Home /News /life-style /

Black peppers adulteration test: మిరియాల కల్తీని ఈ సింపుల్‌ చిట్కాతో గుర్తించండి!

Black peppers adulteration test: మిరియాల కల్తీని ఈ సింపుల్‌ చిట్కాతో గుర్తించండి!

ఈ టెస్ట్‌తో కల్తీ మిరియాలను గుర్తించండి

ఈ టెస్ట్‌తో కల్తీ మిరియాలను గుర్తించండి

Black peppers adulteration: భారతీయ సుగంధ ద్రవ్యాలు, మసాలా దినిసులు వాటి రుచి వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ప్రసిద్ధి చెందినవి. ఈ పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందాయి.

కొన్ని రోజులు వివిధ ఆహార పదార్థాలపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ ఆఫ్‌ ఇండియా (FASSAI) పరీక్షలు నిర్వహిస్తూ... ప్రజలను అలెర్ట్‌ చేస్తోంది. ఈ పరీక్షల ఆధారంగా కల్తీ ఫుడ్‌ (adulterated food) ను ఒరిజినల్‌ ఆహార పదార్థాలను సులభంగా గుర్తించే విధానాన్ని సోషల్‌ మీడియాలో సైతం షేర్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మన వంటిళ్లలో ఎప్పుడూ అందుబాటులో ఉంటే మిరియాలను పరీక్షించే విధానాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అది ఎలాగో తెలుసుకుందాం.

శాస్త్రీయ అధ్యయనాల  స్పైసెస్‌  (spices) ప్రయోజనాలను సంప్రదాయ జ్ఞానాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. అయితే, ఈ మసాలా దినిసుల్లో కల్తీ సమస్యగా మారింది. నల్ల మిరియాలు మన దేశీయ వంటకాల్లో అంతర్భాగం. అయితే దీన్ని సులభంగా కల్తీ చేయవచ్చని మీకు తెలుసా? మీరు కల్తీ ఉన్న మిరియాలను కొనుగోలు చేసి.. వాడటానికి ఇష్టపడరు. స్వచ్ఛమైన మిరియాలు, కల్తీ మిరియాల వ్యత్యాసాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు?

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. దీన్ని వారి అధికారిక ఇన్‌స్టాగ్రాం (Instagram)  పేజీలో షేర్‌ చేసింది. ‘Detecting blackberries adulteration in black peppers’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్‌ చేసింది. ఎక్కువ శాతం బ్లాక్‌ బెర్రీలతో నల్లమిరియాలను కలిపే అవకాశం ఉంది. దీనికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఒక సింపుల్‌ టెస్ట్‌ను సూచించింది.

ఇది కూడా చదవండి: మీకు తెలుసా? ఈ పండు తింటే.. బట్టతల రాదు!

పరీక్షించే విధానం..
కొద్దిగా నల్లమిరియాలు తీసుకోవాలి. వీటిని టేబుల్‌టాప్‌ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మీ బొటన లేదా ఏదైనా వేలుతో దీన్ని నొక్కాలి. లేకపోతే దాన్ని పొడి చేయడానికి ప్రయత్నించండి. కల్తీ లేని మిరియాలు సులభంగా విరిగిపోవు. కానీ, అందులో కల్తీవి ఉంటే వాటిలో కొన్ని విరిగిపోయాయి అంటే.. అందులో బ్లాక్‌ బెర్రీస్‌ కలిపినట్లే..
ఇంతకు ముందు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కారంపొడి కల్తీకి సంబంధించిన వీడియోను సైతం షేర్‌ చేసింది. ఈ ఎర్ర మిరప పొడిలో కలిపే ఇతర కల్తీ పదార్థాలు ఇటుకపొడి, ఇసుక లేదా టాల్కం పౌడర్‌.

మొదట ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్‌ స్పూన్‌ చిల్లీ పౌడర్‌ను కలపాలి. అప్పుడు దాన్ని పరీక్షించాలి. కొద్దిపాటి మిశ్రమాన్ని చేతిలో తీసుకుని రబ్‌ చేయాలి. ఇసుక రేణువులు ఉంటే తెలిసిపోతుంది. అప్పుడు మీరు వాడే కారం కల్తీ జరిగిందని గుర్తించవచ్చు. ఒకవేళ సబ్బు మాదిరి జిగురుగా ఉంటే.. ఇందులో సోప్‌స్టోన్‌ soap stone వాడినట్లు గుర్తించాలి.

ఇది కూడా చదవండి: ఈ సినిమా చూస్తే.. భార్యాభర్తలు విడాకులు అస్సలు తీసుకోరట!

పసుపు స్వచ్ఛతను పరీక్షించే విధానం..ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ముందుగా గ్లాసు నీరు తీసుకోవాలి. అందులో కాసింత పసుపు పొడిని కలపాలి. ఒకవేళ పసుపు కల్తీ చేస్తే.. నీరు మరింత పసుపు రంగులోకి మారి , పసుపు స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా పసుపు కల్తీని గుర్తించవచ్చు. ఒకవేళ మీరు వాడే పసుపు కల్తీ అయి ఉంటే.. దాన్ని వెంటనే మార్చడానికి ప్రయత్నించండి.
Published by:Renuka Godugu
First published:

Tags: Food

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు