Home /News /life-style /

FIVE SIGNS THAT INDICATE YOU HAVE A SLOW METABOLISM UMG GH

Slow Metabolism: మలబద్ధకంగా ఉందా..? జుట్టు ఊడిపోతుందా..? అయితే మీకు అది సరిగా పనిచేయడం లేనట్టే..!

జీవక్రియ రేటు సరిగా లేకపోతే అనారోగ్యం తప్పదు.

జీవక్రియ రేటు సరిగా లేకపోతే అనారోగ్యం తప్పదు.

మెటబాలిజం (Metabolism) లేదా జీవక్రియ రేటు అనేది మీరు తినే, తాగే ఆహార పదార్థాలన్నిటినీ శక్తిగా మార్చే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ శరీరంలో వేగంగా జరిగితే, ఎంత ఆహారం తిన్నా వెంటనే జీర్ణమవుతుంది.

మెటబాలిజం (Metabolism) లేదా జీవక్రియ రేటు అనేది మీరు తినే, తాగే ఆహార పదార్థాలన్నిటినీ శక్తి (Energy)గా మార్చే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ శరీరంలో వేగంగా జరిగితే, ఎంత ఆహారం (Food) తిన్నా వెంటనే జీర్ణమవుతుంది. అలాగే ఎలాంటి పనైనా చేయగల శక్తి శరీరానికి త్వరగా అందుతుంది. ఫాస్ట్ మెటబాలిజం అనేది మీరు తీసుకునే ఆహారం ఏదైనా సరే దానికి అనుగుణంగా మారిపోతుంది. అలా ఆహారంలోని కేలరీలను సమర్థవంతంగా కరిగిస్తుంది. అదే, మెటబాలిజం కాస్త నెమ్మదిగా (Slow Metabolism) ఉంటే శరీరంలోని కేలరీలు మెల్లగా కరుగుతాయి. ఫలితంగా బరువు వెంటనే పెరుగుతారు. శరీరంలో పోషకాలను గ్రహించి, శక్తి (Energy)ని అన్ని అవయవాలకు పంపే సామర్థ్యం తగ్గినప్పుడు మొత్తం ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. మరి మీ శరీరంలో మెటబాలిజం స్లోగా ఉందా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. బరువు పెరగడం
అకారణంగా బరువు పెరగడం అనేది స్లో మెటబాలిజంను (Slow Metabolism) తెలిపే ఒక ప్రాథమిక సంకేతం. జీవక్రియ నెమ్మదిగా ఉంటే మీరు ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న కూడా బరువు అసలు తగ్గరు.

2. అలసట
ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా.. అలసిపోయిన ఫీలింగ్ కలిగితే స్లో మెటబాలిజం ఉందని అర్థం. జీవక్రియ నెమ్మదిగా ఉంటే, ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి.. కేలరీలను శక్తిగా మార్చే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఈ ప్రక్రియ స్లోగా జరిగితే, అది శరీరంలోని భాగాలకు ఎనర్జీని అందించలేదు. ఫలితంగా కడుపునిండా ఆహారం తిన్నా లేదా ఎలాంటి వ్యాయామం చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది.



3. జుట్టు ఊడిపోవడం
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా.. జుట్టు ఊడిపోతుంటే, మెటబాలిజం స్లోగా ఉండటమే అందుకు కారణం చెప్పవచ్చు. ఎందుకంటే స్లో మెటబాలిజం వల్ల శరీరం ముఖ్యమైన అవయవాలకు శక్తిని అందించడానికే కష్టపడుతుంది. అలాగే అంతగా ముఖ్యం కాని జట్టును మెయింటైన్ చేయడానికి శరీరం పని చేయలేదు. దీనివల్ల జుట్టు ఊడటం అనివార్యంగా మారుతుంది.

4. మలబద్ధకం
స్లో మెటబాలిజం ఉన్నవారిలో మలబద్ధకం ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉంటుంది. ఈ సమస్యను ప్రారంభంలోనే వదిలించుకోకపోతే జీర్ణవ్యవస్థను బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహారం అరగదు. అలాగే జీవక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

5. చక్కెర, తినుబండారాలపై కోరిక పుట్టడం
స్వీట్స్, అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం బాగా తినాలని అనిపిస్తుంటే.. అది మీ జీవక్రియ సామర్థ్యం తగ్గుతుందనే సంకేతం.

ఇదీ చదవండి: మారుతి సుజుకి బ్రెజ్జా లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. రికార్డు స్థాయిలో బుకింగ్స్


బరువు తగ్గాలనుకునే వారు రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయితే త్వరగా బరువు తగ్గిస్తాయని చెప్పే కీటో, క్లీన్స్ డైట్ వంటి డైట్‌లను ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే ఈ డైట్స్ మీ జీవక్రియను పూర్తిగా మార్చేస్తాయి. దానివల్ల శరీరానికి తక్కువ పోషకాలే అవసరమని జీవక్రియ భావించి దానికదే నెమ్మదిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం కాబట్టి మెటబాలిజం స్లో చేసే ఆహారపు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Published by:Mahesh
First published:

Tags: Energy, Hair Loss, Health, Health care

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు