Egg shells: గుడ్డు పెంకులతో ఎరువులు తయారు చేసుకోవచ్చంట.. ఎలాగో తెలుసుకుందాం..

గుడ్డు పెంకులు

గుడ్డు పగలగొట్టాక దాని పెంకులు(shells) మాత్రం పడేస్తాం. అయితే ఆ పెంకుల(shells) వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయట. గుడ్డు పెంకులతో ఎరువులు తయారు చేయొచ్చంట, అలాగే జుట్టు మెరవడానికి వాడుతారంట. అందుకే గుడ్డు పెంకులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    గుడ్డు(egg)..  మనకు మంచి పోషకాహారం… ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది తమ ఆహారం(food)లో ప్రతిరోజు గుడ్డు ఉండేలా చూసుకుంటారు. ఇక కసరత్తులు చేసేవారైతే చెప్పనవసరం లేదు. రోజుకు రెండు నుంచి 20 వరకు లాగించేస్తారు. రోజూ ఒక గుడ్డు తింటే.. శరీరానికి శక్తి(energy) రావడమే కాకుండా.. పోషకాలు అందుతాయని అంటుంటారు. మామూలుగా అయితే గుడ్డుతో కూర చేసుకోవడం, ఉడకబెట్టుకోవడం(boiling), ఆమ్లెట్​గా వేసుకోవడం చేస్తుంటాం. అయితే గుడ్డు పగలగొట్టాక(broke) దాని పెంకులు(shells) మాత్రం పడేస్తాం. అయితే ఆ పెంకుల(shells) వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ఇవి కాల్షియం యొక్క గొప్ప మూలం. ఇది కాల్షియం కార్బొనేట్ రూపంలో లభిస్తుంది. బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, మాలిబ్డినం, సల్ఫర్, జింక్ మొదలైన ఇతర సూక్ష్మ మూలకాలను కూడా కలిగి ఉంటాయి. గుడ్డు పెంకులతో ఎరువులు(fertilizers) తయారు చేయొచ్చంట, అలాగే జుట్టు(hair) మెరవడానికి వాడుతారంట. అందుకే గుడ్డు పెంకులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

    గుడ్డు పెంకులతో ఎరువులు(fertilizers) తయారుచేసుకోవచ్చు. నత్రజని, భాస్వరం లాగా మొక్కలు పెరగడానికి కాల్షియం అవసరం. దీని లోపం ఎదుగుదల తగ్గడానికి, ఆకులు వంకరగా, నల్లని మచ్చలకు దారితీస్తుంది. మొక్కలకు కాల్షియం ఇవ్వడానికి గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించవచ్చు. ఎగ్ షెల్ పొడిని ఎరువుగా ఉపయోగించడానికి నాటేటప్పుడు పాటింగ్ మిక్స్ చేయాలి. కాల్షియం సప్లిమెంట్ ట్యాబ్లె్ట్స్‏కు బదులుగా గుడ్డు పెంకుల పొడిని ఉపయోగిస్తారు. అర టీ స్పూన్ ఎగ్ షెల్ పౌడర్‌లో 400 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మీ శరీర అవసరాన్ని బట్టి ఎగ్ షెల్ పౌడర్ తీసుకోవచ్చు. కాల్షియం పళ్ళు పెరగడానికి, బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

    జుట్టు కోసం..

    మీ జుట్టు(hair) పొడవును బట్టి ఒక గిన్నెలో తగినంత పరిమాణంలో గుడ్డు పెంకుల పౌడర్ తీసుకోవాలి. అందులో పెరుగు వేసి పేస్ట్‏లా చేయాలి. ఆ తర్వాత దానిని జుట్టు మొత్తం అప్లై చేసి.. అలా 15 నిమిషాలు ఉండనివ్వాలి. ఇలా చేయడం వలన జుట్టు మెరుస్తుంది. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ గుడ్డు పెంకుల(shells) పౌడర్ తీసుకోవాలి. అందులో తేనె కలుపుతూ మెత్తటి పేస్ట్‏గా మార్చాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం(face) మొత్తానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ఉపయోగించినట్లుగా అనిపిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిచేలా(shine) చేస్తుంది. గుడ్డు పెంకుల పొడిని టూత్‏పేస్ట్(tooth paste)‏గా ఉపయోగిస్తే చాలా మంచిది. ఇందుకోసం ఒక టీస్పూన్ ఎగ్ షెల్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా కలిపాలి. అలాగే ఇందులో కొబ్బరి నూనె కలపాలి. దీనితో వారానికి ఒకసారి పళ్లు తోముకోవడం వలన దంతాలు బలంగా ఉండడమే కాకుండా.. తెల్లగా మెరుస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published: