హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Father's Day 2020 | మా నాన్నలోని నిబద్ధతే నాకు స్ఫూర్తి.. అవినాష్ మహంతి...

Father's Day 2020 | మా నాన్నలోని నిబద్ధతే నాకు స్ఫూర్తి.. అవినాష్ మహంతి...

తండ్రి ఏకే మహంతితో అవినాష్ మహంతి

తండ్రి ఏకే మహంతితో అవినాష్ మహంతి

రోజు వారి వృత్తిపరమైన వ్యవహారాలు నాన్నతో అప్పుడప్పుడు చర్చిస్తాను. ఆయన పని తీరు చాలా స్టాండర్ట్ గా ఉంటుంది. అలాగే సలహాలిస్తారు కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ కారు.

అజిత్ కుమార్ మహంతి... నిజాయితీ గల నిక్కచ్చైన అధికారిగా పేరు. దేనికీ లొంగకుండా.. దేనికి జంకకుండా చట్టం, న్యాయం మాత్రమే రెండు కళ్లుగా చేసుకొని ముందుకు సాగిన అధికారి. ఐపీఎస్ అధికారిగా సాగిన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. వాటన్నింటికి వెరవకుండా విధి నిర్వహణే విద్యుక్త ధర్మంగా భావించిన అధికారి ఏకే మహంతి. హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పని చేశారు, ఆయన కుమారుడే ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ లో ఓ విభాగైన సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రికి తగిన తనయునిగా పేరు తెచ్చుకున్న అవినాష్ విధి నిర్వహణలో దేనికి వెనుకడుగు వేయరు. తన తండ్రి ఏకే మహంతి తనను ఏ మేరుకు ప్రభావితం చేశారు అవినాష్ మాటల్లోనే...

భార్య, ఇద్దరు కుమారులు అవినాష్, అభిషేక్ మహంతిలతో ఏకేే మహంతి

అందరిలాగే మా నాన్న ప్రభావం నాపైన కూడా ఉంది. చిన్ననాటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నా వృత్తిలో కూడా ఆయన ప్రభావం ఉంది. వ్యక్తిగత జీవితంలో... వృత్తిపరంగా ప్రత్యంక్షంగానో పరోక్షంగానో మా నాన్న ప్రభావితం చేస్తూనే ఉంటారు. పిల్లలందరూ దాదాపుగా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. తెలియకుండానే వాళ్లలాగ ఉండాలని చూస్తారు. బహుశా నేనూ అంతేనేమో. నువ్వే పని చేసినా మనసా వాచా కర్మణా చేయమని చెబుతారు. ఏదైనా సరైందనిపిస్తేనే చేయమని చెప్పేవారు. చట్ట ప్రకారం సరైంది కాదనిపిస్తే నిర్దాక్షిణ్యంగా చేయొద్దని చెబుతారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని చెబుతారు. ఓ అశంపై విభిన్నమైన వారితో చర్చించినప్పుడు విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. వాటిని విశ్లేషించి ఏది సరైందో అది చేయమంటారు.

పోలీసు శాఖ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ మహంతి

నేను తొలుత ఐపీఎస్ అధికారి కాకముందు రైల్వేలో పని చేశాను. అదరు మీ ఫాదర్ ను చూశారు కాబట్టి పోలీసు అధికారి అయ్యారని అంటారు. నిజమే... చిన్నప్పట్నుంచి ఆయన్ను చూస్తూ పెరిగాను కాబట్టి కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. అలాగే కెరియర్ ఆప్షన్ వచ్చినప్పుడు ఆయన ప్రభావమే నాపై పని చేసి ఉంటుదనుకుంటాను. పోలీసు అధికారి ఉద్యోగం మంచి ఉద్యోగం.. చాలా రెస్పెక్ట్ ఉండే జాబ్... ప్రజలకు ఏదైనా మంచి చేసేందుకు ఇక్కడ చాలా స్కోప్ ఉంటుంది. పోలీసు యూనిఫాం వేసుకోవడంలో ఓ ప్రైడ్ ఉంటుంది. పోలీసు ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసే ఉద్యోగం ఇది.

షీటీమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నటి లావణ్య త్రిపాఠితో అవినాష్ మహంతి

నాకు ఐపీఎస్ అధికారి కావాలని ఎవరూ చెప్పలేదు. పోలీసు కావాలని చిన్నప్పట్నుంచి షేప్ అప్ చేయలేదు. కానీ మా నాన్న చేస్తున్న పనిలో చాలా సంతృప్తిగా గర్వంగా కనిపించే వారు. అయన ఏ ఒక్క రోజు కూడా పోలీసు డిపార్ట్ మెంట్ గురించి తప్పుగా కానీ... కనీసం విమర్శించడం కానీ చేయలేదు. అలాంటి వాళ్లను చూస్తే కచ్చితంగా మనం అట్రాక్ట్ అవుతాం కదా. అలాగే నేను కూడా. నేను ఐపీఎస్ అధికారి కాక ముందు పోలీసు ఉద్యోగం ఎలా ఉంటుదో మా నాన్న చెబుతుండేవారు. వందకు వంద శాతం అలాగే ఉంది. పోలీసు డిపార్ట్ మెంట్ లో మంచి వర్క్ కల్చర్ ఉంటుంది. దానికి మనం ఎంత కంట్రిబ్యూట్ చేయగలరనేది ముఖ్యం.

మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మీలాంటి వాళ్లంటుంటారు. స్ట్రిక్ట్‌గా ఉంటే చాలా ఇబ్బందులు అంటారు. కానీ ఆయన ఇబ్బందులు పడటం నేనెప్పుడు చూడలేదు. తాను నమ్మిన దాని కోసం పని చేస్తూ ముందుకు సాగారు. నేనూ అంతే. ఆయనలో ఒక్క లక్షణాన్ని చూసి ఇస్పైర్ కావడం కాదు.. ఆయన లైఫే నాకు ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. పని పట్ల ఆయనకున్న నిబద్ధత చూస్తే ముచ్చటేస్తుంది. నేను ఏదైనా పొరపాటు చేస్తే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాను. నా స్థానంలో మా నాన్న ఉంటే ఎలా ఆలోచిస్తారని అనుకుంటాను. ఆయనలాగ ఆలోచించి నాకు నేను సరి చేసుకుంటాను. అలా చేయడం నాకు చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

రోజు వారి వృత్తిపరమైన వ్యవహారాలు నాన్నతో అప్పుడప్పుడు చర్చిస్తాను. ఆయన పని తీరు చాలా స్టాండర్ట్ గా ఉంటుంది. అలాగే సలహాలిస్తారు కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ కారు. ఏది చేసిన మంచి చేయమంటారు. ఆయన అలాగే చేసేవారు. ఒక సమస్యకు ఒకే పరిష్కారం అంతే. అందుకేనేమో ఆయన లైఫ్ లో కాంప్లికేషన్స్ చాలా తక్కువ. వివిధ విభాగాల్లో పోలీసింగ్ వివిధ రకాలుగా ఉంటుంది. డిపార్ట్ మెంట్ లో చాలా శాఖలున్నాయి. దానికి అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. ఏది చేసినా బాగా పని చేస్తూ పోతే మంచి ఫలితాలు వస్తాయి. మా నాన్న కూడా అలాగే ఉండేవారు. మా తమ్ముడు అభిషేక్ మహంతి కూడా ఆంధ్రప్రదేశ్ కాడర్ ఐపీఎస్ అధికారి. ఆయనకు కూడా మా నాన్నతో దాదాపుగా అలాంటి అనుభవాలే ఉంటాయి. ఒకే ఇంట్లో పెరిగాం కదా.

First published:

Tags: Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day

ఉత్తమ కథలు