Good Health: రోగ నిరోధక శక్తే దివ్యౌషధం.. ఈ అలవాట్లు పాటిస్తే మెరుగైన ఆరోగ్యం..!

ప్రతీకాత్మక చిత్రం

రోగనిరోధక వ్యవస్థని బలంగా మార్చుకోవడం ఒక్క రోజులో జరిగే పనికాదు. క్రమం తప్పకుండా ఆరోగ్యమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

  • Share this:
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఆరోగ్యమే అన్నింటికంటే ఎక్కువ అన్న విషయం 2020 ఏడాది మనకు తెలిసేలా చేసింది. మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి వైరస్ లనైనా ఎదుర్కోగలమని తెలియజేసింది. మన రోగనిరోధక వ్యవస్థ హానికరమైన వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే, రోగనిరోధక వ్యవస్థని బలంగా మార్చుకోవడం ఒక్క రోజులో జరిగే పనికాదు. క్రమం తప్పకుండా ఆరోగ్యమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం, మధ్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్లను మానేయాలి. ఈ అలవాట్లు మీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. వీటికి ఒక్కసారి బానిసలైతే, వాటి నుండి తిరిగి బయటపడటం చాలా కష్టం. మంచి అలవాట్లు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, మీకు ఆరోగ్యం చేకూర్చడంలో సహాయపడతాయని గుర్తించుకోండి. దీర్ఘకాలం మెరుగైన ఆరోగ్యంతో జీవించాలంటే ఈ క్రింది అలవాట్లను క్రమం తప్పకుండా పాటించండి.

తరచుగా వ్యాయామం చేయండి
వ్యాయామం మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీ మెరుగైన ఆరోగ్యం కోసం శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు ఉదయం, సాయంత్రం వాకింగ్, వ్యాయామం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటితో పాటు యోగా, ప్రాణాయామాలు చేయండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ఒత్తిడికి లోనవ్వకండి
ఎక్కువ ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మొదట్లో ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి, క్రమంగా మీ శారీరక ఆరోగ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. మీరు మీ ఒత్తిడి, ఆందోళనను ఎలా తగ్గించుకోవాలి?, నిరాశకు లోనైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి?, మీ మానసిక స్థితిని ఎలా మెరుగుపర్చుకోవాలి? అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. మీ రోజూ వారి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Private hospital, Private hospital Collecting Money, Telangana, Plate idly, 700 Rupees, corona, covid-19, కార్పోరేట్ ఆస్పత్రి, దోపిడీ, ప్లేట్ ఇడ్లీ 700 రూపాయలు, కోవిడ్-19, కరోనా
ప్రతీకాత్మక చిత్రం


బ్రేక్ ఫాస్ట్ మానేయొద్దు
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడాన్ని ఏ పరిస్థితిలోనైనా మానేయకూడదు. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇతర మీల్స్ తో పోలిస్తే ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాత్రంతా శరీరానికి ఆహారం అందక పోషకాలన్నీ అయిపోయే స్థితిలో ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా ఉండవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం


నిద్రకు ప్రాధాన్యతనివ్వండి
మెరుగైన ఆరోగ్యం కోసం రోజూ సరిపడా నిద్ర పోవడం తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సలహాలిస్తారు. రాత్రి ఆలస్యం చేయకుండా నిద్రపోయి ఉదయాన్నే లేచే వారిలో హార్మోన్లు ఎప్పుడూ సమతుల స్థాయిలో ఉంటాయి. తద్వారా మీ ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సరైన నిద్ర లేకపోతే ఆరోజంతా నీరసంగా, ఆందోళనకరంగా ఉంటారు. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి 10 నుంచి 11 దాటక ముందే నిద్రపోవడం మంచిది. నిద్రకు కొన్ని గంటల ముందే భోజనం చేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

మంచి ఆహారం తీసుకోండి
ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా మంచి పోషకాలున్న ఆహారాన్నే తీసుకోండి. సమతుల్య ఆహారం మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. మీ శరీరం, మనస్సు సజావుగా పనిచేయడానికి మీరు తీసుకునే ఆహారం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. మీ జీవనశైలిని మెరుగుపర్చడానికి మీరు తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుందని గుర్తించుకోండి.
Published by:Hasaan Kandula
First published: