Nutrition Myths: ఫుడ్ విషయంలో ఎక్కువమంది నమ్మే అపోహలు ఇవే.. అది తినకూడదు.. ఇది తినకూడదు అంటుంటారు.. అసలు నిజాలేంటో తెలుసుకోండి..!
Nutrition Myths: ఫుడ్ విషయంలో ఎక్కువమంది నమ్మే అపోహలు ఇవే.. అది తినకూడదు.. ఇది తినకూడదు అంటుంటారు.. అసలు నిజాలేంటో తెలుసుకోండి..!
ఫుడ్ విషయంలో అసలు నిజాలేంటో తెలుసా మీకు..!
న్యూట్రిషన్ రిచ్ ఫుడ్స్ (Food) గురించి ప్రజలు ఎక్కువగా నమ్ముతున్న అపోహలపై క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు హెల్త్ (Health) ఎక్స్‌పర్ట్స్. ప్రజల్లో కొన్ని ఆహార పదార్థాలపై నెలకొనే అపోహలు, వాటికి సంబంధించిన నిజాలను సూచించారు. అవేంటో చూద్దాం.
మాంసాహారం, ముఖ్యంగా రెడ్ మీట్‌తో చేసే స్టీక్ వంటి పదార్థాలు అందరికీ పవర్‌హౌస్‌గా కనిపిస్తుంది. ఇది అన్ని రకాల విటమిన్‌లను అందిస్తుంది. విటమిన్ B-12 కూడా వాటిలో ఒకటిగా ఉండటం వల్ల.. బలం, మానసిక ఆరోగ్యం, విటమిన్ లోపాల ప్రమాదాన్ని తగ్గించడం కోసం ఇది తప్పనిసరి. అయినప్పటికీ ఇందులోని సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ కొన్ని సందర్భాల్లో మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి.
గుడ్డు పచ్చసొన స్వచ్ఛమైన కొలెస్ట్రాల్. ఇది ఆరోగ్యానికి హాని చేయదు. గుడ్లు తినేటప్పుడు దానిని తీసివేయడం మంచిది కాదు. అయితే రోజులో ఎంత మొత్తం తీసుకుంటున్నారనే అంశాన్ని గమనించడం ముఖ్యం.
వైద్యుడు సిఫార్సు చేసినప్పుడు మల్టీవిటమిన్‌లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఎలాంటి ఆలోచన లేకుండా రోజంతా మల్టీవిటమిన్‌లను తీసుకోవడం తెలివి తక్కువ పని అవుతుంది. ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత ఏమాత్రం తగ్గదు. ఈ సందర్భంలో అవి పని చేయవు.
జలుబు, దగ్గు లేదా సైనస్ సమస్యలు వచ్చినప్పుడు తల్లులు పిల్లలకు పాలు తాగించడం మానేస్తారు. అయితే పాలు ఎలాంటి హాని కలిగించవు, సైనస్ సమస్యలను మరింత తీవ్రతరం చేయవు. జలుబుతో బాధపడే పిల్లలు, పెద్దవారు ఎలాంటి భయం లేకుండా పాలు తాగొచ్చు.
యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ పరిశోధకుల వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడే డైట్ సోడాలు బరువు పెరిగేలా చేస్తాయి. ఇది ప్రత్యేకంగా 41 శాతం ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి అవి ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, అవి బరువు పెరగడానికి ప్రేరేపించవు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.