ఆత్మహత్యలకు చెక్.. దీన్ని పీల్చితే చనిపోవాలన్న ఆలోచనే రాదు

ఈ మందుతో వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా స్ప్రావటోను ముక్కు ద్వారా పీల్చుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుందని తెలిపింది.

news18-telugu
Updated: August 5, 2020, 3:34 PM IST
ఆత్మహత్యలకు చెక్.. దీన్ని పీల్చితే చనిపోవాలన్న ఆలోచనే రాదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల ఆత్మహత్య కేసులు పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న కారణాలకే చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సాధారణ ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిలైనందుకు విద్యార్థులు, కుటుంబ కలహాలతో పెద్దలు, అవకాశాలు రావడం లేదని సినిమా స్టార్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని మానసిక ఒత్తిడి నుంచి, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి బయటపడేసేందుకు ఓ అద్భుతమైన ఔషధం వచ్చేసింది.

ఒత్తిడితో చిత్తవుతున్న మానసిక రోగుల కోసం జాన్సస్ అండ్ జాన్సన్ సంస్థ స్ప్రావటో (Spravato) పేరుతో నాసల్ స్ప్రేను తీసుకొచ్చింది. అమెరికాలో ఈ మందును వినియోగించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోద ముద్రవేసింది.


అమెరికాలో 11-12% మంతి మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. కోటి 10 లక్షల మంది డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడయింది. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం స్ప్రావటో ఔషధాన్ని అభివృద్ధి చేసింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. ఔషధ ప్రయోగాల కోసం 2019లో అనుమతులు వచ్చాయి. ఆ తర్వాత సుమారు 6వేల మందిపై స్ప్రావటోను ప్రయోగించారు. ఆ మందుతో వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా స్ప్రావటోను ముక్కు ద్వారా పీల్చుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుందని తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading