Peanut Butter Fruit : ఫ్లోరిడా ప్రజలు ఓ కొత్త పండును కనుక్కున్నారు. దానికి ఏం పేరు పెట్టాలో వాళ్లకే అర్థం కాలేదు. అది పీనట్ బటర్ లాంటి రుచి కలిగి వుండటంతో పీనట్ బటర్ ఫ్రూట్ అనే పేరు పెట్టారు. వేరుశనగ గింజలతో తయారుచేసేదే... పీనట్ బటర్. దాన్ని బ్రెడ్‌పై జామ్‌లా రాసుకొని తింటారు. మరి వేరుశనగ గింజలతో ఏమాత్రం సంబంధం లేని ఆ ఫ్రూట్... టేస్ట్ మాత్రం పీనట్ బటర్‌లా ఎందుకుంది అన్నది అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం. ఈ పండ్లు కాస్తున్న చెట్టుకి ది బన్చోసియా అర్జెంటియా (the Bunchosia Argentea) అనే సైంటిఫిక్ నేమ్ ఉంది. ఈ చెట్టుకు కాసే చిన్న సైజు పండ్లు... చూడటానికి చెర్రీ టమాటాలలా కనిపిస్తాయి. వాసన, గుజ్జు రుచి మాత్రం పీనట్ బటర్‌లా ఉంటాయి.
ఈ పండు సంగతి తేల్చేందుకు ఫ్లోరిడా పరిశోధకులు రంగంలోకి దిగారు. అప్పుడో కొత్త విషయం తెలిసింది. ఇలాంటి పండ్లు... ఉత్తర అమెరికాలో ఎక్కడా లేవు గానీ... దక్షిణ అమెరికాలోని వెనిజులా, కొలంబియా, పెరు, బ్రెజిల్, గయానా, సురినామ్‌లో కాస్తున్నాయి. మొదట్లో గ్రీన్‌గా... తర్వాత ఆరెంజ్... చివరకు రెడ్ కలర్‌లోకి మారతాయి ఈ పండ్లు. రెడ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తింటే... నోరూరి తీరుతుంది.
మెత్తగా ఉండే ఈ పండ్లను... చెట్టు నుంటి కట్ చేసిన కొన్ని గంటల్లోనే పాడైపోతాయి. అందువల్ల ఇవి నిల్వ ఉండాలంటే... ఫ్రిజ్‌లో పెట్టుకోవాల్సిందే. కొత్తమంది వీటిలో ఏకైక గింజను తొలగించి... గుజ్జును ఓ జార్‌లో వేసి... ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నారు.
సాధారణంగా దక్షిణ అమెరికా ప్రజలు ఈ పండ్లను డైరెక్టుగా తింటారు. లేదంటే... మిల్క్ షేక్స్, కేక్స్, మఫ్పిన్స్‌లో బేక్ చేస్తారు. అలాగే జామ్స్‌లో కలిపేసి తింటారు. ఈ రుచికరమైన పండ్లు... ఎండాకాలంలో లభిస్తున్నాయి. అందువల్ల వీటిని ఎవరైనా ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలంటే... సమ్మర్‌లో ప్రయత్నించాలి. లక్కీగా ఉత్తర అమెరికా మొత్తం ఈ పండ్లను సప్లై చేసేందుకు దక్షిణ అమెరికా దేశాలతో డీల్స్ కుదిరాయి. ఉత్తర అమెరికాకు వచ్చిన పండ్లను ప్రపంచంలోని వివిధ దేశాలకు సప్లై చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇండియన్స్ కూడా వీటి కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benifits, Life Style