Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి

Baby Names : పిల్లలు పుట్టాక... తల్లిదండ్రులతోపాటూ... వారి బంధువులకు కూడా ఏ పేరు పెట్టాలనేది పెద్ద విషయం. ఐతే... పేర్లు పెట్టే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు.

news18-telugu
Updated: November 25, 2019, 2:33 PM IST
Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి
Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి
  • Share this:
Baby Names : ఈ రోజుల్లో పిల్లలకు పేర్లు పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే... ఇప్పటికే లక్షల కోట్ల పేర్లు... తెరపైకి వచ్చి... చరిత్రలో కలిసిపోయాయి. రొటీన్ పేరు పెడితే రొటీన్‌గానే ఉంటుంది. అలాగని వైవిధ్యమైన పేరు పెడితే... ఎవరూ గుర్తుపట్టలేరు. కాబట్టి... ఎలాంటి పేరు పెట్టాలనేది పెద్ద ప్రక్రియే. ఎందుకంటే... ఈ పేరు అనేది మాటిమాటికీ పెన్నులా మార్చుకునేది కాదు. పుట్టు మచ్చలా లైఫ్‌లాంగ్ తోడుగా ఉండేది. పేరే కదా... మనిషికి గుర్తింపు తెచ్చేది. ఈ రోజుల్లో పిల్లలు పుట్టక ముందే... ఏం పేరు పెట్టాలనే దానిపై పేరెంట్స్, వాళ్ల రిలేటివ్స్ రకరకాల పేర్లు ముందే ఆలోచించి పెట్టుకుంటున్నారు. కొందరైతే... పేర్ల బుక్స్ కొంటారు. ఇంకొందరు గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. ఈ పేర్లకు సంబంధించి కొన్ని వందల వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. అవన్నీ రకరకాల పేర్లు సూచిస్తున్నాయి. ఐతే... పేరు పెట్టేందుకు ఏయే విషయాలు ఆలోచించుకోవాలో ఓసారి తెలుసుకుందాం.

* పిల్లలకు పెట్టే పేర్లు అరుదుగా విన్నవై ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి పేరు ఆ చిన్నారికి మాత్రమే ఉంది అనిపించాలి. ఇందుకోసం మరీ లోతుగా ఆలోచించనక్కర్లేదు. పేరు ఎట్టి పరిస్థితుల్లో ఫన్నీగా ఉండకూడదు. అలాంటి కామెడీ పేరు పెడితే... చిన్నారికి ఫ్యూచర్‌లో చాలా ఇబ్బంది అవుతుంది.

* పేరు పెట్టాక... చిన్నారి ఆ పేరుతోనే జీవితాంతం జీవించే పరిస్థితి. అందువల్ల ఒకటికి పదిసార్లు ఆలోచించి ఫైనల్ నేమ్ ఫిక్స్ చేసుకోవాలి.

* కొన్ని పేర్లు వింటే... అది కరెక్టు పేరేనా అనిపిస్తుంది. ఉదాహరణకు అబ్బాయికి శశి అని పెట్టకూడదు. ఎందుకంటే... శశి అనే పేరు వినగానే అమ్మాయి అనే ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే అమ్మాయికి తరుణ్, వరుణ్ వంటి పేర్లు పెట్టకూడదు. అలా పెడతారని కాదు... ఒక్కో సందర్భంలో కొంతమంది అలా పెడుతుంటారు. అందువల్ల ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఐశ్వర్యరాయ్‌ని... నిక్‌నేమ్‌గా ఐష్ అంటారు. మీ చిన్నారికి పెట్టే పేరు విషయంలో కూడా నిక్‌నేమ్ కలిసి ఉండే పేరు పెట్టాలి. ఉదాహరణకు కృష్ణ అనే పేరులో నుంచీ కొందరు క్రిష్ అని నిక్‌నేమ్ పెట్టుకుంటారు. ఐతే... అసలు పేరు ఎంత బాగుంటుందో, నిక్ నేమ్ కూడా అంతే బాగుండేలా చూసుకోవాలి. ఉదాహరణకు రాజేష్ అన్న పేరుకి నిక్‌నేమ్ రాజ్ అంటే బాగోదు. అది సెట్ కాదు. ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. ఈ నిక్‌నేమ్ ఎంత కీలకమంటే... స్కూల్, కాలేజీ డేస్‌లోనే కాదు... బ్యాంకులు కూడా ట్రాన్సాక్షన్ల టైమ్‌లో నిక్ నేమ్ ఏంటని అడుగుతున్నాయి. అందువల్ల దీనిపై దృష్టిపెట్టుకోవాలి.

* పేరంటే ఒక్క పదమే ఉండకపోవచ్చు. రాజేష్ కుమార్, దివ్య భారతి... ఇలా రెండు మూడు పదాలు కలిపి ఉండొచ్చు. అలాంటి పేరు పెట్టాలనుకుంటే... ఆ పేరు రిథమిక్‌గా ఉండేలా చూసుకోవాలి. అంటే... ఆ పేరును మొదటి నుంచీ చివరి వరకూ పలికేటప్పుడు ఎక్కడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా... చాలా ఈజీగా పలికేలా ఉండాలి. ధన్వంత్ అన్వేష్ వర్మ అనే పేరే తీసుకుంటే... ఇందులో రిథమిక్ ఉంది. ధన్వంతన్వేష్ వర్మ అని ఈజీగా పలికేయవచ్చు. అదే ముకుంద్ ఖావడే విశ్వా్స్... అనే పేరైతే... పలికేటప్పుడే ఏదో ఇబ్బంది అనిపిస్తుంది. అందువల్ల రిథమిక్‌గా ఉందో లేదో చూసుకొని పెట్టుకోవాలి.

* కొంతమంది పూర్వీకులు, పెద్దవాళ్ల పేర్లను మిక్స్ చేసి పిల్లలకు పెడుతుంటారు. సెంటిమెంట్ కోసం అలా చేసినా... అది చిన్నారికి పెరిగి పెద్దయ్యాక ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల గతంతో సంబంధం లేకుండా... చిన్నారికి పేరు పెట్టాలి. ఆల్రెడీ సర్‌నేమ్ (ఇంటిపేరు) ఎలాగూ ఉంటుంది కాబట్టి... మళ్లీ అదనంగా పెద్దవాళ్ల పేర్లను చేర్చడం చిన్నారికి కష్టం కలిగించవచ్చు. సెంటిమెంట్ కంటే... చిన్నారి సంతోషమే ముఖ్యం కదా.* కొత్త పేర్లు దొరకట్లేదని అనిపిస్తే రెండు మూడు పేర్లు కలిపేస్తే... కొత్త పేర్లు తయారవుతాయి. ఈశ్వర్, నాగేష్... ఈ రెండూ కలిపేసి నాగేశ్వర్ అన్నట్లుగానే... మిక్సింగ్ నేమ్స్‌పై దృష్టి పెట్టడం మంచిదే.

* తిథులు, నక్షత్రాలు, వారఫలాలు ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నా... వాటిని లెక్కలోకి తీసుకుంటూనే... ఓల్డ్ నేమ్ కాకుండా... కాస్త ఇప్పటి ట్రెండ్‌కి తగిన పేరు పెట్టేందుకు ప్రయత్నించండి.

* మీరు పెట్టే పేరు ఇతర భాషల్లో చెడు పదం కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే... మన దేశంలోనే దాదాపు 600 రకాల భాషలున్నాయి. నిప్పు అనే పదానికి ఓ గిరిజన భాషలో కిస్ అనే అర్థం ఉంది. అందువల్ల పేరు పెట్టేటప్పుడు... కనీసం ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి ప్రధాన భాషల్లో ఆ పేరుకి ఎలాంటి అర్థాలు ఉన్నాయో తెలుసుకుంటే మేలు.

* మొదటి చిన్నారి అయినా, రెండో చిన్నారి అయినా... పేర్ల విషయంలో మాత్రం స్పెషలే. మీరు పెట్టిన పేరును ఆ చిన్నారి తలచుకుంటూ... లైఫ్ లాంగ్ మీకు థాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి పేరు మీరు పెట్టాలి.


Pics : కొంటె చూపులతో కవ్విస్తున్న బాలయ్య భామ
ఇవి కూడా చదవండి :

Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు

Health : సంతాన సమస్యలను దూరం చేసే ఆహారం... తప్పక తినాలి...


చక్కెర కంటే బెల్లం తినడం మేలు... ఎందుకంటే...

Apple Cider Vinegar : చక్కటి ఆరోగ్యానికి మేలైన ఔషధం... యాపిల్ సైడెర్ వెనిగర్...


ఇన్సులిన్‌ను పెంచుతున్న కొత్త ప్రోటీన్... కనుక్కున్న పరిశోధకులు
Published by: Krishna Kumar N
First published: November 25, 2019, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading