అనుమానస్పద స్థితిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ షర్బరి దత్తా మృతి

ప్రముఖ ప్యాషన్ డిజైనర్ షర్బరి దత్త(63) అనుమానస్పద స్థితిలో మరణించారు. గురువారం అర్ధరాత్రి దాటాక తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో విగతా జీవిగా కనిపించారని పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: September 18, 2020, 12:22 PM IST
అనుమానస్పద స్థితిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ షర్బరి దత్తా మృతి
షర్బరి దత్తా
  • Share this:
ప్రముఖ ప్యాషన్ డిజైనర్ షర్బరి దత్త(63) అనుమానస్పద స్థితిలో మరణించారు. గురువారం అర్ధరాత్రి దాటాక తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో విగతా జీవిగా కనిపించారని పోలీసులు తెలిపారు. మంగళవారం డిన్నర్ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెను చివరిసారిగా కలిశారు. అప్పటి నుంచి ఆమె దక్షిణ కోల్‌కత్తాలోని నివాసంలో ఒంటరిగానే ఉంటుంది. అయితే బాత్‌రూమ్‌లో ఉండగా సడన్‌గా గుండెపోటు రావడంతో ఆమె మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు.

ఘటన స్థలానికి చేరుకున్న కోల్‌కతా పోలీసు హోమిసైడ్ విభాగం ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ చేపట్టింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షకు పంపించారు. ఇక, షర్బరి తండ్రి ప్రముఖ బెంగాల్ కవి అజిత్ దత్తా. గతకొన్ని దశాబ్దదాలుగా కాస్ట్యూమ్ డిజైనింగ్ రంగంలో కొనసాగుతున్న ఆమె చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పురుషుల ఎథినిక్ వేర్ డిజైన్ చేయడంతో ఆమె స్పెషలిస్ట్‌గా ఉన్నారు. కలర్‌ఫుల్ బెంగాలీ దోతీలను, పంజాబీ కుర్తాలను తనదైన మేకింగ్‌తో మెయిన్ స్ట్రీయిమ్ ఫ్యాషన్ రంగంలోకి తీసుకొచ్చారు.

పోస్టు మార్టం రిపోర్ట్, పోలీసుల విచారణ అనంతరం షర్బరి దత్త మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇక, ఆమె మృతిపై పులువురు ప్యాషన్ రంగ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading