హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Father's Day 2020 | ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మాగాంధీ... రెండు జ్ఞాపకాలు..

Father's Day 2020 | ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మాగాంధీ... రెండు జ్ఞాపకాలు..

Fathers Day 2020 | ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఓ తండ్రిగా మహాత్మాగాంధీ అనుభవం, అలాగే, తన తండ్రి కరమ్‌చంద్‌ ఉత్తమ్‌చంద్‌ గాంధీతో రెండు జ్ఞాపకాలను తెలుసుకుందాం.

Fathers Day 2020 | ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఓ తండ్రిగా మహాత్మాగాంధీ అనుభవం, అలాగే, తన తండ్రి కరమ్‌చంద్‌ ఉత్తమ్‌చంద్‌ గాంధీతో రెండు జ్ఞాపకాలను తెలుసుకుందాం.

Fathers Day 2020 | ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఓ తండ్రిగా మహాత్మాగాంధీ అనుభవం, అలాగే, తన తండ్రి కరమ్‌చంద్‌ ఉత్తమ్‌చంద్‌ గాంధీతో రెండు జ్ఞాపకాలను తెలుసుకుందాం.

  మహాత్మాగాంధీ. ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఓ తండ్రిగా మహాత్మాగాంధీ అనుభవం, అలాగే, తన తండ్రి కరమ్‌చంద్‌ ఉత్తమ్‌చంద్‌ గాంధీతో రెండు జ్ఞాపకాలను తెలుసుకుందాం. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ తండ్రి కరమ్‌చంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ. ఆయన పుస్తకాలు పెద్దగా చదువుకోకపోయినా ప్రపంచాన్ని చదివారు. లోకజ్ఞానం తెలిసిన వ్యక్తి. మంచి పరిపాలన దక్షుడు. గాంధీ తాత ఉత్తమ్ చంద్ లాగానే తండ్రి కరమ్‌చంద్ కూడా కోర్ట్ అధికారి అయ్యారు. అంటే, పోరుబందర్ రాజు వద్ద ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశారు. ప్రభుత్వ అధికారుల నియామకాలు, ఇతర అంశాల్లో ఆయన రాజుకు సలహాలు ఇచ్చేవారు. 1885లో కరమ్‌చంద్‌కు ఫిస్టులా వచ్చింది. రోజురోజుకు ఆరోగ్యం మరింత దిగజారింది. తన తండ్రి చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగిందో మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ తన అనుభవాన్ని ఓ సారి పంచుకున్నారు.

  ఆ రోజు రాత్రి గాంధీ వాళ్ల బాబాయి తులసీదాస్ ఇంటికి వచ్చారు. తండ్రి పరిస్థితి ఇప్పుడో, అప్పుడో అన్నట్టుగా ఉంది. కానీ, దాన్ని అంగీకరించడానికి కుటుంబంలో ఎవరూ సిద్ధంగా లేరు. రాత్రి సమయం సుమారు 10.30 నుంచి 11 మధ్య. 16 ఏళ్ల మోహన్ దాస్ గాంధీ తన తండ్రి భుజాలు ఒత్తుతున్నాడు. బాబాయి తులసీదాస్ వచ్చి అతడిని లోపలికి వెళ్లాలని చెప్పాడు. వెంటనే గాంధీ లోనికి వెళ్లారు. ఇంట్లో తన భార్య కస్తూర్భా నిద్రపోతోంది. అలా లోపలికి వెళ్లి కొన్ని క్షణాలు గడిచాయో లేదో.. పనిమనిషి గాంధీ వద్దకు వచ్చి ‘నాన్నగారి పరిస్థితి విషమంగా ఉంది.’ అని చెప్పాడు. అప్పటికే ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ‘విషమం’ అనే దానికి అర్థం కూడా అర్థమైంది. తండ్రి చనిపోయాడు. ఇలా తండ్రి చివరి క్షణాల వరకు గాంధీ అక్కడే ఉన్నాడు.

  ఇక తన పిల్లలతో గాంధీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సత్యం, అహింస అనే దాన్ని తన జీవితంలో కూడా పాటించారు. ఆ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేవారో చెప్పడానికి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ లేఖ సాక్ష్యం. గాంధీ తన కుమారుడు హరిలాల్ గాంధీ గురించి రాసిన లేఖ. ఇటీవల ఆ లేఖ ఇంగ్లండ్‌లో ముల్లాక్‌ ఆక్షన్ హౌస్ వేలానికి పెట్టింది. అందులో కుమారుడు హరిలాల్ మీద గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిలాల్ చేసిన అసభ్యకర ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టినట్టు ఉందని ఆక్షన్ హౌస్ తెలిపింది. ‘నాకు నిజం చెప్పు. ఇంకా నువ్వు మద్యం తాగుతున్నావా? ఏదో ఒక రకంగా మద్యం తాగే కంటే చావడం నయం.’ అని గుజరాతీలో రాసి ఉన్న ఆ లేఖ వేలానికి వచ్చింది.

  First published:

  Tags: Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day

  ఉత్తమ కథలు