ఆయుర్వేదం ప్రకారం.. ఆరోగ్య సంరక్షణలో కొబ్బరినీళ్లు (Coconut Water) కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరికాయలు (Coconuts) భారతదేశంలోని ప్రతిచోటా లభిస్తాయి. దీనితో తయారు చేసే అన్ని రకాల ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి (Health) కూడా ఉపయోగకరంగా పరిగణించే కొబ్బరినీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీంట్లో ఇన్ బిల్ట్ హైడ్రేటింగ్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది గుండె సమస్యలకు కారణమయ్యే రక్తపోటును సమర్థంగా కంట్రోల్ చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే కొబ్బరి నీటిని రాత్రివేళ పడుకునే ముందు తాగితే, దీని ప్రయోజనాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. దీనివల్ల ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
* రక్తపోటును నియంత్రిస్తుంది
అధిక రక్తపోటుకు కొబ్బరినీళ్లు చెక్ పెడతాయి. ఈ సమస్య ఉన్న బాధితులు రక్తపోటును సహజంగా తగ్గించుకోవాలనుకుంటే.. రాత్రిపూట పడుకునే ముందు కొబ్బరి నీరు తాగి చూడండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే రక్తపోటును తగ్గించడానికి మందులు తీసుకుంటే మాత్రం కొబ్బరినీళ్లు తాగకూడదు.
* కిడ్నీ సమస్యలు దూరం
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొబ్బరి నీళ్లు మెడిసిన్‌లా పనిచేస్తాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు సాయంత్రం పూట కొబ్బరినీళ్లు తాగితే.. అందులోని పోషక విలువలు రాత్రంతా శరీరానికి అందుతాయి. ఇది బాధితుల శరీరానికి, కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
* డీహైడ్రేషన్
కొంతమంది శరీర తత్వం వల్ల తరచుగా వేడి చేస్తుంది. ముఖ్యంగా ఎండ, వేడి వాతావరణంలో పనిచేసే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్యలలో డీహైడ్రేషన్ ఒకటి. ఇలాంటి వారు కొబ్బరినీళ్లను తరచుగా తాగడం మంచిది. మనం మేల్కొని ఉన్నప్పుడు క్రమం తప్పకుండా నీరు తాగుతాం కాబట్టి, డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చు. అయితే నిద్రలో ఉన్నప్పుడు ఇలా శరీరానికి అవసరమైన నీరు అందకపోవచ్చు. అందువల్ల రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో నీటి కొరత ఉండదు. దీంతోపాటు ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి.
* గుండె ఆరోగ్యానికి రక్షణ
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటితోపాటు కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగాలి.
* యూరిన్ ఇన్ఫెక్షన్స్కు చెక్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తరచుగా కొబ్బరి నీరు తాగడం మంచిది. ఇవి మూత్రం ద్వారా శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. దీంతోపాటు మూత్రం ఆపుకోలేని వైద్యపరమైన సమస్యలను కూడా వీటిలోని పోషకాలు దూరం చేస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurveda health, Coconut water, Health, Health benefits