నోటి దుర్వాసన (Bad Breath)తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. హాలిటోసిస్ (దుర్వాసనతో కూడిన శ్వాస) అనే ఈ సమస్య.. నోటిలోని సూక్ష్మజీవులు దంతాలు (Teeth), చిగుళ్ళు, నాలుక (Tongue) మధ్యలో ఆహారాన్ని వేరు చేయడం వల్ల వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, జీర్ణవ్యవస్థ సక్రమంగా లేకపోవడం నోటి దుర్వాసనకు మూల కారణం. నోటి నుంచి శ్వాస తీసుకోవడం, దుర్వాసన వచ్చే ఆహారాలు (వెల్లుల్లి, ఉల్లిపాయ, పెరుగు), పానీయాలు (టీ, కాఫీ, సోడా), కొన్ని మందులు, సైనస్ ఇన్ఫెక్షన్ లేదా జలుబు, కావిటీస్, ఆల్కహాల్ తీసుకోవడం, ధూమపానం వంటి కారణాలతోనూ ఈ సమస్య పెరుగుతుంది. దుర్వాసన అనేది మన శరీరాన్ని ప్రభావితం చేసే వివిధ కారకాల వల్ల, ప్రధానంగా బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. కొన్ని సూచనలు పాటిస్తే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
* గట్ హెల్త్
జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియాను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో ఒకటి తినే ఆహారం. పండ్లు, కూరగాయలు, అధిక-ఫైబర్ ఆహార పదార్థాలను తినడం వల్ల పేగులో ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీంతో గట్ హెల్త్ బాగుంటుంది. ప్రోబయోటిక్స్ తినడం వల్ల పేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. డీప్ ఫ్రైడ్, సంతృప్త కొవ్వు, ఎర్ర మాంసం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అవి పేగులోని బ్యాక్టీరియాకు ప్రయోజనకరంగా ఉండవు.
* సిస్టమ్‌ను ఇన్‌ఫ్లమేటరీకి దూరంగా ఉంచండి
మానవ శరీరానికి తగినంత ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం అవసరం. తగినంత వ్యాయామం కూడా ఉండాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లైఫ్‌స్టైల్, డైట్‌ని పాటించడం ద్వారా ఇన్‌ఫ్లమేషన్‌ను రివర్స్ చేయవచ్చు. ఇన్‌ఫ్లమేషన్‌తో చిక్కుకోకుండా ఉండేందుకు తినే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం శుద్ధి చేసిన చక్కెరను దూరం చేయడం ఒక విధమైన పరిష్కారం. ద్రాక్ష, ఆకుకూరలు, బ్లూబెర్రీస్, అల్లం, పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి.
* వాతం అదుపులో ఉంచుకోండి
ఆయుర్వేదం ప్రకారం.. శరీర వ్యవస్థలోని వాతం, మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని నియంత్రిస్తే, మానవ శరీరం శక్తివంతంగా, ఆరోగ్యంగా ప్రతిస్పందిస్తుంది. వాతాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరం. వేడి సూప్, గది ఉష్ణోగ్రత కంటే చల్లగా లేని ఇతర వేడి ద్రవాలు వంటివి వాతం బ్యాలెన్సింగ్ ఆహార పదార్థాలు. మజ్జిగ, అల్లం, పసుపు కూడా ఉత్తమమైన వాతాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. శీతల పానీయాలు, ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉంటే వాత అసమతుల్యతను నివారించవచ్చు.
* డిటాక్స్ చేయాలి
సంస్కృతంలో ఆమా అనేది జీర్ణం కాని జీవక్రియ వ్యర్థాలను సూచిస్తుంది. ఆమా పోషకాలను మన సిస్టమ్‌లోని కణాలకు చేరకుండా చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాల తొలగింపును అడ్డుకుంటుంది. అతిగా తినడం, పాతబడిన, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తినడం, శీతల పానీయాలు, శీతల ఆహార ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక అంశాలు మన శరీరంలో ఆమాను ఉత్పత్తి చేస్తాయి. మూడు నెలలకు ఒకసారి కూరగాయల ఉపవాసం చేయడం మంచిది. అప్పటికీ సమస్య ఉంటే ప్రక్రియను ఎక్కువ కాలం కొనసాగించవచ్చు.
* మార్నింగ్ ఎనర్జీ డ్రింక్
ప్రతిరోజూ ఉదయం అర గ్లాసు క్యారెట్ జ్యూస్, సగం దానిమ్మ, అర గ్లాసు బీట్‌రూట్ జ్యూస్/పొట్లకాయ రసం తీసుకొని వాటన్నింటినీ కలపండి. 10 బాదంపప్పులు, 5 వాల్‌నట్‌లు, యాలకులు ఒకటి, అర టీస్పూన్ మెంతి గింజల పొడి, తాజా పసుపు రెండు అంగుళాలు లేదా 1 టీస్పూన్ పసుపు పొడి, తాజా ఉసిరి 2 లేదా ఉసిరి పొడి ఒక టీస్పూన్ నానబెట్టి స్మూతీ చేయండి.
* కొన్ని మూలికలను నమలండి
నోటి దుర్వాసనకు వ్యతిరేకంగా పోరాడడంలో మూలికలను నమలడం ఒక సాధారణ పద్ధతి. ఏదైనా భోజనం చేసిన తర్వాత మీరు కొన్ని సోంపు గింజలను తీసుకోవచ్చు లేదా రెండు పుదీనా ఆకులను మీ నోటిలో వేసుకోవచ్చు. నోటిని తాజాగా ఉంచే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ మూలికల్లో ఉంటాయి. కొత్తిమీర, పార్స్లీ కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయాలు. క్లోరోఫిల్ కారణంగా నోటి దుర్వాసనను చంపే ఏకైక పరిష్కారాలలో పార్స్లీ ఒకటి.
* ప్రతి నెలా టూత్ బ్రష్ మార్చండి
టూత్ బ్రష్ అనేది ప్రతిరోజూ ఉపయోగించే వస్తువు. ఇందులో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. కొత్త టూత్ బ్రష్‌ను ఉపయోగించిన 2-3 నెలల్లో, సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించి దుర్వాసనగల బ్యాక్టీరియాతో నింపడం ప్రారంభిస్తాయి. ఇది నోటి దుర్వాసనను పెంచుతుంది. అందువల్ల, టూత్ బ్రష్‌ను ఉపయోగించే ముందు, తర్వాత శుభ్రం చేయాలి. ప్రతి నెలా బ్రష్ మార్చడానికి ప్రయత్నించండి.
పై చిట్కాలను అనుసరించడంతోపాటు, రోజూ 7-8 గంటల పాటు మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. శరీరానికి విశ్రాంతి అవసరం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు చాలా అసమానతలు ప్రశాంతంగా ఉంటాయి, సహజంగా నయం అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ginger, Health, Health care, Teeth