• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • FINANCIAL MANAGEMENT TIPS FOR NEWLY WED COUPLE HERE IS FULL DETAILS SU GH

Financial management: కొత్తగా పెళ్లి చేసుకున్నారా?.. ఖర్చులకు డబ్బులు చాలడం లేదా?.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

Financial management: కొత్తగా పెళ్లి చేసుకున్నారా?.. ఖర్చులకు డబ్బులు చాలడం లేదా?.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా పెళ్లి చేసుకున్నవారు దృష్టి పెట్టాల్సిన అంశాల్లో మనీ మేనేజ్‌మెంట్ కూడా తప్పకుండా ఉండాలి.

  • Share this:
కొత్తగా పెళ్లి చేసుకున్నవారు దృష్టి పెట్టాల్సిన అంశాల్లో మనీ మేనేజ్‌మెంట్ కూడా తప్పకుండా ఉండాలి. పెళ్లి తరువాత సంపాదన, ఖర్చు, డబ్బుకు సంబంధించిన ఇతర అలవాట్లను నవదంపతులు మార్చుకోవాలి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తుకు భరోసా ఇచ్చే మంచి ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దీంతో పాటు ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు, కొత్త ఇళ్లు, కారు, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్రత్యేకంగా డబ్బు దాచాలి. ఆర్థిక విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఎదురైనప్పుడు.. ఇద్దరూ వాటి గురించి చర్చించి కలిసి ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలి. నవ దంపతులు ఎలాంటి ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం.

సంపాదన, ఖర్చులను బేరీజు వేసుకోవాలి పెళ్లికి ముందు భార్యాభర్తలు ఏయే అవసరాలకు ఎక్కువగా ఖర్చు చేసేవారో చర్చించుకోవాలి. ఇద్దరి ఉద్యోగ నేపథ్యం, ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్‌.. వంటి అన్ని వివరాలూ తెలుసుకోవాలి. ఆ తరువాత కుటుంబం కోసం ఒక ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఖర్చుల విషయంలో నిజాయతీగా ఉంటే, భవిష్యత్తులో డబ్బు విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావు. ఇద్దరిలో ఒకరికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అలవాటు ఉండవచ్చు. అలాంటప్పుడు తగ్గించాల్సిన ఖర్చులు, మిగిల్చిన మొత్తాన్ని దేనికి కేటాయించాలనే అంశాలపై ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి.

అవసరాలు గుర్తించాలి దంపతులిద్దరూ కలిసి కుటుంబం కోసం ఒక ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దీనికి ముందు కుటుంబ అవసరాలను గుర్తించాలి. కొత్త ఇల్లు, కారు, లేదా ఇతర ఆస్తులు కొనాలనుకునేవారు వాటి కోసం ప్రత్యేకంగా డబ్బు దాచాల్సి ఉంటుంది. పిల్లల కోసం ముందు నుంచే ప్రతి నెలా కొంత డబ్బును పక్కన పెట్టాలి. డబ్బు దాచడం, ఖర్చు విషయంలో ఇద్దరికీ భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఉమ్మడి లక్ష్యాలకు ఇద్దరూ ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రాధాన్య జాబితా ఉండాలి  లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ వంటివి అత్యవసర సమయాల్లో కుటుంబానికి అండగా నిలుస్తాయి. ఒక కుటుంబం మొత్తానికి లేదా కుటుంబ పెద్దకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి.  కరోనా తరువాత ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ విలువ తెలిసింది. ఇది వైద్య ఖర్చులను చాలావరకు తగ్గిస్తుంది. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అందువల్ల ఆదాయాన్ని బట్టి ఈ రెండు పాలసీలకూ కొంత డబ్బు కేటాయించాలి. దీంతోపాటు అత్యవసర నిధికి కూడా నెలవారీగా కొంత మొత్తం కేటాయించాలి. ఖర్చుల్లో వీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఉమ్మడి ఖర్చులు, ఉమ్మడి సేవింగ్స్ ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు ప్రత్యేక అకౌంట్లను కొనసాగించేందుకే ఇష్టపడతారు. నిజానికి ఇదే మంచి పద్ధతి అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మొత్తం డబ్బు ఒకే దగ్గర పోగుచేసి, దాని నుంచి ఖర్చులకు కేటాయింపులు చేయడానికి బదులుగా.. ఇద్దరి అకౌంట్ల నుంచి ఉమ్మడి ఖర్చులకు కేటాయింపులు చేయడం మంచిది. ఖర్చులను విభజించుకున్న తరువాత మిగిలిన డబ్బును ఉమ్మడి ఆర్థిక లక్ష్యాల కోసం ఖర్చు చేయాలి. అవసరమైతే సేవింగ్స్ కోసం ప్రత్యేకంగా ఒక జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు. దీనివల్ల సేవింగ్స్  అలవాట్లు, మనీ మేనేజ్మెంట్ నైపుణ్యాలు పెరుగుతాయి.

ఆర్థిక నిపుణుల సలహాలు పొదుపు, పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు వంటి విషయాల్లో ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. ఇలాంటప్పుడు మూడో వ్యక్తి  సలహా కోరాలి. కష్టపడి సంపాదించిన డబ్బును సరైన పద్ధతుల్లో పెట్టుబడులకు కేటాయించాలి. ఇందుకు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఇద్దరి అభిప్రాయాలనూ వారి ముందు ఉంచాలి. వారు ఇద్దరికీ సమ్మతమైన మార్గాలను సూచిస్తారు.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు