రంజాన్ స్పెషల్.. ఈ ఐదు బిర్యానీలు టేస్ట్ చేశారా?

రంజాన్ సందర్భంగా ఐదు స్పెషల్ బిర్యానీలను పరిచయం చేస్తోంది న్యూస్18 తెలుగు.

news18-telugu
Updated: June 5, 2019, 5:20 PM IST
రంజాన్ స్పెషల్.. ఈ ఐదు బిర్యానీలు టేస్ట్ చేశారా?
హైదరాబాదీ బిర్యానీ
  • Share this:
రంజాన్ అంటే మటన్, బిర్యానీనే. ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రంజాన్ రోజు బిర్యానీ, షీర్ కుర్మా లాగిస్తుంటారు. అయితే, ఈ రంజాన్ సందర్భంగా మీకు ఐదు స్పెషల్ బిర్యానీలను పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే మీరు ఈ బిర్యానీలను తిని ఉండొచ్చు. కానీ, మరోసారి ఆ టేస్ట్‌ని రుచి చూడండి.

సింధి బిర్యానీ :

మటన్‌ ముక్కలకి మసాలా దట్టించి రాత్రంతా నానబెడతారు. ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా దినుసులు మెత్తగా రుబ్బి.. ఆ ముక్కలకు పట్టించాలి. ఆ తర్వాత బాస్మతి బియ్యంలో బిర్యానీ వండినట్టు వండాలి. వంట పూర్తయ్యాక జీడిపప్పు, కొత్తిమీద, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి డెకరేషన్ చేసుకోవాలి. దీన్ని గుజరాతీలో కూడా తయారుచేస్తారు. కానీ కొంచెం టమాటాలు ఎక్కువ వాడతారు.

సింధి బిర్యానీ
సింధి బిర్యానీ
కోల్‌కతా మటన్ బిర్యానీ :

ఈ పేరు చెబితే నోరూరడానికంటే ముందు అద్భుమైన వాసన గుర్తొస్తుంది. దీన్ని కూడా సింధి బిర్యానీ టైప్‌లో మటన్ ముక్కలకి మసాలా దట్టించి రాత్రంతా నానబెట్టాలి. వండాలి. మటన్‌ని బియ్యంలో వేసేటప్పుడు వరుసల్లో వేయాలి. ముందు ముక్కలు, ఆ పైన బియ్యం.. మళ్లీ ముక్కలు పేర్చుకుంటూ వెళ్లాలి. ఒక వరుసలో రోజ్ వాటర్, మరో వరుసలో కుంకుమపువ్వు నీళ్లు, ఇంకో లేయర్‌లో తియ్యటి అత్తర్ చల్లితే అమోఘం. బంగళాదుంపలు (ఆలు)ని తొక్కు తీసి పసుపునీళ్లలో ఉడకబెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత తీసి.. ఫ్రై చేయాలి. దీనికి ఉడికించిన కోడిగుడ్లు కూడా జోడిస్తే సూపర్.

కోల్‌కతా మటన్ బిర్యానీ
కోల్‌కతా మటన్ బిర్యానీ
మలబార్ మటన్ బిర్యానీ :

ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, గసగసాలు - కొబ్బరిపాలు కలిపిన మిశ్రమం స్పెషల్ అట్రాక్షన్‌. మటన్‌ముక్కలకి టమాటా, మసాలా మిక్స్ చేస్తే కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి వేయించాలి. కొబ్బరిపాలు కలిపిన ఈ మలబార్ బిర్యానీ దక్షిణాదిలో సూపర్ హిట్.

మలబార్ మటన్ బిర్యానీ
మలబార్ మటన్ బిర్యానీ


అవధి మటన్ బిర్యానీ:

ఇది రాయల్ ట్రీట్. అల్లం వెల్లుల్లి, మసాలా దినుసుల మిశ్రమాన్ని మటన్‌కి దట్టించి.. దాన్ని ఉల్లిపాయలతో కలిపి రాగి గిన్నెలో వండుతారు. రెగ్యులర్ బిర్యానీ వండినట్టు మటన్, రైస్ కలిపి వండకూడదు. మాంసం వేరేగా వండి.. దాన్ని బిర్యానీలో పేర్చాలి. ఆపైన కుంకుమ పువ్వు నీరు, కొత్తిమీర - పుదీన లాంటివి వేయాలి. ఆ గిన్నెను సన్నటి మంటమీద పెట్టి కాసేపు ఉడికించాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ బిర్యానీకి మరింత టేస్ట్ తీసుకొస్తుంది.

అవధి బిర్యానీ
అవధి బిర్యానీ


హైదరాబాద్ బిర్యానీ :

ఇది లాస్ట్‌గా చెప్పి ఉండొచ్చు. కానీ దీని టేస్ట్ అద్భుతం. చాలా మంది హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేసి ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేయాలి. నవాబుల వంటగా పేరుగాంచిన ఈ బిర్యానీ నాన్‌వెజ్ తినే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇంట్లోనే ట్రై చేస్తారు. దీన్ని ఎలా వండాలో అందరికీ తెలుసుకాబట్టి రెసిపీ చెప్పడం లేదు. బొగ్గుల పొయ్యి మీద మటన్ బిర్యానీ వండితే ఆ టేస్ట్ అద్భుతం.

హైదరాబాదీ బిర్యానీ
హైదరాబాదీ బిర్యానీ
First published: June 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు