హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Healthy Skin: ఆరోగ్యకరమైన చర్మం కావాలా?.. అయితే ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Healthy Skin: ఆరోగ్యకరమైన చర్మం కావాలా?.. అయితే ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లోనే కొన్ని సులభమైన టిప్స్ పాటిస్తూ అందాన్ని సులువుగా కాపాడుకోవచ్చు. మరి, మీ అందాన్ని కాపాడుకునేందుకు ఇంట్లోనే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.

కరోనా వల్ల బ్యూటీ పార్లర్లు, సెలూన్లు అన్నీ నిన్న మొన్నటి వరకు మూసే ఉన్నాయి. ఇప్పుడు తెరిచినా చాలామంది వాటికి వెళ్లడానికి భయపడుతున్నారు. ఎవరి వల్ల మనకు కరోనా వస్తుందో అన్న అనుమానం కూడా దీనికి కారణం. దీనివల్ల బ్యూటీ ట్రీట్‌మెంట్లకు చాలామంది దూరంగా ఉన్నారు. అయితే కరోనా భయం మనం అందంగా ఉండేందుకు అడ్డు కాదు. ఇంట్లోనే కొన్ని సులభమైన టిప్స్ పాటిస్తూ అందాన్ని సులువుగా కాపాడుకోవచ్చు. మరి, మీ అందాన్ని కాపాడుకునేందుకు ఇంట్లోనే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.

చాలా సులువైన టిప్స్ తో మీ చర్మం పాడు కాకుండా కాపాడుకోవచ్చు.

1. రోజూ సరైన సమయానికి తినడం, నిద్రపోవడం వంటివి చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మన చర్మం ఫ్రెష్ గా ఉండాలన్నా కానీ ఈ చిట్కానే పాటించాల్సి ఉంటుంది. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన డైట్, కనీసం కొద్దిపాటి వ్యాయామం మన చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బయట నుంచే ప్రయత్నిస్తుంటారు. కానీ లోపలి నుంచి అది ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవడం కూడా అత్యవసరం.

2. రోజూ సరైన స్కిన్ కేర్ రొటీన్ ని పాటించడం కూడా చర్మం అందంగా కనిపించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం మరీ పొడిబారిపోకుండా కాపాడుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు వాటర్ బేస్డ్, పొడి చర్మం ఉన్నవారు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడవచ్చు. దీనివల్ల మొటిమలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ముఖం కడుక్కునే ముందు చర్మ తత్వానికి సరిపడే స్క్రబ్ ని కూడా ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సమస్య ఇబ్బంది పెట్టదు.

3. కనీసం నెలకోసారి అయినా ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం అవసరం. పార్లర్లు మూసేసి ఉన్నాయి కదా అని ఫేషియల్ కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మన కిచెన్ లో లభించే వస్తువులతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వీటివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ముఖం కూడా మెరుస్తూ కనిపిస్తుంది.

4. మీ డైట్ లో రోజూ తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్ వీలైనంత తక్కువగా తీసుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుండడం వల్ల చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది.

5. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది. దానివల్లే మనం అందంగా కనిపిస్తాం. అందుకే మీకు ఒకవేళ ఏదైనా ఒత్తిడి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. పని మధ్యలో కాస్త బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు రోజూ మెడిటేషన్ చేస్తుండడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు వీలుంటుంది.

First published:

Tags: Health Tips, Life Style

ఉత్తమ కథలు