Falooda @ Home : ఇంట్లోనే ఫలుదా తయారు చేసుకోండిలా..

సమ్మర్ రాగానే ఫలూదా తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఆ టేస్టీ డ్రింక్‌‌ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 9:55 AM IST
Falooda @ Home : ఇంట్లోనే ఫలుదా తయారు చేసుకోండిలా..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 9:55 AM IST
ముందుగా ఫలూదా తయారీకి కావాల్సిన పదార్థాలు : కార్న్ ఫ్లోర్ -ఒక కప్పు, నీళ్ళు -రెండున్నర కప్పులు, షుగర్ - ఒక చెంచా, ఐస్ వాటర్ -బాటిల్, ఐస్ క్యూబ్స్ -1 ట్రే.
తయారు విధానం.. ముందుగా కార్న్‌ఫ్లోర్‌లో నీటిని కలిపండి.. ఇప్పుడు ఒక ప్యాన్‌లో పిండి మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఆ పిండి గట్టిపడి ప్యాన్ నుంచి విడిపోయేవరకూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకుని అందులో ఐస్‌వాటర్, ఐస్‌ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు తయారైన పిండి ముద్దని మురుకుల(కారపూస) మిషన్‌ సాయంతో నూడుల్స్‌లా ఒత్తుకోవాలి. దాన్ని అలానే ఓ 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి. (ఇదంతా కష్టమనుకుంటే బయట దొరికే ఫలుదా సేమియాను కొనుక్కోవచ్చు.)
ఫలూదా తయరీకి కావాల్సిన పదార్థాలు..

ఫలూదా సేమియా - ఓ కప్పు, సబ్జాగింజలు -2 టేబుల్ స్పూన్లు, రోజ్ సిరప్-2 టేబుల్ స్పూన్స్, చక్కెర -పావు కప్పు, పాలు-అరలీటరు, డ్రైఫ్రూట్స్,టూటీ ఫ్రూటీ, అంజీర్ అన్నీ కలిపి -పావు కప్పు, ఇష్టమైన ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్-అభిరుచికి తగినట్లుగా....(ఇవి మనం ఎంతమందికి చేస్తున్నామో ఆ కొలతను బట్టి ఉంటుంది, అరలీటర్ పాలను ఇద్దరికీ చేయొచ్చు గమనించగలరు, మిగతా పదార్థాలను మన అభిరుచికి తగ్గట్లుగా తీసుకోవచ్చు.)
తయారు చేసే విధానం.. ముందుగా సబ్జాగింజలను ఓ 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు పాలను తీసుకుని బాగా మరిగించి చక్కెర కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో రోజ్ సిరప్ ఓ స్పూన్ వేసి కలపాలి. ఇప్పుడు గాజు గ్లాసెస్ తీసుకుని ముందుగా వాటిని సిరప్‌తో గార్నిష్ చేయాలి ఆ తర్వాత పాలను పోయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసిన ఫలుదా సేమియాను వేసుకోవాలి. అదేవిధంగా నానబెట్టిన సబ్జా గింజలను కూడావేయాలి. ఆ తర్వాత పెద్ద చెంచాతో ఐస్‌క్రీమ్ వేసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌, టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. చివరగా రోజ్ సిరప్‌తో గార్నిష్ చేసుకుంటే సరి.. ఎంతో టేస్టీగా ఉండే ఫలూదా డ్రింక్ తయారైనట్టే.. ఇది ఎప్పటికప్పుడు మీరే ఫ్రెష్‌గా తయారుచేసుకుని తాగొచ్చు.
(ఫలుదాలో వేసే సేమియాను తయారు చేసుకుని ఫ్రిజ్‌లో పెడితే వారంరోజుల వరకు నిల్వ ఉంటుంది. )



ఇవికూడా చదవండి..

JEE ADVANCED 2019 : జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీలో మార్పు.. మే 27న 

ఎండల్లో బయటికి వెళ్తున్నారా.. ఈ మజ్జిగ తాగండి.. ఎలా చేయాలంటే..

Summer Tips : దాహంగా ఉందని కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..

గాలి నుంచి నీటిని తయారు చేయొచ్చట..
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...