హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dating Tips: అమ్మాయిలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదా ? ఇలా చేస్తే మీకు తిరుగుండదు

Dating Tips: అమ్మాయిలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదా ? ఇలా చేస్తే మీకు తిరుగుండదు

రాత్రిపూట కలయికలో పాల్గొనాలి అంటే.. పగటి పూట నుంచే.. ముద్దులు ఇవ్వడం, ఒకరినొకరు తాకడం.. కౌగిలించుకోవడం లాంటివి చేయవచ్చట. అప్పటి నుంచి వారిలో కలయికలో పాల్గొనాలనే కోరిక మరింత బలపడుతుందట. దీంతో.. క్లైమాక్స్ అదిరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.  (ప్రతీకాత్మక చిత్రం)

రాత్రిపూట కలయికలో పాల్గొనాలి అంటే.. పగటి పూట నుంచే.. ముద్దులు ఇవ్వడం, ఒకరినొకరు తాకడం.. కౌగిలించుకోవడం లాంటివి చేయవచ్చట. అప్పటి నుంచి వారిలో కలయికలో పాల్గొనాలనే కోరిక మరింత బలపడుతుందట. దీంతో.. క్లైమాక్స్ అదిరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.  (ప్రతీకాత్మక చిత్రం)

Dating Tips: కొందరు మగవాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తమ గర్ల్ ఫ్రెండ్ తో వీలైనంత ఎక్కువగా పర్సనల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది చాలామంది అమ్మాయిలకు నచ్చదు.

కొంతమంది మగవారు ప్రేమలో ఇట్టే పడిపోతారు. కానీ ఎదుటివారికి తమ ప్రేమ విషయం చెప్పడానికి వెనుకాడుతూ ఉంటారు. కొందరు మాత్రం ఆడవారి ఫోకస్ తమవైపు తిప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిలవుతుంటారు. తాము ఎంత ప్రయత్నించినా అమ్మాయిలు తమ వైపు చూసేందుకు కూడా ఎందుకు వెనుకాడుతున్నారో చాలామందికి అర్థంకాదు.. చాలామంది రిలేషన్ షిప్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నా చాలా తక్కువ సమయంలోనే వారికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంటారు అమ్మాయిలు.. మీరూ అలాంటివారిలో ఒకరా? అయితే అమ్మాయిలు మిమ్మల్ని తిరిగి చూడకపోవడానికి కారణాలేంటో తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి.

మార్చడానికి ప్రయత్నిస్తున్నారా?

మీరు పనిచేసే చోట చాలా స్మార్ట్, టాలెంటెడ్ ఎంప్లాయీ గా పేరు తెచ్చుకొని ఉంటారు. చూసేందుకు కాస్త అందంగానే ఉండి ఉండొచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం మీ వంక చూడట్లేదా? అయితే మీరు అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి ఎలా ఉందో గమనించండి. మీరు మీ కింద ఉద్యోగికి ప్రాజెక్ట్ లో మార్పులు చేర్పులు చేయమని చెప్పినట్లు మీ గర్ల్ ఫ్రెండ్ కి కూడా ఇలా ఉండకు.. అలాంటి దుస్తులు వేసుకోకు.. వారితో మాట్లాడకు.. అంటూ ఆంక్షలు పెడుతూ వారిని మారమని బలవంతం చేస్తుంటే వారు మీతో ఎక్కువ సమయం ఉండలేరు. ఒకవేళ మీ స్నేహితులతో కూడా అలాగే వ్యవహరిస్తుంటే వారిలో ఎవరూ మిమ్మల్ని ప్రేమించే ధైర్యం కూడా చేయలేరు. అందుకే ఇలాంటివారికి బ్రేకప్స్ ఎక్కువగా అవుతుంటాయి.

మీ ఆలోచన ధోరణి ఇలా ఉందా?

