హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Talking in sleep: నిద్రలో కలవరిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే

Talking in sleep: నిద్రలో కలవరిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిద్రలో కలవరిస్తూ ఉన్న సమయంలో లైట్ తీసుకుంటూ ఉంటారు.  అయితే అలా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నిద్రలో ఎపుడైనా కలవరింతలు పెట్టడం చూశారా? చాలా కామన్ (common)​గా చూసే ఉంటాం. మనం ఇంట్లో వాళ్లో, ఎదురింటి వారో.. తెలిసిన స్నేహితుడూ.. లేదో మీరు కావచ్చు. తప్పక తెలిసే ఉంటుంది. నిద్రలో కలవరిస్తూ ఎన్నో విషయాలను మాట్లాడుతూ (Talk) ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని నిజాలను (Truths) కూడా బయట పెడుతూ ఉంటారు అన్నది అటు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అంటే అప్పుడప్పుడు కొంతమంది ఇలాగే నిద్రలో కలవరిస్తూ ఉంటారు.  ఇక రోజంతా (day) జరిగిన విషయాల్లో తమకు బాగా గుర్తుండే విషయాన్ని (Remembered matters) ఇక నిద్రలో కలవరిస్తూ ఉండటం చేస్తూ ఉంటారు. ఇలా నిద్ర (Sleep)లో కలవరించడం అనేది ఎక్కువగా ఒత్తిడి ఉన్న వాళ్లలో, లేదా ఏదైనా విషయాన్ని పదేపదే తలుచుకున్నపుడు చోటుచేసుకుంటూ ఉంటుందట.

  ఇలా చిన్న పిల్లలు (Children) తరచూ నిద్రలో కలవరిస్తూ ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఇక ఏదో మామూలుగా పిల్లలు నిద్రలో కలవరిస్తూ ఉన్నారులే అనుకుని లైట్ తీసుకుంటూ ఉంటారు.  అయితే అలా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

  నిద్రలో కలవరించడం ఈ శాస్త్ర పరిభాషలో సోమ్నీ లోక్వి(Somniloquy) అని అంటారట.  ఇది కేవలం కొంత మందిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. 3 నుంచి పదేళ్లలోపు వయసు ఉన్న పిల్లలు ఇలా నిద్రలో ఎక్కువగా మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది అని చెబుతున్నారు.

  నిద్రలో చిన్న పిల్లలు మాట్లాడటం సాధారణమే అయినప్పటికీ ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఎంతో మేలు అంటూ నిపుణులు సూచిస్తున్నారు. చిన్న పిల్ల్లలోనేనా పెద్ద వాళ్లలో ఉండదేమో అనుకోవద్దు. పెద్దల్లో కూడా ఐదు శాతం మంది ఇలా నిద్రలో కలవరించే (Somniloquy) వారు ఉంటారు అని నిపుణులు (experts) చెబుతున్నారు.

  ఇలా నిద్రలో కలవరిస్తూ ఉండటానికి కారణం పీడకలలు (bad dreams) ఎమోషనల్ ఒత్తిడి (Stress) మానసిక ఆరోగ్యం పాడవడం (Mental health damage) లాంటివి అని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఒక రోజులో ఏ పని అయితే ఎక్కువగా మెదడు (brain)ను ప్రభావితం చేస్తుందో ఇక దానికి సంబంధించి నిద్రలో కలవరించే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.

  అంతేకాకుండా రోజువారి పనులు, ఆటలు (Games) సంభాషణలు కూడా అప్పుడప్పుడు కలవరిస్తూ ఉంటారట. అయితే ఇలా పిల్లలు నిద్రలో భయపడుతూ ఏదైనా కలవరిస్తూ ఉంటే వారిని వెంటనే దగ్గరికి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు  ఇలాంటి కలవరింతలు ఎక్కువ అయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు అంటూ సూచిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Health alert, Sleep tips

  ఉత్తమ కథలు