హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Father's Day 2020 | ప్రేమ‌తో నాన్న... కుమార్తెలపై జ‌గ‌న్ ప్రేమకు సాక్ష్యాలు...

Father's Day 2020 | ప్రేమ‌తో నాన్న... కుమార్తెలపై జ‌గ‌న్ ప్రేమకు సాక్ష్యాలు...

వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో కేవలం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోగల నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన అన్నారు.

వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో కేవలం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోగల నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన అన్నారు.

Fathers Day 2020 | ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తెల అనుబంధంపై స్పెషల్ స్టోరీ.

  (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

  ఒక మ‌హానేత‌కు కొడుకు. ఇద్ద‌రు కుమార్తెలకు తండ్రి. రాజకీయ శ‌త్రువుల‌తో తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటం త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీకి రాని మెజార్టీ తో ఆంధ్రప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రి అయ్యారు. అయితే ఈ రోజు మ‌నం జ‌గ‌న్ మోహాన్ రెడ్డి రాజకీయ విష‌యాలు గురించి మాట్లాడుకోవ‌డం లేదు. ఒక తండ్రిగా జ‌గ‌న్ పోషిస్తోన్న పాత్ర ఎంటి? త‌న ఇద్ద‌రు కుమార్తెలకు ఎలా స‌మ‌యం కేటాయిస్తారు? ఫాదర్స్ డే సంద‌ర్బంగా తెలుసుకుందాం.

  వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి రాజ‌కీయ ప్రస్థానం గురించి అంద‌రికీ తెలిసిందే. కానీ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాత్రం చాలా కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. ముఖ్యంగా తాను త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఎలా ఉంటారు? ఎంత స‌మ‌యం కేటాయిస్తార‌నేది బ‌హుశా ఎవ‌రికీ పెద్ద‌గా తెలియదు. వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ఇద్ద‌రు కూతుళ్లు. పెద్దమ్మాయి హ‌ర్షిణి లండ‌న్ లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చ‌దువుతున్నారు. రెండో కుమార్తె వ‌ర్షిణి అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారు. జ‌గ‌న్ కు ఈ ఇద్ద‌రు కూతుళ్లు అంటే చాలా ప్రాణం. తొమ్మిదేళ్ల పాటు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు త‌న రాజ‌కీయ శత్ర‌వుల‌తో పోరాటం చేస్తోన్న‌ప్పుడు కూడా వీళ్ల‌కు కావాల్సిన స‌మ‌యాన్ని కేటాయించేవారు. రోజు జ‌రిగే రాజ‌కీయ ప‌రిణామాల‌కి త‌న పిల్ల‌లు కృంగిపోకుండా ధైర్య‌ాన్ని నింపారు. ఉన్న‌త చదువుల రీత్యా ఇద్ద‌రు పిల్ల‌లు విదేశాల్లో ఉన్నా ప్రతిరోజు వారిని ప‌ల‌క‌రించ‌డ‌కుండా అడుగు కూడా బ‌య‌ట‌పెట్ట‌రు. త‌ల్లి భార‌తితో ఉన్న సాన్నిహిత్యం కంటే తండ్రి జ‌గ‌న్ తోనే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు చనువు ఎక్కువ అని చెబుతారు జ‌గ‌న్ మోహన్ రెడ్డి కుటుంబానికి ద‌గ్గ‌రగా ఉన్న‌వాళ్లు. 16 నెల‌లు జ‌గ‌న్ జైల్లో ఉన్నప్పుడు కూడా త‌మదైన శైలిలో తండ్రిపై త‌మ ప్రేమ ను చూపించారు ఇద్ద‌రు కూతుర్లు.

  వైఎస్ జగన్ సతీమణి భారతి, ఇద్దరు కుమార్తెలు హర్షిణి, వర్షిణి

  జ‌గ‌న్ 16 నెల‌ల పాటు జైల్లో ఉన్న సమ‌యంలో కూడా కూతుర్ల‌కు ఉత్త‌రాల‌తో ద‌గ్గ‌ర‌గా ఉన్నారు జ‌గ‌న్. మూడు రోజుల ఒక‌సారి కూతుళ్లకు ఉత్త‌రాలు రాసేవారు. వారు కూడా త‌మ తండ్రి యోగ క్షేమాలు తెలుసుకునేవారు. ప్ర‌తి ఉత్త‌రంలో త‌మ పిల్ల‌ల్లో మ‌నోధైర్య‌న్ని నింపే మాట‌లే జ‌గ‌న్ రాసేవారు. ఇలా దాదాపు 16 నెల‌ల పాటు ఉత్త‌రాల్లోనే జ‌గ‌న్ త‌న పిల్ల‌ల‌తో మాట్లాడేవారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ తండ్రిపై వేస్తోన్న ముద్ర‌లు.. త‌మ తండ్రి పడుతున్న ఇబ్బందులు చూసి త‌ట్టుకొని జ‌గ‌న్‌కు అండగా నిల‌బ‌డ్డ‌ారంటే అది ఆయ‌న నేర్పిన ధైర్య‌మే అంటారు పార్టీ నేత‌లు.

  ఇద్దరు కుమార్తెలతో వైఎస్ జగన్

  జ‌గ‌న్ బంగీ జంప్ చేయ‌డానికి కార‌ణం ఇదే...

  2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ చేసిన బంగీ జంప్ రాజకీయ వ‌ర్గాల్లోనే కాక అంద‌ర్నిల్లో ఆస‌క్తిని రేకేత్తించింది. అస‌లు జ‌గ‌న్ బంగీ జంప్ చేయ‌డం వెనుక ఒక పెద్ద క‌థ ఉంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర ముగిసిన త‌రువాత త‌న తండ్రిని చూడాల‌ని జ‌గ‌న్ పెద్ద కుమార్తె హ‌ర్షిణి మారం చేస్తే కుటుంబంతోపాటు లండ‌న్ వెళ్లారు జ‌గ‌న్. దాదాపు వారం రోజుల పాటు అక్క‌డ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తోపాటు గ‌డిపారు. ఆ సంద‌ర్భంలో జ‌గ‌న్ పెద్ద‌మ్మాయి హ‌ర్షిణి బంగీ జంప్ చేయ‌డానికి భ‌య‌ప‌డిన సంద‌ర్భంలో తాను బంగీ జంప్ చేసి త‌న కూతురు భ‌య‌న్ని పోగొట్టారు జ‌గ‌న్. ఇలా త‌న పిల్ల‌ల్లో ధైర్య‌న్ని నింప‌డంలో కీల‌క పాత్ర పోషించారు జ‌గ‌న్.

  వైఎస్ జగన్ బంగీ జంప్

  రాత్రి తొమ్మిది త‌రువాత పిల్ల‌లుతో మాట్లాడాల్సిందే...

  పాద‌యాత్ర స‌మ‌యంలోనూ, ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా కూడా ప్ర‌తి రోజు రాత్రి తొమ్మిది దాటితే జ‌గ‌న్ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తోనూ ప్ర‌తిరోజు మాట్లాడ‌తారు. రాజ‌కీయ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌తో ఎంత బిజీగా ఉన్న పిల్ల‌ల‌కు తాను ద‌గ్గ‌ర లేని లోటు లేకుండా చూసుకుంటారు జ‌గ‌న్ మోహన్ రెడ్డి.

  వైఎస్ జగన్ సతీమణి భారతి, ఇద్దరు కుమార్తెలు హర్షిణి, వర్షిణి

  ముఖ్య‌మంత్రిగా కూడా పిల్ల‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లిన జ‌గ‌న్...

  2019 ఎన్నిక‌ల త‌రువాత అఖండ మెజార్జీ వ‌చ్చిన త‌రువాత ఇక్క‌డ పార్టీ కేడ‌ర్ తో సెల‌బ్రేట్ చేసుకున్న త‌రువాత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఈ ఆనందాన్ని పంచుకోవ‌డానికి లండ‌న్ వెళ్లారు. దాదాపు 5 రోజుల‌పాటు అక్క‌డ ఉండి త‌న కూతురు అడ్మిష‌న్ వ్య‌హారాల‌తోపాటు విజ‌యాందాన్ని కూడా అక్క‌డ తాను ప్రాణంగా చూసుకొనే పిల్ల‌ల‌తో జ‌రుపుకున్న‌ారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Fathers Day 2020

  ఉత్తమ కథలు