కొందరు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తుంటారు. ప్రతి చిన్న విషయంలోనూ ఫిర్యాదులే వారి నుంచి వినిపిస్తుంటాయి. మీరు కూడా అలాంటి కేటగిరిలో ఉన్నారేమోనని ఆలోచించుకోండి. మీ ఆలోచనా ధోరణి కూడా నెగటివ్ గా ఉందా? జీవితంలో ఏదీ పాజిటివ్ గా ఆలోచించలేకపోతున్నారా? ఏది జరుగుతున్నా అది చెడు జరిగేందుకే అనుకుంటున్నారా? అయితే మీ ధోరణి మార్చుకోండి. ఇలాంటి వారితో గడిపేందుకు ఏ అమ్మాయి ఒప్పుకోదు. అమ్మాయిలు ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారిని ఎక్కువగా గమనించేందుకు ఇష్టపడతారు. మీలో ఇలాంటి లక్షణాలు ఉండి మీరు వారితో మాట్లాడే ప్రతి మాట నెగెటివ్ గానే ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నా దాన్ని వాళ్లు బయటకు చెప్పడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. ఒకవేళ ఇంతకుముందే చెప్పినా వీలైనంత తొందరగా మీకు బ్రేకప్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

లుక్స్ ముఖ్యం అనుకుంటున్నారా?

బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యం గొప్పది. అయితే చాలామంది తాము ప్రేమించే అమ్మాయి తమ కంటే అందంగా ఉండాలని కోరుకుంటారు. కేవలం తమకంటేనే కాదు.. తమ చుట్టూ ఉన్న అందరి కంటే అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా కోరుకోవడమే కాదు.. వారు ఎంత అట్రాక్టివ్ గా, హాట్ గా ఉన్నారో చెబుతూ గర్ల్ ఫ్రెండ్స్ ని పొగడడం లేదా పక్కన వారిని చూపించి వారిని చిన్నబుచ్చుకునేలా చేయడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీతో ఎక్కువ కాలం ఏ అమ్మాయి రిలేషన్ షిప్ కొనసాగించేందుకు ఇష్టపడకపోవచ్చు. అమ్మాయిలలో కేవలం లుక్స్ మాత్రమే కాదు.. వారి ఇంటలిజెన్స్, వారి నవ్వించే తత్వం, వారి వ్యక్తిత్వం ఇలా చాలా గుణాలు గమనించి వాటిని ప్రశంసించవచ్చు. దీనివల్ల వారు ఆనందంగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.

ఈ అలవాట్లున్నా వద్దంటారు..

మీకు మందు తాగే అలవాటుందా? అలవాటుంటే పర్లేదు. మద్యం తాగందే మీరు ఆనందంగా ఉండలేరా? అయితే మీరు మీ రిలేషన్ షిప్ గురించి మరోసారి ఆలోచించాల్సిందే. ఎప్పుడో ఓసారి అయితే ఫర్వాలేదు కానీ తరచూ మద్యం, పొగ తాగే అలవాటు ఉన్నవారితో ఎక్కువ మంది అమ్మాయిలు సరిగ్గా జీవించలేరు. ఆల్కహాల్ తాగడం వల్ల అమ్మాయిల ముందు గొప్పగా కనిపిస్తాం అని మీరు భావిస్తే దాన్ని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకు తరచూ ఆల్కహాల్ సేవించే వాళ్లంటే పెద్దగా ఇష్టం ఉండదు.

మరీ అలా ఉండొద్దు..

కొందరు మగవాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తమ గర్ల్ ఫ్రెండ్ తో వీలైనంత ఎక్కువగా పర్సనల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది చాలామంది అమ్మాయిలకు నచ్చదు. అలాగే మీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నా సరే.. వారికంటూ కాస్త స్వేచ్ఛను.. సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వారి జీవితం గడిపేందుకు వారికి సమయాన్ని ఇవ్వని వారిని కూడా అమ్మాయిలు పెద్దగా ఇష్టపడరు. అలాగే ఎప్పుడూ రొమాంటిక్ గా, లైంగిక విషయాల గురించే మాట్లాడడం కూడా వారికి నచ్చకపోవచ్చు. అది జీవితంలో ఓ భాగమే కానీ అదే జీవితం కాదు.. అందుకే వీలైనంత వరకూ రొమాన్స్ ని కొద్ది సమయానికే కేటాయించండి. మిగిలిన విషయాల గురించి.. మీ ఇద్దరి జీవితం గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించండి.

Published by:Krishna Adithya
First published:

Tags: Dating

ఉత్తమ కథలు