Health Tips : ఫేస్ యోగా గురించి తెలుసా.. రెగ్యులర్‌గా చేస్తే యవ్వనంగా మారతారు..

ప్రతీకాత్మక చిత్రం

మారిన పద్ధతుల కారణంగా చాలామంది చిన్నవయసులోనే ముఖంపై ముడతలు ఏర్పడి.. ముఖం కాంతివిహీనంగా మారుతుంది. ఫేస్ యోగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.

  • Share this:
అందంగా కనిపించేందుకు చాలామంది ఏవేవో చేస్తుంటారు. కొంతమంది బ్యూటీపార్లర్స్, సర్జరీలను ఆశ్రయిస్తే మరికొంతమంది ఇంట్లోనే ఏవేవో చిట్కాలను పాటిస్తుంటారు. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖంపై ముడతలు, ఫేస్ ఫ్యాట్ ఉన్నవారు ఈ ఆసనం వేయడం వల్ల చక్కని ముఖాకృతి ఏర్పడి అందంగా మారతారు. అంతేకాదు.. ముఖం చక్కగా కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు ఫేస్ యోగా చేయాలో చూద్దాం...
* ఫేస్‌యోగాలో ముందుగా బుగ్గల నుండి గాలి నింపి 10 లెక్కబట్టాలి. ఆ తర్వాత బుగ్గలను కుడివైపుకి ఒకసారి, ఎడమవైపుకి ఒకసారి ఉంచాలి.
* రెండు వేళ్లతో ఒక కనుబొమ్మను మెల్లిగా పైకి లాగి దించండి.. అలా రెండు ఐబ్రోస్ చేయాలి. ఇలా అయిదారుసార్లు చేయాలి.
* ఇప్పుడు ‘x’, ‘o’ అనే లెటర్స్‌ని పలకాలి ఓ 10 లెక్కబెట్టాలి.
* ఇప్పుడు రెండు చూపుడు వేళ్లతో పెదవుల చివర్లు పట్టుకుని సాగదీసి వదిలేయాలి. ఇలా అయిదారుసార్లు చేయడం మంచిది.
* ఇప్పుడు పెదవులని మూసి ఎంత వీలైతే అంత నవ్వాలి.. ఇలా 5 సెకన్లు ఉంచాలి.
* తర్వాత చేపలా పెదవులను ఉంచి ఓ 5 నుంచి 10 సెకన్లు ఉండాలి. ఇలా చేయడం వల్ల చీక్స్ దగ్గర ఉండే ఫ్యాట్ కరిగిపోతుంది.
* ముఖం తిప్పకుండా కళ్లను కుడివైపు నుంచి ఎడమవైపుకి చూస్తుండాలి. ఇది ఓ 5సెకన్లు చేయాలి.
* నోటిని ఎడమవైపు తిప్పుతూ నాలిక చిన్నగా బయటపెట్టాలి.
* ఇప్పుడు తలని ఆకాశంవైపు చూస్తు ఓ 10 లెక్కబెట్టాలి.
* డబుల్ చిన్ తగ్గడానికి తలను కుడి, ఎడమవైపుకి పైగా ఉంచాలి.
* ముందు చెప్పుకున్నట్లు ఎంత నవ్వినట్లు చేశామో అలా అంతే కోపం ఉన్నట్లు ముఖ కవళికలను చేయాలి.

ఈ వీడియో చూడండి..

First published: