ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆఫీస్‌లకు హడావిడిగా పరిగెడుతున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇలా అందరూ తమ ఫుడ్ టేబుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి స్నాక్స్ సంగతి ఏంటి? ఏం తినాలి? చాలా మంది స్నాక్స్ తినేందుకు భయపడుతుంటారు. "బాబోయ్... వాటి సంగతి ఎత్తకండి... అసలే బోలెడు వర్కవుట్స్ చేసి ఫిట్నెస్ మెయింటేన్ చేస్తున్నాం" అంటుంటారు. కానీ... ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఆఫీస్ టైమింగ్స్‌లో స్నాక్స్ తీసుకోవడం చాలామంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మఫిన్స్ : గోధుమపిండి లేదా మల్టీగ్రెయిన్తో చేసిన మఫిన్స్... పోషకాలు నిండుగా ఉన్న స్నాక్స్. వీటిలో డ్రైఫ్రూట్స్, దేశీయ నెయ్యి, కనీస స్థాయిలో చక్కెరను కలపడం వల్ల అదనపు శక్తి మీ సొంతం అవుతుంది.
ట్రయల్ మిక్స్ : బాదం, పిస్తా, అక్రోట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్షలను ట్రయల్ ప్యాక్‌లా ప్యాక్ చేయండి. వీటిని మీ ఆఫీస్‌కి చక్కగా తీసుకెళ్లొచ్చు. ప్రతి ఆదివారం వీటిని చిన్న చిన్న ట్రయల్ ప్యాక్స్‌లా సిద్ధం చేస్తే సరి.
ప్రోటీన్ బార్స్ : ఒకప్పుడు పల్లీ చిక్కీ అని మనం ఇష్టంగా తినేవాళ్లం గుర్తుందా..? వాటినే ఇప్పుడు ప్రోటీన్ బార్స్ అంటున్నారు. మీ ఇష్టాన్ని బట్టీ వివిధ రకాల నట్స్‌తో వీటిని మీరే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఎంతో శక్తి మీ సొంతం.
చిరుతిళ్లుగా చిక్కుడు : చిక్కుడు గింజలు ప్రోటీన్స్‌కి మరోపేరు అని చెప్పొచ్చు. వీటిని ఖాళీగా ఉన్నప్పుడు కాల్చి, కొంచెం స్పైసెస్‌ని యాడ్స్ చేస్తే... వీటి ముందు చిప్స్ కూడా పనికిరావని చెప్పొచ్చు.
మొలకలు : మొలకలను కూడా మీ ఆఫీస్ టైమింగ్ స్నాక్స్ లిస్ట్‌లోకి చేర్చుకోవచ్చు. వీటిని ఊరికే అలా తినడం కంటే రుచిపెంచడానికి ఉల్లిపాయ, టమోటా, దోసకాయ, క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసి.. కాస్త నిమ్మరసం కలపండి.
పైన చెప్పిన స్నాక్స్ ఐటెమ్స్ అన్నీ కూడా మీరు చక్కగా ఆఫీస్‌కి క్యారీ చేసేయొచ్చు. మరింకేందుకు ఆలస్యం.. ట్రై చేసేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benifits, Life Style, Tips For Women, Women health