హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Healthy Heart : గుండె ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Healthy Heart : గుండె ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ‌వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణం గుండె సంబంధ సమస్యలే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యం కోసం పాటించాల్సిన ముఖ్యమైన టిప్స్ ఏవో తెలుసుకుందాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె(Heart). శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మారిన జీవనశైలి(Lifestyle) కారణంగా ఇటీవల కాలంలో చాలా మంది గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. బలవర్థకమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, పొగాకు, ఆల్కహాల్ తీసుకోవడం వంటి కారణాలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ‌వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణం గుండె సంబంధ సమస్యలే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యం కోసం పాటించాల్సిన ముఖ్యమైన టిప్స్ ఏవో తెలుసుకుందాం.

యోగా

యోగా అనేది గుండె సంబంధ సమస్యల రిస్క్ తగ్గించడంలో ప్రత్యామ్నాయ మార్గమని ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. శారీరక అలసట, ఒత్తిడిని దూరంలో చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీస్ చేస్తే మనసు ఉల్లాసంగా, ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. కఠినమైన వ్యాయామం చేయలేని వారు కనీసం కొన్ని యోగా ఆసనాలను క్రమం తప్పకుండా సాధన చేస్తే గుండె ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అలాగే లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కిరాడం వల్ల కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

హెల్త్ డ్రింక్స్

సాధారణ టీ, కాఫీలకు బదులు గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తీసుకుంటే.. గుండె ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. మందారం ఆకులతో చేసిన టీ, టమాటా, బెర్రీ, బీట్‌రూట్ జ్యూస్‌‌లను తరచూ తీసుకోవాలి. దీంతో గుండె సంబంధ సమస్యల రిస్క్ తగ్గుతుంది. నీరు ఎక్కువగా తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉంటూ పొగాకు, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ దీపావళి సర్‌ప్రైజ్‌..రూ.80 వేలకే కొత్త స్కూటర్‌!

హెల్తీ డైట్

గుండె ఆరోగ్యంలో డైట్‌దే కీ రోల్. ఫ్యాట్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు డైట్‌లో చేర్చుకోవాలి. సలాడ్స్, బాదం లేదా వాల్‌నట్స్ వంటి వాటిని తరచూ భోజనంలో చేర్చుకోవడం మంచిది. ఉప్పును కూడా పరిమితంగా తీసుకోవాలి. ప్రొటిన్ ఫుడ్స్‌ను కూడా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది.

బరువు తగ్గడం

జీవన శైలిలో మార్పుల కారణంగా ఎక్కువ మంది జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డారు. మరోపక్క శారీరక శ్రమ లేకపోవడంతో చివరికి ఇది ఊబకాయానికి దారితీస్తోంది. కరోనరీ ఆర్టరీ వ్యాధికి ఊబకాయం ప్రత్యక్షంగా కారణమవుతోంది. ఇతరులతో పోలిస్తే అధిక బరువు ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించాలి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Heart, Life Style

ఉత్తమ కథలు