హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Stress: స్ట్రెస్.. స్ట్రెస్.. స్ట్రెస్.. చెక్ పెట్టండిలా.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి..!

Stress: స్ట్రెస్.. స్ట్రెస్.. స్ట్రెస్.. చెక్ పెట్టండిలా.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి..!

మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగితే హృద్రోగాలు, డయాబెట్స్, డిప్రెషన్, అల్జీమర్స్, క్యాన్సర్, హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావటం వంటి వ్యాధుల బారినపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా స్ట్రెస్ ను జయించేందుకు వీటిని పాటించండి.

మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగితే హృద్రోగాలు, డయాబెట్స్, డిప్రెషన్, అల్జీమర్స్, క్యాన్సర్, హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావటం వంటి వ్యాధుల బారినపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా స్ట్రెస్ ను జయించేందుకు వీటిని పాటించండి.

మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగితే హృద్రోగాలు, డయాబెట్స్, డిప్రెషన్, అల్జీమర్స్, క్యాన్సర్, హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావటం వంటి వ్యాధుల బారినపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా స్ట్రెస్ ను జయించేందుకు వీటిని పాటించండి.

ఇంకా చదవండి ...

  మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగితే హృద్రోగాలు, డయాబెట్స్, డిప్రెషన్, అల్జీమర్స్, క్యాన్సర్, హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావటం వంటి వ్యాధుల బారినపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ మనలో ప్రతిఒక్కరూ డేటుడే స్ట్రెస్ కు విపరీతంగా లోనవుతూ అసంతృప్తిగా జీవనం గడుపుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశ ప్రజల్లోనూ ఈ ఒత్తిడి స్థాయిలు బాగా పెరిగాయి. ఒత్తిడి ఓ స్థాయి దాటాక అది ఇన్ఫ్లమేషన్ పెరిగేలా చేసి.. శరీరమంతా వ్యాపిస్తుంది, దీంతో మీకు ప్రత్యక్ష నరకం క్రమంగా మొదలవుతుంది. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటే శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంటూ సక్రమంగా తమ విధులు అవి నిర్వహిస్తాయి. కాబట్టి మీ మనసును వీలైనంత కూల్ గా ఉంచుకునే ప్రయత్నాన్నిమీరు ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. ఇందుకు మీరు రెండు మార్గాలను అనుసరించటం అత్యుత్తమ మార్గం. ఒకటి మీరు ఫిజికల్ యాక్టివిటీ పరంగా, తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు యోగా వంటి మనసుకు సంబంధించినవి ప్రయత్నించాలి. మీ ఇమ్యూన్ సిస్టంను విధ్వంసం చేసే స్ట్రెస్ తో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి, బరువు పెరుగుతారు, జీఐ సమస్యలు రావటం, హైపర్ టెన్షన్, అతిగా తినటం లేదా అస్సలు తినకపోవటం వంటి విపరీతమైన ప్రవర్తన మీలో ఉందంటే మీకు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉన్నట్టు అర్థం చేసుకుని జాగ్రత్త పడండి.

  స్ట్రెస్.. చెక్

  సహజసిద్ధంగా స్ట్రెస్ ను జయించేందుకు అనుసరించే మార్గాలు చాలా ఉన్నప్పటికీ పోషకాలు మెండుగా ఉన్న మంచి సాత్విక ఆహారం ఎంజాయ్ చేయటం కూడా స్ట్రెస్ కు అతిపెద్ద విరుగుడన్న విషయం మీకు తెలుసా.. జీవితాన్ని బాగా ఆస్వాదించే వారికి ఒత్తిడి దరిదాపుల్లో కూడా కనిపించదు. కాబట్టి మీరున్న ఆర్థిక, సామాజిక స్థితి గతులు ఏవైనా వాటన్నింటినీ మీరు అనుక్షణం ఎంజాయ్ చేస్తే ఒత్తిడిని మీరు ఆదిలోనే జయించినట్టు.. స్ట్రెస్ ను శాశ్వతంగా అధిగమించే చిట్కా కూడా ఇదొక్కటే. అతిగా ఆలోచించకుండా, ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉంటూ, మీరు సాధించాలన్నదాన్ని ప్రణాళికా బద్ధంగా సర్వ శక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తూ మీ గమ్యాన్ని చేరండి అంతేకానీ హైరానా పడిపోతే మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. గాబరా పడి, టెన్షన్ పడుతూ ఉంటూ మీ టార్గెట్ చేరటంలో ఇలాంటి ఆటంకాలన్నీ వచ్చి కూర్చుంటాయి. మీ దినచర్యలో హెల్తీ రొటీన్ ను అనుసరించేలా మార్పుచేర్పులు చేసుకుని కొన్ని రోజులపాటు మీ ఆరోగ్యం, మీ వృత్తిలో వచ్చిన మార్పులు గమనించండి.

