సెక్స్‌‌‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది రైతులే.. ఆ తర్వాత ఎవరో తెలుసా?

టీచర్లు, లాయర్లు తమ శృంగార జీవితం నిస్సత్తువగా సాగుతోందని చెప్పారు.

news18-telugu
Updated: October 31, 2019, 6:49 PM IST
సెక్స్‌‌‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది రైతులే.. ఆ తర్వాత ఎవరో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శృంగారంలో అందరి కంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఎవరనే సందేహం కొంతమందికి వస్తుంటుంది. అలాంటి సందేహమే ఓ సర్వే సంస్థకు కూడా వచ్చింది. దీంతో యూకేలోని లేలో అనే సంస్థ.. శృంగార జీవితాలపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 2వేల మంది పురుషులు, స్త్రీలు పాల్గొన్నారు. వివిధ వృత్తులు, ఉద్యోగాలు చేసేవారు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఆ సర్వే ప్రకారం.. అత్యంత ఎక్కువగా సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేది రైతులే. 33 శాతం మంది రైతులు తమ శృంగార జీవితం అద్భుతంగా ఉందని తెలిపినట్టు సర్వే సంస్థ పేర్కొంది. రోజుకు ఒక్కసారైనా తాము తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొంటామని చెప్పారు.

రైతుల తర్వాత బెడ్‌రూమ్‌లో బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్న వారు ఆర్కిటెక్ట్‌లు. 21 శాతం మంది ఆర్కిటెక్ట్‌లు తమ శృంగార జీవితం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగిపోతుందని చెప్పారు. రైతులు, ఆర్కిటెక్ట్‌ల తర్వాత ప్లేస్‌లో హెయిర్ డ్రెస్సర్‌లు ఉన్నారు. 17 శాతం మంది హెయిర్‌డ్రెస్సర్‌లు తమ సెక్సువల్ లైఫ్ బాగుందని చెప్పారు.

టీచర్లు, లాయర్లు తమ శృంగార జీవితం నిస్సత్తువగా సాగుతోందని చెప్పారు. అందరికంటే చివరి స్థానంలో ఎవరున్నారో తెలుసా. జర్నలిస్టులు. జర్నలిస్టులు నెలలో ఒక్కసారి కూడా తాము బెడ్‌రూమ్ సుఖాన్ని ఆస్వాదించడం లేదని చెప్పారు.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు