హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Father’s Day 2020: ఫాదర్స్ డే చరిత్ర ఏంటీ? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు?

Father’s Day 2020: ఫాదర్స్ డే చరిత్ర ఏంటీ? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు?

Father’s Day 2020: ఫాదర్స్ డే చరిత్ర ఏంటీ? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు?
(ప్రతీకాత్మక చిత్రం)

Father’s Day 2020: ఫాదర్స్ డే చరిత్ర ఏంటీ? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? (ప్రతీకాత్మక చిత్రం)

Fathers Day 2020 | జూన్ 21న ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రపంచం సిద్ధమవుతోంది. అసలు పితృదినోత్సవం ఎందుకు జరుపుకొంటున్నారు? తెలుసుకోండి.

  నాన్న... పిల్లల్ని నవమాసాలు మోసేది తల్లి అయితే జీవితాంతం తన గుండెలపై మోసేవాడు తండ్రి అని అంటారు. అయినా ఈ సమాజంలో తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి ఉండదని, కవిత్వాల నుంచి సినిమాల వరకు తల్లుల్ని కీర్తించినంతగా తండ్రుల పాత్రను గుర్తించరన్న వాదన ఎప్పట్నుంచో ఉంది. నాన్నల్ని, వారి త్యాగాలను గుర్చించడానికి ఓ రోజు ఉంది. అదే ఫాదర్స్ డే. అంటే పితృ దినోత్సవం. ప్రతీ ఏటా మాతృ దినోత్సవం జరుపుకొన్నట్టే తండ్రుల కోసం ప్రత్యేకంగా ఓ రోజును సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబంలో, సమాజంలో తండ్రి పాత్రను గుర్తించేందుకు ప్రతీ సంవత్సరం జూన్ మాసంలో మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి జూన్ 21న ఫాదర్స్ డే వస్తోంది. మరి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ ఎలా మొదలైందో తెలుసుకోండి.

  ఫాదర్స్ డేను మొదటిసారిగా అమెరికాలో సెలబ్రేట్ చేశారు. 1910 జూన్ మూడో ఆదివారం నాడు వాషింగ్టన్ వైఎంసీఏలోని స్పోకేన్‌లో సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. అప్పుడు జూన్ 19న ఫాదర్స్ డే వచ్చింది. అయితే అప్పటికే ఏటేటా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనోరా స్మార్ట్ డాడ్ తండ్రులకు కూడా ఓ రోజు ఉండాలని భావించారామె. సోనోరా తండ్రి పేరు విల్లియం జాక్సన్ స్మార్ట్. ఆరుగురు పిల్లలకు తండ్రి. కష్టపడి ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తన తండ్రి కష్టాలను, బాధ్యతల్ని దగ్గర్నుంచి చూసిన సోనోరా ఫాదర్స్ డే ఉండాల్సిందే అనుకున్నారు. ఈ విషయాన్ని చర్చ్ పాస్టర్‌తో చర్చించారు. తన తండ్రి పుట్టిన రోజు అయిన జూన్ 5న ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. కానీ చర్చి వేళలు కలిసిరాకపోవడంతో ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారానికి వాయిదా పడింది. అలా ప్రతీ ఏడాది జూన్ 3వ ఆదివారం పితృ దినోత్సవం జరుపుకొనే ఆనవాయితీ అమెరికాలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఇదే రోజున పితృ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కొన్నేళ్లుగా భారతదేశంలో కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు.

  ఇవి కూడా చదవండి:

  Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్

  PAN Card: ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కార్డు... తీసుకోండి ఇలా

  Business Idea: మహిళలకు గొప్ప అవకాశం... రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day

  ఉత్తమ కథలు