  ధ్యానం..

  మనసుకు మందు, మెదడుకు రిలాక్సేషన్ ఇచ్చే ఏకైక సాధనం ధ్యానం మాత్రమే. అందుకే మన పూర్వికులు ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నారు. బిజీ లైఫ్ లో మనం ధ్యానం కోసం కొన్ని నిమిషాల సమయాన్ని వెచ్చించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ అన్నింటినీ నియంత్రించే శక్తి ధ్యానానికి ఉంది. ఉచ్వాస, నిశ్వాసాలపై మనుసును ఏకాగ్రం చేస్తూ కొద్దిసేపు మీకోసం మీరు సమయం వెచ్చించుకుంటే చాలని వైద్యులంతా సూచిస్తున్నారు.

  హాబీ..

  ప్రతిఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. సంగీతం, వంట, డ్రాయింగ్, తోటపని.. ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది కదా వాటిని పెంపొందించుకుంటూ, దీనిపై రోజూ కాస్త సమయం కేటాయిస్తే ఒత్తిడి పరార్. రొటీన్ కు భిన్నంగా మీరు ఈ హాబీలను చేసుకోండి. మీ దినచర్యలో భాగంగా..మీకు బాగా నచ్చినదాన్ని చేసేలా మీ డేను ప్లాన్ చేసుకోండి. ఇక మీలో నయా జోష్ తొంగిచూడటం ఖాయం. మీ మనసుకు చికిత్స మీకు మాత్రమే నచ్చినది చేయటం అని ఎంత త్వరగా మీరు గుర్తిస్తే అంతత్వరగా మీలో కొత్త హుషారు తొంగిచూస్తుంది.

  Beer Yoga in Cambodia, Beer Yoga After Pandemic, Beer Yoga Covid-19 Pandemic stress, Cambodia People Practicing Beer Yoga, People Reaction of Beer Yoga, Beer Yoga, బీరు యోగా, కరోనా తర్వాత బీరు యోగా, కంబోడియా ప్రజల బీరు యోగా, బీరు యోగాపై ప్రజల ప్రతిస్పందన
  బీరు యోగా(Image-REUTERS/Cindy Liu)

  కసరత్తులు తప్పనిసరి..

  ఏరోబిక్స్, రన్నింగ్, జాగింగ్, వాకింగ్, జిమ్ లో ట్రైనింగ్.. ఇలా మీకు నచ్చినది చేయటం మానకండి. ఫిజికల్ ఫిట్నెస్ కు సంబంధించిన కసరత్తులు చేసేకొద్దీ మీరు ఒత్తిడిని ఈజీగా జయించటం సాధ్యమవుతుంది. మీలో ఇమ్యూనిటీని పెంచేలా ఇది చేస్తుంది. కొందరు ఫిట్నెస్ ఫ్రీక్స్ కు ఎక్సర్సైజులు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి వారు స్ట్రెస్ కు చెక్ పెట్టాలంటే కసరత్తులే వారికి సరైన ఆప్షన్.

  DHA, EPAలు తీసుకోండి..

  మీరు తినే ఆహారంలో స్ట్రెస్ తగ్గించే లక్షణాలున్నాయా లేదా చెక్ చేసుకోండి.. అంతేకాదు అతిగా మసాలాలు, నూనె, తీపి వంటివి తీసుకుంటూ ఉంటే తక్షణం వాటిని తగ్గించండి. సాల్మన్ ఫిష్ వంటివాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ DHA, EPAలు అధికంగా ఉంటాయి కనుక ఇలాంటివి మీ మెనూలో చేర్చుకోండి. సీ విటమిన్ అధికంగా ఉండే క్యాప్సికం, ఆరెంజెస్, కివి, ద్రాక్ష వంటివి తీసుకోండి. దీంతో సైకలాజికల్ స్ట్రెస్ తగ్గి, బీపీ కూడా అదుపులో ఉంటుంది. పెరుగు వంటివి మంచి బ్యాక్టీరియా ఉన్న ప్రోబయాటిక్స్ కనుక వీటితో భోజనం చేయటం తప్పనిసరి.

  tension, టెన్షన్ తగ్గించుకోవడం ఎలా, unlock1, lockdown5, corona warrior, extend the lockdown, corona update, fight with corona virus, covid19, నరేంద్ర మోదీ, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, అన్‌లాక్1,
  ప్రతీకాత్మకచిత్రం

  కార్బోహైడ్రేట్లు మానేయకండి..

