హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Father's Day 2020 | ఇందిరాగాంధీకి జైలు నుంచి ‘పాఠాలు’ నేర్పిన నెహ్రూ..

Father's Day 2020 | ఇందిరాగాంధీకి జైలు నుంచి ‘పాఠాలు’ నేర్పిన నెహ్రూ..

జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ

జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ

Fathers Day 2020 | జవహర్ లాల్ నెహ్రూ జైలు నుంచి పదేళ్ల కుమార్తె ఇందిరకు రాసిన లేఖలు చాలా ప్రాముఖ్యత పొందాయి.

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకోబోతున్నాం. ఈ డిజిటల్ యుగంలో ట్రెండీ ఫాదర్స్, ట్రెండ్‌ను ఫాలో అయ్యే పిల్లలు కొత్త కొత్తగా ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. తండ్రులు పిల్లలకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా? అని ఆలోచిస్తారు. అలాగే పిల్లలకు కూడా తమ తండ్రికి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఇంటర్నెట్‌లో వెతుకుతూ ఉంటారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినిక ఇచ్చిన అద్భుతమైన బహుమానం ఏంటంటే లేఖలు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఆయన జైలు జీవితం అనుభవించినప్పుడు మాంటిస్సోరీలో చదువుకుంటున్న తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి నెహ్రూ రాసిన లేఖలు చాలా పాపులర్ అయ్యాయి. ‘లెటర్స్ ఫ్రమ్ ఫాదర్ టు హిస్ డాటర్’ అనే పేరుతో ఆ లేఖలు అన్నిటినీ కలిపి ముద్రించారు. ఆ లేఖలు 1929లో అలహాబాద్ లా జర్నల్ ప్రెస్ ముద్రించింది. నెహ్రూ కోరిక మేరకు వాటిని ముద్రించారు. 1928 వేసవి కాలంలో జైల్లో ఉన్న నెహ్రూ పదేళ్ల తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి రాసిన 30 లేఖలను అచ్చు చేశారు. ఆ తర్వాత లభించిన లేఖలను కూడా జోడించి పలుమార్లు పునః ముద్రణ చేశారు.

‘చిరంజీవి ఇందిరకు’ అనే పేరుతో ఈ లేఖలను తెలుగీకరించారు కాటూరి వెంకటేశ్వరరావు. ఈ లేఖల్లో భూమి, సూర్యుడు, మానవులు, జీవకోటి ఆవిర్భావం గురించి ప్రస్తావించారు. సూర్యగోళం నుండి వేరుపడిన భూమి సెగలూ పొగలూ కక్కుతూ కొంత కాలానికి చల్లబడిందనీ, భూమి నుంచి ఊడిన ఓ ముక్క చంద్రుడైందనీ అన్నారు. జీవుల ఆవిర్భావం గురించి మాట్లాడుతూ భూమండలం చల్లబడ్డాక మొదట సామాన్య జలచరాలూ, తరువాత జలజంతువులూ అనంతరం నేలమీద తిరిగే జంతువులూ ఆవిర్భ వించాయి. అన్ని జంతువుల్లాగే కోతులు కూడా పరిసరాలకు తగినట్టు మారిపోవడంలో ఉత్తమజాతి వానరం ఆవిర్భవించిందనీ అదే నరుడికి మూలం అనీ డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పి నిదర్శనంగా జర్మనీ లోని హీడెల్బర్గ్‌లో ఇందిర చూసిన ఆదిమకాలపు నరుని పుర్రెగురించి ప్రస్తావించారు.

జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ

మన దేశంలో నదులను దేవతామూర్తులుగానూ, పవిత్రమైనవిగానూ చూడటం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరిస్తూ ‘ఆహారం కోసం వ్యవసాయం చెయ్యాలి. అందుకు నీరు సమృద్ధిగా ఉండాలి. తిండీ నీరూ ఇస్తాయి కాబట్టి ప్రజలు పూర్వం నదీతీరాలలో నివసిస్తూ నదులను భక్తితో పూజించేవారు. ఈజిప్టు వాసులు నైలు నదిని తండ్రిగా ఎంచు కుంటారు. మన దేశంలో గంగను తల్లిగా ఎంచుకుని ‘గంగా మాతాకీ జై’ అంటూ పూజిస్తారని తెలిపారు.

ఇందిరకు నెహ్రూ రాసిన లేఖలు (తెలుగులో చిరంజీవి ఇందిరకు అనే పేరుతో ముద్రించారు)

ఇప్పుడు మనం వాడుతున్న 1 2 3 4 అనే అంకెల్ని యూరప్‌ ప్రజలు అరేబియా నుంచి నేర్చుకోవడం వల్ల వాటికి అరబిక్‌ అంకెలు అనే పేరు వచ్చిందంటారు కాని నిజానికి అర బ్బులు ఇండియా నుండే నేర్చుకున్నారని తెలిపారు. ఇలా సామాన్య శాస్త్రం, చరిత్ర, నమ్మకాల వెనుక ఉన్న వాస్తవాలను విశ్లేషించి తన కుమార్తెకు అర్థమయ్యేలా చెప్పారు. ప్రతి తల్లిదండ్రులూ వీటిని తప్పక చదవాలని అంటారు.

First published:

Tags: Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day, Indira Gandhi