• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • FIVE FOLD INCREASE IN CASES OF ADVANCED CATARACT AND DRY EYES DURING THE PANDEMIC MK

కరోనా సమయంలో అడ్వాన్స్‌డ్‌ క్యాటరాక్ట్‌ కేసులు ఐదు రెట్లు పెరిగాయి...

కరోనా సమయంలో అడ్వాన్స్‌డ్‌ క్యాటరాక్ట్‌ కేసులు ఐదు రెట్లు పెరిగాయి...

ప్రతీకాత్మకచిత్రం

2020 సంవత్సరపు చివరి త్రైమాసంలో కాటరాక్ట్ ఏకంగా 50శాతం వృద్ధి చెందాయి. అంటే గణనీయంగా ఐదు రెట్లు వృద్ధి చెందాయి.

  • Share this:
    మహమ్మారి సమయంలో చాలామంది ప్రజలలో కళ్లకు సంబంధించిన సమస్యల తీవ్రత మరింత తీవ్రమయింది. అధికశాతం మంది రోగులు అడ్వాన్స్‌డ్‌ క్యాటరాక్ట్‌, కంటి ఇన్‌ఫెక్షన్లు, తీవ్రమైన పొడి కళ్లు (డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌) మరియు ఆఖరకు కార్నియల్‌ గ్రాఫ్ట్‌ రిజెక్షన్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్‌ అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అతి తీవ్ర ప్రభావ కేసుల పరంగా చూస్తే అడ్వాన్స్‌డ్‌ క్యాటరాక్ట్స్‌ మరియు పొడి కళ్లు కేసులు అధికంగా కనిపించాయి.

    కోవిడ్‌కు ముందు మరియు ఆ తరువాత పరిస్థితులను సరిపోలుస్తూ గణాంకాలను వెల్లడించిన డాక్టర్‌ అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రి రీజనల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ –తెలంగాణా డాక్టర్‌ గౌరవ్‌ అరోరా మాట్లాడుతూ ‘2019 సంవత్సరపు చివరి త్రైమాసంలో మా ఆస్పత్రికివచ్చే మొత్తం క్యాటరాక్ట్‌ రోగులలో 10% కన్నా తక్కువ మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ క్యాటరాక్ట్‌తో బాధపడుతుండేవారు. 2020 సంవత్సరపు చివరి త్రైమాసంలో ఈ సంఖ్యలు ఏకంగా 50%కు వృద్ధి చెందాయి. అంటే గణనీయంగా ఐదు రెట్లు వృద్ధి చెందాయి. ఇదే రీతిలో డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌ కారణంగా డ్రై ఐస్‌ (పొడి కళ్లు) కేసులు 10% నుంచి 30–50%వరకూ అదే కాలంలో పెరిగాయి. మేము గమనించిందేమిటంటే, చాలామంది రోగులలో గ్లౌకోమా కేసులు కూడా పెరిగాయి. దీనికి ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోకపోవడమూ కారణమే ! ఇక గతంలోనే కార్నియా మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగులలో సమస్యలు తీవ్రం కావడం కూడా కనిపిస్తుంది. కార్నియాను తిరస్కరించడం మరియు అత్యధిక కంటి ఒత్తిడి వంటివి దీనికి కారణాలు. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న రోగులు తమ రెగ్యులర్‌ కంటి పరీక్షలను మహమ్మారి కాలంలో నిర్లక్ష్యం చేయడం వల్ల వారి కంటి రెటీనాలో తీవ్రమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి’ అని అన్నారు.

    డాక్టర్‌ భాను ప్రకాష్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఆప్తమాలజిస్ట్‌ , డాక్టర్‌ అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రి మాట్లాడుతూ తమ దగ్గరకు వచ్చిన కొన్ని కేసులను గురించి వెల్లడించారు. చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేయడం కారణంగా పరిస్థితి తలెత్తింది.

    తీవ్రరూపం దాల్చిన ఆ కేసులు :
    కేస్‌ 1 : ఓ వయోధికుడు తన క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయించుకోవడాన్ని కొన్ని నెలల పాటు ఆలస్యం చేయడం వల్ల అతని కంటిపై ఒత్తిడి పెరిగి పాక్షికంగా కంటి చూపును ఆయన కోల్పోయారు.
    కేస్‌ 2 : ఓ పెద్ద వయసు మహిళ యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం చేత బై లాట్రెల్‌ కార్నియల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. దానితో పాటుగా ఆమె రెండు కళ్లకూ చూపును కోల్పోయారు.
    కేస్‌ 3 : ఒక కంటి చూపుతో మాత్రమే ఉన్న రోగి గతంలో కార్నియా మార్పిడి శస్త్రచికిత్సను చేయించుకున్నారు. ఆయన కంటిలో ఇన్‌ఫెక్షన్‌ అభివృద్ధి చెందింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆయన కంటి డాక్టర్‌ను సంప్రదించలేకపోయారు. ఇప్పుడు ఆయన తన రెండు కళ్లనూ కోల్పోవడమే కాదు మరలా కార్నియా మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు.
    కేస్‌ 4 : ఓ యుక్త వయసు మహిళ గతంలో కార్నియా మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఆమె కంటిలోపల గ్రాఫ్ట్‌ రిజెక్షన్‌ జరగడం, సమయానికి ఆమె కంటి చికిత్స పొందలేకపోవడంతో గ్రాఫ్ట్‌ ఫెయిల్యూర్‌ అయింది.

    డాక్టర్‌ అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ గౌరవ్‌ అరోరా వెల్లడించే దాని ప్రకారం, కండ్లకలక అనేది అతి సాధారణంగా అభివృద్ధి చెందే సమస్య మరియు ఇది వ్యాధికి సంబంధించి ఏ దశలో అయినా అభివృద్ధి చెందవచ్చు. వైరస్‌ కారణంగా కనిపించే ప్రత్యక్ష ప్రభావం, రోగనిరోధక–మధ్యవర్తిత్వ కణజాల నష్టం మరియు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ప్రేరేపించబడిన ప్రోథ్రాంబాటిక్‌ స్థితి, అనుబంధ కో మార్బిడిటీలు, వ్యాధి నిర్వహణలో భాగంగా వినియోగించిన ఔషదాలు వంటివి కంటిలో సమస్యలకు కారణమవుతున్నాయి. కోవిడ్‌ ఐ కనెక్షన్‌ అనేది నేరుగా కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మరియు దాని చికిత్స లేదా ఇంటి వద్ద నుంచి పనిచేయడం కారణంగా పరోక్షంగా కారణమవుతుంది. కంటిపై కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ప్రత్యక్ష ప్రభావాలలో అతి అరుదైన కంటి సమస్యలైనటువంటి కండ్ల కలక, కెరటో కాంజువిక్టివిటీస్‌, బ్లీఫారిటీస్‌, రెటీనల్‌ మైక్రోవాస్క్యులర్‌ సమస్యలైనటువంటి వీన్‌ ఆక్యులేషన్స్‌, కాటన్‌ వూల్‌ స్పాట్స్‌, న్యూరో–ఆప్తాల్మిక్‌ సమస్యలు – నెర్వ్‌ పారాసిస్‌/ఆప్టిక్‌ న్యూరిటిస్‌ మరియు ఇతర అరుదైన సమస్యలను ఐసీయులో చికిత్స పొందిన రోగులలో – కార్నియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌, ఇషెమిక్‌ ఆప్టిక్‌ న్యూరోపతి, వాల్సావా రెటినోపతి, అక్యూట్‌ యాంగిల్‌ క్లోజర్‌ గ్లౌకోమా, ఎండోజీనియస్‌ ఎండోఫథాల్మిటిస్‌, ఆర్బిటాల్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ కనిపిస్తున్నాయి. కొన్ని అరుదైన కంటి సమస్యలు సైతం కరోనా వైరస్‌ చికిత్సలో భాగంగా యాంటీ మలేరియల్‌, ఇమ్యునోమాడ్యులేటర్స్‌, యాంటీ వైరల్స్‌ మొదలైన ఔషదాలు వాడటం వల్ల కూడా వస్తున్నాయి.

    ‘‘గత కొద్ది నెలలుగా, డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌ మరియు డ్రై ఐస్‌ సమస్యలతో వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతుండటం కూడా మేము గమనిస్తున్నాం. అధికంగా గాడ్జెట్లను వినియోగించడం, పని–జీవితం నడుమ సమతుల్యత కోల్పోవడం వంటివి దీనికి కారణాలు. లాక్‌డౌన్‌ తొలి దశలో, కొంతమంది రోగులు కండ్లకలకతో రావడం గమనించాం. అలాగే ఇతర రెటీనల్‌ వాస్క్యులర్‌ బ్లాకేజీతోనూ వస్తుండటం అప్పుడు చూశాం. ఆ తరువాత వారంతా కరోనా పాజిటివ్‌గా నిర్థారించడం జరిగింది’’ అని డాక్టర్‌ భాను ప్రకాష్‌ వెల్లడించారు.

    డాక్టర్‌ అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రి వైద్య నిపుణులు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో అధిక శాతం మంది రోగులు తాము ఆస్పత్రికి వెళ్తే కరోనా వైరస్‌ బారిన పడతామేమోనని ఆందోళన చెందుతున్నారు. మహమ్మారి తొలి దశలో ఈ భయం చాలా ఎక్కువగా కనిపించేది. ఈ ఫలితంగానే, రోగుల చికిత్సపై తీవ్ర ప్రభావం పడింది. కంటి సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది రోగులు రెగ్యులర్‌ ఫాలో అప్స్‌ కోసం ఆస్పత్రికి వెళ్లకపోవడం చేత, అప్పటికే ఉన్న కంటి సమస్యలు మరింత తీవ్రమమ్యాయి. ఇక నూతన కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేయడం కారణంగా తీవ్రమైన పరిణామాలకు దారి తీసింది. కొంతమంది చూపు కూడా కోల్పోయారు. టెలికన్సల్టేషన్స్‌ మార్గాన్ని అనుసరించిన రోగులు సైతం తమ సమస్యలకు అన్ని పరిష్కారాలూ రిమోట్‌గానే కావాలనుకున్నారు. భౌతిక పరీక్షల కోసం ఆస్పత్రికి రావడానికి వారు నిర్ద్వందంగా తిరస్కరించడమూ కనిపించింది. మరీ ముఖ్యంగా తప్పనిసరిగా అవసరమైన సంఘటనలలో కూడా ఇది కనిపించింది.

    కంటి చూపుకు సంబంధిం అత్యుత్తమ సంరక్షణ పొందాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ గౌరవ్‌ అరోరా సూచిస్తూ ‘‘50 సంవత్సరాలు దాటిన, మధుమేహ రోగులు తప్పనిసరిగా సంవత్సరానికి ఓ మారు అయినా తమ కంటి చూపును పరీక్షించుకోవాలి. ఈ తరహా రోగులలో 30% మందికి పైగా రోగులలో ఏదో ఒక రూపేణా డయాబెటిక్‌ కంటి సమస్యలైనటువంటి డయాబెటిక్‌ రెటినోపతి, డయాబెటిక్‌ మాక్యులర్‌ ఎడెమా, క్యాటరాక్ట్‌, గ్లౌకోమా వంటి సమస్యలు కలుగవచ్చు. మరియు దాదాపు 10% మంది రోగులు ఎవరికైతే డయాబెటిక్‌కంటి సమస్యలు గుర్తించారో వారికి కంటి చూపుకు తీవ్ర నష్టాన్నికలిగించే డయాబెటిక్‌ రెటినోపతి వచ్చే అవకాశాలున్నాయి.’’ పరీక్షల గురించి మాట్లాడాల్సి వస్తే ఏమిటన్న అంశమై ఆయనమాట్లాడుతూ మధుమేహ రోగులు ఓ కంటి వైద్యుడిని సందర్శించినప్పుడు వారు కంటి పరీక్షలతో పాటుగా కంటి అద్దాల పవర్‌, ఇంట్రాఆక్యులర్‌ ప్రెజర్‌ కనుగొనడం, రెటీనల్‌ ఇవాల్యుయేషన్‌ పరీక్షలు చేయడం జరుగుతుంది. రక్తపరీక్షలతో పాటుగా సంబంధిత ఐ స్కాన్స్‌ కూడా డాక్టర్‌ సూచించవచ్చు. ఒకవేళ డయాబెటిక్‌ ఐ డిసీజ్‌ కనుగొన్న ఎడల, ఫ్లూరోసిన్‌ ఫండస్‌ యాంజియోగ్రఫీ, ఆప్టికల్‌ కొహరెన్స్‌ టోమోగ్రఫీ మరియు బీ స్కాన్‌ అల్ట్రా సోనోగ్రఫీ వంటి పరీక్షలను వ్యాధి దశను బట్టి సూచిస్తారు. ఈ స్కాన్స్‌, వ్యాధి యొక్క దశను నిర్థారించడానికి తప్పనిసరి. అంతేకాదు, చికిత్స ప్రణాళికకు, వ్యాధి వృద్ధి పర్యవేక్షణకు కూడా తప్పనిసరి.

    డాక్టర్‌ భాను ప్రకాష్‌ మాట్లాడుతూ ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా చిన్నది అనడానికి ఏమీ లేదు. మరీ ముఖ్యంగా మహమ్మారి సమయాలలో చిన్నవే అని నిర్లక్ష్యం చేసిన అంశాలు తీవ్రంగా మారడమూ కనిపించింది. టెలి కన్సల్టేషన్‌ తో ఆరంభించడం అత్యుత్తమ అవకాశం. చాలా వరకూ కేసులలో, సరైన సలహాలు, చికిత్స పొందడానికి ఇది సరిపోతుంది. కొన్నిసార్లు డాక్టర్లు, వ్యక్తిగతంగా వచ్చి కలువమని కోరవచ్చు. ఆ సమయంలో మీరు ఒకవేళ డాక్టర్‌ను సంప్రదించలేకపోతే, చిన్న సమస్య కూడా మరింత తీవ్ర సమస్యగా మారే అవకాశమూ లేకపోలేదు. ఫేస్‌మాస్క్‌, హ్యాండ్‌ శానిటైజేషన్‌, భౌతిక దూరం ఆచరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్న కంటి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోండని సూచించారు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు