Health Tips: వెన్నునొప్పిని తగ్గించే ఆముదం

ఆఫీసుల్లో గంటలు గంటలు కూర్చొనే వారు తరచూ వెన్నునొప్పి సమస్య ఎదుర్కొంటారు. అలాంటి వారు.. రిలీఫ్ పొందడానికి కొన్ని చిట్కాలు చూడండి..

Amala Ravula | news18-telugu
Updated: May 12, 2019, 10:23 AM IST
Health Tips: వెన్నునొప్పిని తగ్గించే ఆముదం
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 12, 2019, 10:23 AM IST
శారీరక సమస్యతగ్గింది.. స్మార్ట్ వర్క్ పెరిగింది. ఇది మనకూ మంచిదే. కానీ, దీనివల్ల అనర్థాలు కూడా ఉంటాయి. అదేంటంటే.. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం, కూర్చొని డ్రైవింగ్ చేయడం, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం వల్ల చాలామంది వెన్నునొప్పి సమస్య ఎదుర్కొంటారు. ఇలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల నొప్పికి చెక్ పెట్టొచ్చు.

ఆముదం.. జిడ్డుగా ఉండే నూనె.. సౌందర్యపోషణలో కీలకపాత్రని పోషిస్తుంది. అంతేనా.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆముదాన్ని వేడి చేసి వెన్నునొప్పి ఎక్కడుందో అక్కడ రాసి మసాజ్ చేస్తుండాలి. ఇలా తరచూ చేయడం వల్ల నొప్పి సమస్య చాలావరకూ తగ్గుతుంది.


దీంతో పాటు.. వెల్లుల్లిపాయలను నువ్వులనూనెలో వేసి బాగా మరిగించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే రాయడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. దీంతో పాటు.. మునగాకు రసం, పాలు సమపాళ్లుగా తీసుకోవడం వల్ల కూడా వెన్ను నొప్పిని దూరం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అధికబరువు ఉంటే తగ్గాలి.

అయితే, కేవలం మందులు తీసుకోవడం, చిట్కాలు వాడడమే కాదు.. సాధ్యమైనంతవరకూ ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అప్పుడే వెన్నునొప్పినుంచి పూర్తి ఉపశమనం పొందుతారు.
First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...