ఇన్సూరెన్స్ కంపెనీ (Insurance companies)లు క్లెయిమ్స్ చెల్లింపుల విషయంలో వివిధ రకాల కారణాల (reasons)ను ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తుంటాయి. కంపెనీలు విచిత్రమైన కారణాలు చూపి క్లెయిమ్ (claims)ను తిరస్కరించడం.. లేదంటే కొద్ది మొత్తాన్ని మాత్రమే చెల్లించడం సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ (insurance claims)ను తిరస్కరించడానికి బీమా కంపెనీ (Insurance companies)లు చెబుతున్న విచిత్రమైన కారణాలను మనీకంట్రోల్ (money control) వార్తాసంస్థ వెలుగులోకి తెచ్చింది. ఆ వివరాలు చూద్దాం.
* ప్రమాదకర కార్యకలాపాలు
ఓ వ్యక్తి మామిడిపండ్లు కోస్తున్నాడు. తోటలో మామిడిపండు పడటంతో గాయపడి, సంబంధిత పాలసీ ప్రకారం బీమా క్లెయిమ్ (insurance claims) చేశాడు. అయితే కంపెనీ ఆ క్లెయిమ్‌ను తిరస్కరించింది (rejected). పాలసీదారుడు ప్రమాదకర పనిలో పాల్గొన్నాడని ఇది స్టంట్ లాంటిదని కంపెనీ సమాధానం చెప్పింది. అతను అలాంటి పనులు చేయడంలో శిక్షణ పొందాడా లేదా అనేది కంపెనీ పరిగణనలోకి తీసుకోలేదు. అతను ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొన్నాడా లేదా అనేదే కంపెనీ పరిశీలించి క్లెయిమ్ తిరస్కరించింది. పెరట్లో మామిడి చెట్టు ఉంటే పండ్లు కోసుకుంటాం. ఇది ప్రమాదకర చర్యగా బీమా కంపెనీలు పేర్కొనడం దారుణమని ఫస్ట్ పాలసీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ (First policy Insurance Brokers) రీజినల్ డైరెక్టర్ హరి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దీనిపై మనీకంట్రోల్ బీమా కంపెనీని ఆరా తీయగా క్లెయిమ్ (insurance claims) చెల్లించినట్టు తెలిపారు.
* 150 సీసీ కెపాసిటీ దాటిన బైకు నడుపుతున్నారా?
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (HDFC ERGO) వ్యక్తిగత ప్రమాద బీమాలో 150సీసీ కెపాసిటీ దాటిన బైకులు నడిపే వారిని కవరేజీ (coverage) నుంచి మినహాయించింది. పాలసీదారుడు 346 సీసీ కెపాసిటీ ఉన్న బైకు నడుపుతూ ప్రమాదానికి గురైతే.. పాలసీ షరతులు, నిబంధనల ప్రకారం క్లాజ్ 8 కింద ప్రమాద గాయాలకు కంపెనీ క్లెయిమ్ చెల్లించదు. 150 సీసీ దాటితే ఈ నిబంధనలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. అయితే తరువాత ఈ క్లాజును తొలగించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో బీమా కంపెనీ ( hdfc ergo general insurance) తెలిపింది. అందువల్ల పాలసీలు తీసుకునే విషయంలో ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
* జ్వరాల చికిత్స క్లెయిమ్ తిరస్కరణ
ఓ పాలసీదారుడికి జ్వరం వచ్చిన ఐదు రోజుల తరువాత ఆసుపత్రికి వెళ్లాడు. కొన్ని టెస్టులు చేసినా రోగ నిర్ధారణ కాలేదు. డాక్టర్లు ఆసుపత్రిలో ఇన్ పేషెంటు (In patient)గా చేరమని చెప్పారు. తరువాత మూడు రోజులకు రోగి (patient)ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయంలో డాక్టర్లు సరైన చికిత్సా విధానం పాటించలేదని కంపెనీలు బీమా తిరస్కరించవచ్చు. సాధారణ జ్వారాలకు అవుట్ పేషెంటు విభాగంలో చికిత్స అందించవచ్చని బీమా కంపెనీలు క్లెయిమ్ (insurance claims) తిరస్కరించే ప్రమాదం ఉంది.
* కొంత భాగం మాత్రమే చెల్లించడం
కరోనా మహమ్మారి తరువాత అనేక బీమా కంపెనీలు పాలసీలను క్లెయిమ్ (insurance claims) చేసిన వారికి పాక్షిక చెల్లింపులు చేస్తున్నాయి. కరోనా చికిత్స ఖర్చుల విషయంలో జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చికిత్స ఖర్చుల చార్ట్ రూపొందించింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ధరలు, జీఐ చార్ట్ ధరల్లో వ్యత్యాసం ఉండటంతో చెల్లింపుల విషయంలో ఇంకా వివాదం నడుస్తోంది.
* మైనర్ క్యాన్సర్లకు పాక్షిక చెల్లింపులు
ప్రాణాంతక క్యాన్సర్ (cancer) జబ్బుల కవరేజీకి ప్రత్యేక పాలసీలు రూపొందించారు. క్యాన్సర్ జబ్బు స్థాయిని బట్టి ఈ క్లెయిమ్స్ (insurance claims) చెల్లిస్తారు. ముందే జబ్బును గుర్తిస్తే మొత్తం క్లెయిమ్ చెల్లించరు. కేవలం కవరేజీలో 25 శాతం చెల్లిస్తారు. తర్వాత మూడు సంవత్సరాల ప్రీమియం చెల్లింపులను రద్దు చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance