Pregnancy: ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉన్నా.. టెస్ట్ లో నెగటీవ్ వస్తోందా? కారణాలివే..

Pregnancy: పీరియడ్స్ టైంకి రాకపోవడం, రొమ్ముల్లో వాపు, నలతగా అనిపించడం వంటివి కనిపించినా కొన్నిసార్లు పరీక్షలో గర్భం నిర్ధారణ కాకపోవచ్చు. అందుకు కొన్ని కారణాలున్నాయి.

news18-telugu
Updated: November 27, 2020, 6:02 PM IST
Pregnancy: ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉన్నా.. టెస్ట్ లో నెగటీవ్ వస్తోందా? కారణాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొంతమంది మహిళల్లో గర్భందాల్చినప్పుడు ఎదురయ్యే లక్షణాలు కనిపించినప్పటికీ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్‌గానే వస్తుంది. ఇన్‌స్టాంట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ల ద్వారా తక్కువ సమయంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మంచి పనితీరును కనబరుస్తాయి. అవసరమైతే రెండు, మూడు సార్లు టెస్ట్ చేయడం ద్వారా గర్భం వచ్చిందో లేదో కచ్చితంగా తెలుసుకోవచ్చు. పీరియడ్స్ టైంకి రాకపోవడం, రొమ్ముల్లో వాపు, నలతగా అనిపించడం వంటివి కనిపించినా కొన్నిసార్లు పరీక్షలో గర్భం నిర్ధారణ కాకపోవచ్చు. అందుకు కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే...

వెంట వెంటనే టెస్ట్ చేసుకోవడం

ప్రెగ్నెన్సీ టెస్ట్‌ను వెంటవెంటనే, సరైన విరామం తీసుకోకుండా చేయించుకోవడం వల్ల ఫలితాలు సరిగా రాకపోవచ్చు. టెస్ట్ కిట్‌ ప్యాకేజీపై ఇచ్చిన సూచనలు పాటిస్తూ, సరైన తేదీలో పరీక్షించుకోవాలి. ఫలితం మళ్లీ నెగెటివ్‌గా వస్తే, కొన్ని రోజుల విరామం తర్వాత టెస్ట్ చేసుకోవాలి.

టెస్టింగ్ కిట్లు చెడిపోవడం
గడువు ముగిసిన, విరిగిపోయిన టెస్టింగ్ కిట్లతో ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసుకుంటే సరైన ఫలితం రాకపోవచ్చు. వాటిని కొనేటప్పుడే ఎంతవరకు గడువు ఉందో చూసుకోవాలి. టెస్టింగ్ కిట్లను సరిగా భద్రపరచాలి. మరీ వేడిగా, మరీ చల్లగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచకూడదు.

హార్మోన్ల అసమతూల్యత
పీరియడ్స్ రాకపోవడాన్ని గర్భం వచ్చిందనడానికి సంకేతంగా భావిస్తారు. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నా నెగెటివ్ గా వచ్చిందంటే హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారని అర్థం. ఈ సమస్య ఉన్న వారిలో పీరియడ్స్ గడువు కంటే ముందుగానే రావచ్చు. లేదా కొన్నిసార్లు రాకుండా పోవచ్చు. పీసీఓడీ సమస్య ఉన్నవారిలో నెలసరి మరిన్ని రోజులు ఆలస్యం కావచ్చు. పీరియడ్స్ రెండు నుంచి మూడు వారాల కన్నా ఎక్కువ ఆలస్యమైతే, తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

నీరు ఎక్కువగా తాగడం
అదేపనిగా నీరు తాగుతూ, పరీక్షించుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్‌గా చూపిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం డైల్యూట్ అవుతుంది. ఇది ఫలితం కచ్చితత్వంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే రాత్రి వేళల్లో నీరు ఎక్కువగా తాగకుండా, మరుసటి రోజు ఉదయాన్నే టెస్ట్ చేసుకోవడం మంచిది.

గర్భ నిరోధకాల దుష్ప్రభావాలు
గర్భం రాకుండా వాడే పిల్స్, ఇతర కాంట్రాసెప్టివ్ మెడిసిన్‌ వంటివి ప్రెగ్నెన్సీ ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ఇవి రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తాయి. ఇవి శరీరంపై, గర్భధారణపై దుష్ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, వారి సలహాతో మందులు వాడాలి.
Published by: Nikhil Kumar S
First published: November 27, 2020, 6:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading