీసుకోవద్దు. తక్కువ మోతాదులో ఉపయోగించుకొండి. ఏ ఆహారం అయిన అధిక మొత్తంలో తీసుకోవటం ఆరోగ్యానికి హానికరం.

  మితంగా మాంసాహరం

  మంసహరాన్ని తినడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఎక్కువ మాంసాహరాన్ని తినడం వలన అజీర్తి,ఊబకాయం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మాంసాహారం ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. మాంసాహారం అధిక మోతాదులో తీసుకోవటం వల్ల జీర్ణప్రక్రియ మందగిస్తుంది.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Health Tips, Weight loss

  ఉత్తమ కథలు