Home /News /life-style /

FATIGUE STOMACH ACHES MOOD SWINGS AND MEMORY LAPSES TOP LONG COVID SYMPTOMS IN KIDS AGED 0 14 UMG GH

Long Covid: పిల్లలనూ వేధిస్తున్న లాంగ్ కోవిడ్.. లక్షణాలు వెల్లడించిన లాన్సెట్ అధ్యయనం

పిల్లల్లో పోస్ట్ కోవిడ్

పిల్లల్లో పోస్ట్ కోవిడ్

14 ఏళ్ల లోపు పిల్లల్లో లాంగ్ కోవిడ్ (Long Covid) లక్షణాల గురించి కొత్త వివరాలను వెల్లడించింది లాన్సెట్ (Lancet) స్టడీ. అలసట, కడుపు నొప్పి, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి లోపాలు, దద్దుర్లు వంటివి 0-14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలలో లాంగ్ కోవిడ్ ప్రధాన లక్షణాలు అని ఈ అధ్యయనం కనుగొంది.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. కొన్ని లక్షల మంది మరణాలకు కోవిడ్-19 కారణమైంది. కరోనా సోకి కోలుకున్న వారిని చాలాకాలం పాటు కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయి. వీటిని లాంగ్ కోవిడ్ లక్షణాలు అంటున్నారు. అయితే 14 ఏళ్ల లోపు పిల్లల్లో లాంగ్ కోవిడ్ లక్షణాల గురించి కొత్త వివరాలను వెల్లడించింది లాన్సెట్ స్టడీ. అలసట, కడుపు నొప్పి, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి లోపాలు, దద్దుర్లు వంటివి 0-14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలలో లాంగ్ కోవిడ్ ప్రధాన లక్షణాలు అని ఈ అధ్యయనం కనుగొంది. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన పిల్లలు కనీసం రెండు నెలల పాటు సుదీర్ఘ కోవిడ్ లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు కనుగొన్నారు. ‘ది లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్‌’ జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. కోవిడ్ పాజిటివ్ పిల్లలు కనీసం ఒక లాంగ్ కోవిడ్ లక్షణాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ రిసెర్చ్ నిర్ధారించింది.

ఈ అధ్యయనం కోసం డెన్మార్క్‌లోని పిల్లల నేషనల్ లెవల్ శాంప్లింగ్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇన్‌ఫెక్షన్ సోకని పిల్లల సమూహంతో Covid Positive కేసులను సరిపోల్చింది. దీంతోపాటు వీరి జీవన నాణ్యతను కూడా పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. 12-14 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వారి జీవన నాణ్యత స్కోర్లు ఎక్కువగా ఉన్నాయని, వీరిలో కోవిడ్ -19 పాజిటివ్ పిల్లల కంటే ఆందోళనలు (anxiety) తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అయితే ఇది మహమ్మారి, సామాజిక పరిమితులపై వారికి ఉండే అవగాహనతో ముడిపడి ఉండవచ్చు. క్లినికల్ టెస్టులు, సంరక్షణ మార్గాలు, లాక్‌డౌన్‌లు, టీకాలు తీసుకోవడం వంటి సామాజిక నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి పిల్లలలో దీర్ఘకాల కోవిడ్ భారం గురించి తెలుసుకోవడం చాలా అవసరమని అధ్యయన రచయితలు చెబుతున్నారు. వివిధ ఏజ్ గ్రూప్‌ పిల్లలందరిపై కోవిడ్-19 మహమ్మారి దీర్ఘకాలిక పరిణామాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని వీరు సిఫార్సు చేస్తున్నారు.



పిల్లలు, శిశువులలో లాంగ్ కోవిడ్ లక్షణాల ప్రాబల్యాన్ని గుర్తించడం ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు కోపెన్‌హాగన్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ సెలీనా కికెన్‌బోర్గ్ బెర్గ్. ఇందుకు జీవన నాణ్యత, స్కూల్, డే కేర్ ఫెసిలిటీ లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.

అధ్యయనాన్ని ఎలా నిర్వహించారు?
ఈ పరిశోధన కోసం 2020 జనవరి నుంచి 2021 జూలై మధ్య corona పాజిటివ్‌గా తేలిన 0-14 సంవత్సరాల childrenపై సర్వే చేశారు. ఇందుకు పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి సమాధానాలు తీసుకున్నారు. ది లాన్సెట్ పత్రికా ప్రకటన ప్రకారం.. కరోనా సోకని 33,000 మంది పిల్లలతో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన 11,000 మంది పిల్లల హెల్త్ రికార్డులను పరిశోధకులు పోల్చి చూశారు. ఈ సర్వేలో సుమారు 23 వరకు లాంగ్ కోవిడ్ లక్షణాల గురించి పిల్లల ఆరా తీశారు. రెండు నెలల కంటే ఎక్కువ కాలం ఉండే లక్షణాలను లాంగ్ కోవిడ్ లక్షణాలుగా నిర్ధారించారు.

0-3 సంవత్సరాల పిల్లలలో మానసిక సమస్యలు, దద్దుర్లు, కడుపు నొప్పి వంటివి లాంగ్ covid లక్షణాలుగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. 4- 11 సంవత్సరాలు ఉన్నవారిలో మానసిక సమస్యలు, మతిమరుపు, ఏకాగ్రత లోపాలు, దద్దుర్లు వంటి లక్షణాలను గుర్తించారు. 12-14 సంవత్సరాల వారిలో అలసట, మూడ్ స్వింగ్స్, మతిమరుపు, ఏకాగ్రత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అన్ని వయసులవారిలో రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కనీసం ఒక లక్షణం బయటపడే అవకాశం ఉందని అధ్యయన ఫలితాలు కనుగొన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Children, Corona, Covid, Covid positive

తదుపరి వార్తలు