(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18)
పార్టీలు ఏవైనా కావచ్చు. ఎప్పుడు ఏ పార్టీ గాలైనా వీయోచ్చు. కానీ అక్కడ మాత్రం ఆ ఫ్యామీలిదే విజయం. ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఆ కుటుంబం నుంచి కాకుండా వేరే వాళ్లు గెలిచిన దాఖలాలు లేవు. అంతంటి ప్రజాభిమానం ఆ వ్యక్తి సొంతం. పార్టీలోనూ అటూ ఢీల్లీలోనూ కీలకంగానూ ఉండేవారాయన. ఆయనే ఎర్రన్నాయుడు. ఆ కుటుంబం నుంచి వచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రిని మించిన నేతగా ఎదగడానికి తండ్రి సహాకారం ఎలా లభించింది. రామ్మోహాన్ నాయుడుకి తన తండ్రి ఎర్రన్నాయుడుతో ఉన్న అనుబంధం ఎలాంటింది.
ఎర్రన్నాయుడు అకాల మరణంతో అనుకోకుండా రాజకీయల్లోకి ప్రవేశించారు రామ్మోహన్ నాయుడు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొంది మరోసారి తమ కుటుంబానికి ఆ ప్రాంతంలో తిరుగులేదని నిరూపించారు రామ్మోహన్ నాయుడు. అదే సంవత్సరం పార్లమెంట్ లో తన స్పీచ్ తో దేశావ్యాప్తంగా ఉన్న రాజకీయపార్టీలను నేతలను ఆకట్టుకున్నారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని మోదీని ప్రశ్నించిన తీరు అప్పట్లో చాలా సంచలనం అయింది. ఇదిలాంటే ఇంతటి రాజకీయ నేతగా తాను తయారవడానికి తన తండ్రితోపాటు తన చినాన్న అచ్చెన్నాయుడు కారణం అంటారు రామ్మోహన్ నాయుడు.
రాజకీయల్లోకి వస్తానని అనుకోలేదు....
నాన్న గారు ఉన్న రోజులన్నీ మాకు రాజకీయాలతో సంబంధం లేకండా పెంచారు. ఉన్నత చదువుల కోసం నన్ను అమెరికా పంపించారు. అక్కడ చదువు కంప్లీట్ అయిన తరువాత అక్కడే నేను చిన్న ఉద్యోగం చేసేవాడిని. ఎంపీగా ఉన్న సమయంలో కూడా మాకు మా నాన్న ఎంపీ అనే గర్వం ఎక్కడా లేకుండా పెంచారు మా నాన్న. అక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత నేను ఢిల్లీ వచ్చా. అక్కడున్న సమయంలో నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారని వార్త వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. అప్పటి వరకు మా నాన్నకు చావు లేదని అనుకున్నాను. ఎందుకంటే ఆ మనిషి అలా ఉండేవారు. నాన్న మరణ వార్తే మా జీవితాలకు ముగింపు అనుకున్నాను. కానీ నాన్న ప్రజలకు చేసిన మంచి పనులే ఇప్పుడు మా కు శ్రీరామరక్షగా ఉన్నాయి. అవే కాపాడుతున్నాయి. నాన్న లేని లోటును తీర్చుతున్నాయి.
నాకు, మా అక్కకు నాన్న గీసిన రేఖ అదే...
మేము చదువుకునే రోజుల్లో ఏ చిన్న తప్పు చేయాలన్నా మాకు చాలా భయం. ఎందుకంటే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఆ భయం అనే రేఖే ఈ రోజు మా ఇద్దర్ని ఉన్నతస్థానంలో ఉంచింది. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా నాకు అదే భయం వెంటాడింది. మేము పెద్దయ్యే కొద్దీ ఆ భయం కాస్తా గౌరవంగా మారింది. ఆ రోజు నాన్న భయాన్ని నింపబట్టే ఈ రోజు ఎంపీగా ఒక చిన్న తప్పు కూడా చేయకుండా ప్రజలకు సేవ చేస్తున్నాను.
2019 లోనూ గెలుపొందానంటే నాన్నే కారణం
2019 ఎన్నికల్లో జగన్ హవాలో కూడా నాకు ప్రజలు పట్టం కట్టారు. దానికి కారణం నేను ఎర్రన్నాయుడు కొడుకు అనే దాంతో పాటు మా పార్టీ అధినేత పై ఉన్న నమ్మకం. ఇంత మంది ప్రజల మధ్య ఉన్నప్పుడు నాన్న లేరు అనే లోటు మాకు తెలియటం లేదు.
ఏ టైం కి ఇంటికి వచ్చినా మా దగ్గరకు వచ్చేవారు
రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉన్నప్పుడు ఏ టైం కి ఇంటికి వచ్చిన వాళ్లు తిన్నారా? చదువుకున్నారా? అనే విషయాలు మా అమ్మను అడగకుండా నిద్రపోయేవారు కాదు. అప్పుడప్పుడు తనకు సమయం దొరికినప్పుడు మాతోనే సమయం గడిపేవారు. ముఖ్యంగా మా చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునేవారు. ఆయనకు మమ్మల్ని పెద్ద చదువులు చదివించాలని కోరిక అందుకే నన్ను అమెరికా కూడా పంపించారు.
చదువు అయిపోయాక జాబ్ చేయమన్నారు
ఒక ఎంపీ కొడుకు అంటే అందరూ ఏం అనుకుంటారు సొంత వ్యాపారాలు, తాను ఒకరి దగ్గర జాబ్ చేయడం ఏంటని అనుకుంటారు. కానీ మా నాన్న మాత్రం అలా చేయలేదు. అమెరికాలో నా చదువు అయిపోయిన తరువాత నాకు ఫోన్ చేసి ఎదైనా జాబ్ చూసుకో అన్నారు. సింగపూర్ లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో నాకు జాబ్ వచ్చినప్పుడు నాన్నకు చెప్పాను. అప్పుడు అక్కడ కు వెళ్లడానికి ఏర్పాటు చేశారు. దాదాపు ఏడాదిపాటు అక్కడ జాబ్ చేశాను.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day, Rammohan naidu, Tdp