  స్ట్రిక్ట్ డైట్ లో భాగంగా చాలామంది కార్బ్స్ ను తీసుకోవటం పూర్తిగా మానేయటం లేదా అత్యల్పంగా తీసుకోవటం వంటివి చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మనశరీరానికి కార్బ్స్ చాలా అవసరం. మన మెదడు పనితీరుపై కూడా కార్బోహైడ్రేట్లు ప్రభావం చూపుతాయి. కార్టిసాల్స్ స్థాయిలు విపరీతంగా పెరక్కుండా కార్బ్స్ అడ్డుకట్టవేస్తాయి కాబట్టి న్యూరోట్రాన్స్ మీటర్లను నియంత్రణలో ఉంచేందుకు కార్బ్స్ పనికివస్తాయి. గంటల తరబడి ఆహారం తీసుకోకుండా ఉండటం అస్సలు మంచిదికాదు.. కాబట్టి ప్రతి నాలుగు గంటలకు ఓసారి ఏదో ఒక ఆహారం తీసుకోండి.. లేదా మీరు అనారోగ్యంపాలు కావటం ఖాయం. ఇలా కార్బ్ లోపం ఉండటం, సరిగ్గా ఆహారం తీసుకోకపోతే స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది.

  కెఫిన్..

  కాఫీ, టీల సేవనం శృతిమించితే స్ట్రెస్ పెరుగుతుంది. కాస్త ఒత్తిడిగా, చికాకుగా అనిపించినప్పుడు కెఫిన్ తీసుకుంటే ఉపశమనం ఉంటుంది కానీ అతిగా కాఫీలు, టీలు తాగితే మాత్రం స్ట్రెస్ వస్తుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మీరు కెఫిన్ లేని Decaf Coffeeని తాగటం లేదా వేడి నీరు తాగటం, హెర్బల్ టీ, పాలు, చక్కెర లేని బ్లాక్ టీ, కాఫీ తాగటం వంటివి చేయాలి.


  కంటి నిండా..

  కంటి నిండా నిద్రలేక కొందరికి స్ట్రెస్ పెరిగితే, స్ట్రెస్ వల్ల నిద్రలేమి పాలయ్యేవారు మరికొందరు. నిద్ర, స్ట్రెస్ రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. లోకాభిరామాయణం, సమస్యలు అన్నీ పక్కనపెట్టి.. చిన్న పిల్లల్లా ప్రశాంతంగా పడుకుని చూడండి.. మరుసటి రోజు మీరు ఎంత హుషారుగా, ఒత్తిడి లేకుండా ఫీల్ అవుతారో మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు రాత్రి డీప్ స్లీప్ లేకపోతే మధ్యహ్నం పవర్ న్యాప్ వేయండి ఇందులో తప్పులేదు. కనీసం అరగంట మంచి కునుకు తీస్తే మీరు ఒత్తిడికి దూరంగా ఉండచ్చు.

  యోగా..

  యోగా మనసుకు మంచి చికిత్స. మీలోని మానసిక చికాకులను దూరం చేసేలా యోగా పనిచేస్తుంది. రోజూ ఏదో ఒక సమయంలో మీరు కొన్ని నిమిషాలపాటు యోగా చేయండి, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోండి. బోలెడన్ని యూట్యూబ్ చానెళ్లలో మీరు ఫ్రీగా యోగా చేయటాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒత్తిడిని పారద్రోలాలంటే యోగాను మించిన ఔషధం లేదు.

  ఆక్యుపంక్చర్..

  సంప్రదాయ-ప్రత్యామ్నాయ చికిత్సల్లో ఆక్యుపంక్చర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. నేటికీ చైనా, జపాన్ వంటి దేశాల్లో ఆక్యుపంక్చర్ ను చాలా వ్యాధులపై ప్రయోగిస్తూ, ఉపశమనం పొందుతున్నారు. స్ట్రెస్ కు ఆక్యుపంక్చర్ చక్కగా పనిచేస్తుంది. అధిక మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రోగులపై ఆక్యుపంక్చర్ ప్రయోగిస్తున్న వైద్యుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.

  Depression-Anxiety-Stress
  ప్రతీకాత్మక చిత్రం

  ప్రకృతి అందాన్ని ఆస్వాదించండి..

  ప్రకృతి సోయగాలను ఆస్వాదించేవారికి ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. ఏదో మెటీరియలిస్టిక్ వల్డ్ లో చక్కర్లు కొట్టేవారికి స్ట్రెస్ జీవితంలో భాగం. మీకు వీలుచిక్కినప్పుడల్లా మీ ఇంట్లోనే లేదా సమీపంలోని చెట్లు, పుట్టలు చూసి ఆనందించటం అలవాటు చేసుకోండి. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, సెలయేళ్లు ఇవన్నీ చూడాలంటే టూర్ వెళ్లాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు.. వర్చువల్ టూర్లో విహరించి సేదతీరండి. మనసుకు సాంత్వన ఇచ్చే శక్తి ప్రకృతికి మాత్రమే ఉంది. మనసుకు అయిన గాయాలను ప్రకృతి తన చికిత్సతో ఇట్టే వెళ్లగొట్టగలదు. కాబట్టి ప్రకృతి రమణీయతను, సౌందర్యాన్ని చూసి ఎంజాయ్ చేయండి. అందమైన ప్రకృతి చూస్తుంటే మన మనసు కూడా అందమైన అనుభూతులకు లోనవుతుంది.

  మ్యూజిక్..

  సంగీతం ప్రాక్టీస్ చేయటం, సంగీతం వినటంతో స్ట్రెస్ ను జయించవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కు ఎలాగూ నెట్ కనెక్షన్ ఉందిగా.. శ్రావ్యమైన సంగీతాన్ని కొన్నిక్షణాలపాటు హ్యాపీగా వినండి. స్ట్రెస్ దానికదే పోతుంది. మీకు పియానో, గిటార్, తబలా ఇలా ఏవైనా ఇష్టమైన వ్యాపకాలుంటే వాటిపై మీ ఫోకస్ పెట్టండి.

  నలుగురితో కలిసి..

  ఒంటరిగా ప్రయాణం చేస్తే జీవితంలో త్వరగా అలసట వస్తుంది. మీరు నలుగురిలో ఉన్నప్పటికీ ఒంటరిననే భావన వదిలేసి..చక్కగా అందరితో మాట కలిపి కలిసిపోండి.. ఎంత మంచి స్ట్రెస్ బస్టరో ఇది అని మీరే ఫీల్ అవుతారు. గలగలా, సందడిగా మనం గుంపులో కలిస్తే ఎంత ఎనర్జీ వస్తుందో. మన సమస్యలన్నీ ఫట్ మని ఎగిరిపోయినట్టు మీ వ్యక్తిగత విషయాలను కాసేపు మరిచిపోయేలా ఇది చేస్తుంది. ఆఫీసు, ఇంట్లో మీరు అందరితో చక్కగా కలిసిపోతే సరి. మనిషి సోషల్ అనిమల్ కాబట్టి.. అందరితో కలిసి ఉంటే మానసికంగా దృఢంగా ఉన్నామనే భావన వస్తుంది. మీకు నచ్చిన వారితో గెట్ టుగెదర్ లు ఎంజాయ్ చేయండి.

  లైఫ్ స్టైల్ మార్పులు..

  అతిగా ఇంటర్నెట్ లో గడపటం కూడా ఒత్తిడికి కారణం. కాబట్టి లైఫ్ స్టైల్స్ లో మార్పులు అవసరం. ఎప్పుడూ యూట్యూబ్, ఓటీటీల్లో వీడియో కంటెంట్ చూడటం, ఆన్ లైన్ షాపింగ్, వాట్సప్ చాటింగ్ వంటివి రేయింబవళ్లు చేసేవారు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. కాబట్టి ఒత్తిడిని పారద్రోలాలంటే డిజిటల్ డీటాక్స్ మీకు చక్కగా పనిచేస్తుంది.

  First published:

  Tags: Ayurveda health tips, Health benefits, Health food, Health secrets

  ఉత్తమ కథలు