Home /News /life-style /

FOLLOW THESE TIPS AND TAKE VARIOUS PRECAUTIONS WHEN YOU HAVE A SORE THROAT FULL DETAILS HERE PRV

Sore throat home remedy: సీజన్లు మారే కొద్దీ గొంతు నొప్పి వస్తుంటుంది.. మీకూ అలాంటి నొప్పి వస్తే ఈ చిట్కాలు ప్రయత్నించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పి (Headache) వంటివి కూడా వస్తాయి. గొంతు నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    చుట్టూ ఉన్న ప్రపంచంలో వాతావరణం కూడా కలుషితం అవుతోంది. కనీసం స్వచ్ఛమైన గాలి (Fresh Air) కూడా అందడం లేదు మనిషికి. అయితే గొంతు నొప్పి (Sore throat) కూడా ఒకటి సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పి (Headache) వంటివి కూడా వస్తాయి. గొంతు నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు (Sore throat home remedy) తెలుసుకుందాం.. గొంతునొప్పి (Sore throat), గొంతు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందడానికి ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, కొన్ని మిరియాలు వేసి కషాయం చేసుకోవాలి. ఈ కషాయాన్నినిద్రపోయే ముందు తాగడం వల్ల గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

    గోరువెచ్చని పాల (Lukewarm Milk)లో అర టీస్పూన్ పసుపు (Turmeric) కలిపి తాగడం వల్ల గొంతు గరగర తగ్గుతుంది. అంతేకాకుండా గొంతు నొప్పి తగ్గుతుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆకులు తీసేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగితే కొంచెం నొప్పి (pain) మాయం.

    రోజుకు 2 నుంచి 3 సార్లు పుక్కిలిస్తే..

    ఉప్పు (Salt)లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది దగ్గు మరియు ఇన్ఫెక్షన్ నుంచి మనలను బయటపడేస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ ఉప్పును కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు లవంగాలు, తులసి, అల్లం, మిరియాలతో తయారు చేసిన టీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

    Weight loss Remedies: బరువు తగ్గే పనిలో ఉన్నారా? అయితే దీనిని మీ డైట్​లో చేర్చుకోండి.. బరువు కంట్రోల్​లో ఉంటుంది..



    అల్లం (ginger) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతు ఇన్ఫెక్షన్ మరియు నొప్పి (Sore throat )ని తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో అల్లం (Ginger) ఉడకబెట్టండి. అనంతరం ఆ నీటిని రెండు మూడు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి (Sore throat) నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం మరియు ఒక టీస్పూన్ తేనె (honey) కలుపుకుని తాగాలి. దీంతో మనకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.



    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Health Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు